Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన కోట ఇదే...!

భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన కోట ఇదే...!

అద్భుతమైన పర్వత శ్రేణుల నుండి శుష్క ఎడారులు, నదులు, జలపాతాల వరకు అడవులు, గడ్డి భూముల వరకు, భారతదేశం విభిన్నమైన మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉంది. దేశంలో ట్రెక్కింగ్ కోసం అనేక భూభాగాలు ఉన్నాయి. ఇవన్నీ వాటి ప్ర‌కృతి అందాల‌కు ప్ర‌సిద్ధి చెందాయి. ప్రపంచంలోని కొన్ని ప్రమాదకరమైన ట్రెక్‌లకు భారతదేశం కూడా నిలయంగా ఉంది. అయితే ఈ ప్రమాదకరమైన దృశ్యాలను అన్వేషించకుండా ఔత్సాహికులను ఆప‌లేం. కానీ, దేశంలోని అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన కోట గురించి ఎప్ప‌డైనా విన్నారా? ఆ కోట గురించే ఇప్పుడు తెలుసుకుందాం ప‌దండి.

దేశంలోని అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన కోట మ‌హారాష్ర్ట‌లో ఉంది. దీని పేరు కలవంతిన్ కోట. ఇది దేశంలోని అత్యంత ప్రమాదకరమైన కోటలలో ఒకటిగా పరిగణించబడింది. దీన్ని దేశంలోని అత్యంత ప్రమాదకరమైన కోట అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దని తెలిసినా, ఇప్పటికీ ప్రజలు ఈ 2300 అడుగుల ఎత్తైన కోటపై ట్రెక్కింగ్ కోసం రోజూ వెళ్తుంటారు. ఆశ్చర్యంగా ఉంది క‌దా! పైగా ఈ కోట ఎక్కడానికి సన్నటి మెట్లు మాత్రమే ఉంటాయి. రెండు వైపులా ఒక గుంట ఉంటుంది. ఆ ప్ర‌యాణంలో ఏ మాత్రం కాలుజారినా ఇక అంతే..

1

కోట గురించి..

బహమనీ సుల్తానేట్ కాలంలో పన్వేల్, కళ్యాణ్ కోటలపై నిఘా ఉంచేందుకు ఈ కోటను నిర్మించారు. కానీ క్రీ.శ. 1458లో అహ్మద్‌నగర్ సుల్తానేట్ ఓటమి కారణంగా ఈ కోట వారి నుండి జ‌ప్తు చేసుకున్నారు. కలవంతి కోట సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన చాలా మంది కింద పడి చనిపోయారని ఇక్క‌డి వారు చెబుతున్నారు. పూర్వం ఈ కోట‌ను మురంజ‌న్ కోట‌గా పిలిచేవారు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ హయాంలో దీని పేరు మార్చబడింది. శివాజీ మహారాజ్ ఈ కోటకు రాణి కళవంతి అనే పేరు పెట్టారు. ఈ కోటను చూసేందుకు దేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.

ఈ కోట ఎక్కడ ఉంది

ప్రబల్‌గడ్, కలవంతిన్ దుర్గాకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రబల్‌గడ్ వాణిజ్య మార్గంలో, సముద్ర మార్గానికి సమీపంలో ఉన్నందున, యాదవుల కాలంలో ఇక్కడ సైనిక స్థావరం స్థాపించబడింది. ప్ర‌బ‌ల్‌ఘ‌డ్ కోట మహారాష్ట్రలోని రాయ్‌ఘ‌డ్‌లో ఉంది. ఈ కోట మాథెరన్ మరియు పన్వెల్ మధ్య ఉంది. దీని నిర్మాణం, ఎత్తు ప‌ర్యాట‌కుల‌ను మరింతగా ఆకర్షిస్తుంది. ఇది భారతదేశంలోని ఎత్తైన మరియు అత్యంత ప్రమాదకరమైన కోటలలో ఒకటిగా పరిగణించబడింది. రాయగఢ్ జిల్లాలో ఉన్న ఈ కోట చుట్టూ అనేక అద్భుతమైన దృశ్యాలు కూడా కనిపిస్తాయి.

సూర్యాస్తమయానికి ముందే ప్రజలు తిరిగి వస్తారు

సూర్యాస్తమయం కంటే ముందే పర్యాటకులు ఈ కోట నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఎందుకంటే సాయంత్రం పూట ఇక్కడి నుండి తిరిగి రావడం దాదాపు అసాధ్యం కాబ‌ట్టి. ఎందుకంటే పగటిపూట మాత్రమే ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయొచ్చు. అంతే కాకుండా ఇక్కడ నీరు, కరెంటు వంటి సౌక‌ర్యాలు కూడా అందుబాటులో ఉండ‌వు. అందుకే ప్రజలు సాయంత్రం కాగానే కోట నుండి దిగడం ప్రారంభిస్తారు.

2

కోట చుట్టూ రెయిలింగ్, తాడు లేదు

ఈ కోట చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ రెయిలింగ్ లేదా తాడు వంటివి ఏవీ ఉండ‌వు. ఒక్కో మెట్టు జాగ్ర‌త్త‌గా ఎక్కాల్సి ఉంటుంది. రెండు అడుగులు ఎత్తులో ఉండే వంద‌లాది మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కోట మెట్లు ఎక్కినా కిందకు దిగే ధైర్యం అంద‌రికి ఉండ‌దు. ఇక్క‌డ చేసే చిన్న పొరపాటు మరణానికి దారి తీస్తుంది. ఇక్కడ గతంలో ఇద్దరు పర్యాటకులు కిందపడి చనిపోయారని తెలిసింది. ఈ ప్రమాదాల అనంతరం స్థానిక అధికారులు ఇక్కడ పర్యాటకుల భద్రతకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. పర్యాటకులు పైకి వెళ్లడానికి ముందు తమ వ్యక్తిగత వివరాలను అందించాల్సి ఉంటుంది. అలాగే పైకి వెళ్లాలంటే ఇర‌వై రూపాయ‌ల‌ను చెల్లించాలి.

సాయంత్రం ఐదు నుండి ఉదయం ఆరు గంటల వరకు ప‌ర్యాట‌కుల‌కు ఎవ్వ‌రికి ఇక్క‌డ అనుమ‌తి ఉండదు. అలాగే పగటి పూట వెళ్లాలంటే స్థానిక గైడ్‌లను వెంటబెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే పైకి అనుమ‌తి ఉండదు. గైడ్‌ల‌కు అద‌నంగా యాభై రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. సాయంత్రం వేళ, ఇక్కడ కొంచెం చ‌లిగా కూడా ఉంటుంది. ఎందుకంటే కోట అన్ని వైపుల నుండి తెరిచి ఉంటుంది కాబ‌ట్టి. అంతేకాకుండా, ఇక్క‌డ ప్రతిచోటా పచ్చదనం, రాళ్ళు ఉంటాయి. అందుకే ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతాన్ని సంద‌ర్శించాల‌నుకుంటే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. ఏమైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం ఇలాంటి ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

కలవంతి కోటకు ఎలా చేరుకోవాలి

విమాన మార్గం ద్వారా అయితే, ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి 50 కిలోమీట‌ర్ల‌ దూరంలో ప్రబ‌ల్‌ఘడ్‌ సమీపంలో ఉంది. ముంబై విమానాశ్రయం నుండి ప్రబ‌ల్‌ఘ‌డ్‌కు నేరుగా టాక్సీలో వెళ్లి విమాన‌శ్ర‌యాన్ని చేరుకోవ‌చ్చు.

రైలు ద్వారా అయితే, ప్రబ‌ల్‌ఘ‌డ్‌ నుండి సమీప స్టేషన్ పన్వెల్ స్టేషన్. నవీ ముంబై మరియు ముంబై నుండి లోకల్ రైలును కూడా తీసుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే ప్ర‌బ‌ల్‌ఘ‌డ్ నుండి బ‌స్సులు అందుబాటులోఉంటాయి. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా బస్సును ఎక్కి ప్రధాన బస్టాండ్ పన్వెల్‌కు చేరుకోవ‌చ్చు. అక్క‌డి నుండి టాక్సీలు, క్యాబ్‌లు నిత్యం అందుబాటులోనే ఉంటాయి.

More News

    Read more about: maharashtra india
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+