Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలాన్ని ఆస్వాదించాలంటే.. ఈ హిల్‌స్టేష‌న్‌ల‌కు వెళ్లాల్సిందే!

వ‌ర్షాకాలాన్ని ఆస్వాదించాలంటే.. ఈ హిల్‌స్టేష‌న్‌ల‌కు వెళ్లాల్సిందే!

వ‌ర్షాకాలాన్ని ఆస్వాదించాలంటే.. ఈ హిల్‌స్టేష‌న్‌ల‌కు వెళ్లాల్సిందే!

వర్షాకాలంలో హిల్ స్టేషన్‌ల‌ను సంద‌ర్శించాల‌ని అనుకుంటున్నారు. అయితే మీ ఆలోచ‌న‌ను కాస్త ప‌క్క‌కి నెట్టండి. ఎందుకంటే ఇక్కడ మారుతున్న వాతావరణం కారణంగా, ప్రయాణంలో అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉత్తరాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వంటి ప్రాంతాలైనేతే మీ ప్ర‌యాణ‌పు జాబితా నుంచి తొల‌గించేయండి. ఎందుకంటే ఈ సీజ‌న్‌లో ఆ ప్రాంతాల్లో ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు చాలానే ఉన్నాయి.

అధిక వ‌ర్షాల కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం, దారులు మూసివేయ‌డం వంటివి జ‌ర‌గొచ్చు. కాబ‌ట్టి ఆ ప్రాంతాల‌ను ఎంచుకోక‌పోవ‌డ‌మే మంచిది. వ‌ర్షాకాలంలో ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ విహారించాల‌నే ఆలోచ‌న ఉంటే మాత్రం ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి. వ‌ర్షాకాలంలో ర‌ద్దీ త‌క్కువ‌గా ఉండే హిల్‌స్టేష‌న్‌లు కొన్ని ఉన్నాయి. వాటిని మీ ప్రణాళిక‌లో చేర్చండి. ఈ సీజ‌న్‌లో ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌డం ప‌ర్యాట‌కులకు మ‌రో కొత్త అనుభూతినిస్తుంది. రండి ఆ ప్ర‌దేశాలేంటో చూద్దాం.

1

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య ప్రాంతంలో చాలా అందమైన ప్రదేశం. వ‌ర్షాకాలంలో సంద‌ర్శ‌నకు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. తూర్పు హిమాలయ శ్రేణుల మధ్య ఉన్న ఒక చిన్న పట్టణం. తవాంగ్ ఈశాన్య భారతదేశంలోని 400 సంవత్సరాల పురాతన మఠానికి ప్రసిద్ధి చెందిన పట్టణం. ఈ మఠం భారతదేశంలో కనిపించే అతిపెద్ద బౌద్ధ ఆరామాలలో ఒకటి. బౌద్ధమతపు అనుచరులకు ఒక ముఖ్యమైన యాత్రా కేంద్రం. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, తవాంగ్ దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది యాత్రికులను ఆకర్షిస్తుంది. కానీ ఇప్పటికీ మీరు ఇక్కడ పర్యాటకుల రద్దీని చూడలేరు. తవాంగ్ టిబెట్‌, భూటాన్ సరిహద్దులో ఉంది ఈ ప్రాంతం. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, బౌద్ధ విహారాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

2

ఏర్కాడ్, తమిళనాడు

తమిళనాడుకు వచ్చే చాలా మంది ప్రజలు ఊటీ, కొడైకెనాల్ వైపు మొగ్గు చూపుతారు. కానీ, చాలామంది తెలియ‌నిదేమిటంటే ఏర్కాడు హిల్‌స్టేష‌న్ త‌మిళ‌నాడులో ప్ర‌సిద్ధి చెందిన ప్రాంతం. కాక‌పోతే ఇక్క‌డ ర‌ద్దీ అంత‌గా కనిపించదు. ఏర్కాడ్ చల్లని వాతావరణం, విస్తారమైన కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్నిసంద‌ర్శించిన‌ప్పుడు ఇక్క‌డి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన‌ సర్వరాయన్ ఆలయానికి ఖచ్చితంగా వెళ్లండి.

పెల్లింగ్, సిక్కిం

మంచుతో కప్పబడిన పర్వతాలు, పర్వత శిఖరాల నుండి విశాల దృశ్యాలు ఈ ప్రదేశానికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఈ నగరం నుండి కాంచన్‌జంగా అద్భుతమైన దృశ్యాలను చూడొచ్చు. ఆగస్టు నెలలో ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ఇక్క‌డ ప్ర‌తిఏటా జ‌రిగే వార్షిక కాంచనజంగా పండుగను ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు. సింగ్‌షోర్ వంతెన, ఛంగే జలపాతం, ఖేచుపేరి సరస్సులు ఇక్క‌డి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు.

హఫ్లాంగ్, అస్సాం

అస్సాంలోని ఏకైక హిల్ స్టేషన్ హఫ్లాంగ్. సుదూర పచ్చదనం, పర్వతాలు, జలపాతాలు ప‌ర్యాట‌కుల యాత్రను ఎంతో ఆహ్లాదపరుస్తాయి. ఈ ప్రదేశాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. అస్సాం సంస్కృతిని దగ్గరగా చూడాలనుకునే వారు త‌ప్ప‌కుండా హఫ్లాంగ్‌ను సంద‌ర్శించాల్సిందే. ఈ ప్రాంతం అస్సాం సంస్కృతి సంప్ర‌దాయాల‌కు నెల‌వు.

3

కూనూర్, తమిళనాడు

కూనూర్ పశ్చిమ కనుమలలో రెండవ అతిపెద్ద హిల్ స్టేషన్. ఇది టీ తోటలు, అనేక ఇతర ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం వేసవిలో సందర్శించడానికి ఉత్తమమైనది అయినప్పటికీ, వర్షాకాలంలో కూడా ఇక్కడి దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను మైమ‌రింప‌జేస్తాయి. ఇది దక్షిణ భారతదేశంలోని ఉత్తమ ట్రెక్కింగ్ గమ్యస్థానాలలో ఒకటి. ట్రెక్కింగ్‌, ఫొటోగ్ర‌ఫి ప్రియులు త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిన ప్రాంతం కూనూరు.

More News

    Read more about: tawang arunachal pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+