Search
  • Follow NativePlanet
Share
» »ఆకాశ వీధిలో ప్యారగ్లైడింగ్ చేస్తారా

ఆకాశ వీధిలో ప్యారగ్లైడింగ్ చేస్తారా

భారత దేశంలో ప్యారగ్లైండింగ్ కు అనుకూలమైన ప్రాంతాల గురించి.

వినీలాకాశంలో ఎగురుతూ చుట్టు ప్రకతి అందాలను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా ఆకాశంలో ఎగురుతూ ప్రకతి అందాలను చూడటానికి మీకు ప్యారాగ్లైడింగ్ చాలా అనుకూలమైనది. ప్యారాగ్లైడింగ్ కు వాతావరణ అనుకూలత కూడా అవసరం. ఇక భారత దేశంలో ప్యారగ్లైడింగ్ కు అనుకూలమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు మీ కోసం...

ఇక్కడ దయ్యాలు మనుష్యులను తింటున్నాయిఇక్కడ దయ్యాలు మనుష్యులను తింటున్నాయి

ఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలుఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలు

మీ గురుబలం ఇక్కడికి వెళితే మారిపోతుంది.మీ గురుబలం ఇక్కడికి వెళితే మారిపోతుంది.

మనాలి, హిమాచల్ ప్రదేశ్

మనాలి, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని సోలాంగ్ వ్యాలి చలికాలంతో పాటు వేసవి కాలంలో నిర్వహించే క్రీడా పోటీలకులకు అత్యంత అనుకూలమైప్రాంతం. ప్యారచూటట్, స్కేటింగ్, ప్యారగ్లైడింగ్ వంటి ఎన్నో క్రీడలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల చాలా మంది ఇక్కడకు ఈ క్రీడలను ఆడటానికి తరుచుగా వస్తుంటారు.

బ్రహ్మంగారే కాదు మరొకరు కూడా కాలజ్జానాన్ని రాశారుబ్రహ్మంగారే కాదు మరొకరు కూడా కాలజ్జానాన్ని రాశారు

బిర్ బిల్లింగ్, హిమాచల్ ప్రదేశ్

బిర్ బిల్లింగ్, హిమాచల్ ప్రదేశ్

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ లోని జోగిందర్ నగర వ్యాలీనీని భారత దేశ ప్యారగ్లైడింగ్ రాజధాని అని పిలుస్తారు. అంతగా ఈ ప్రదేశం ప్యారగ్లైడింగ్ కు ఫేమస్ అయ్యింది. ఇక్కడ ప్యారగ్లైడింగ్ చేసేవారు బిల్లింగ్ అనే ప్రదేశంలో టేకాఫ్ అయ్యి బిర్ అనే గ్రామంలో ల్యాండింగ్ అవుతారు.

ఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చుఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చు

కుంజపురి, ఉత్తరఖండ్

కుంజపురి, ఉత్తరఖండ్

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని రిషికేష్ సాహసక్రీడలకు పెట్టింది పేరు. ముఖ్యంగా కుంజపురి. ఈ కుంజపురిని ఉత్తరఖండ్ ప్యారగ్లైడింగ్ రాజధాని అని పిలుస్తారు. ఇక్కడ ప్యారగ్లైండింగ్ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.

కామశేట్, మహారాష్ట్ర

కామశేట్, మహారాష్ట్ర

P.C: You Tube

పూణే నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామశేట్ ఉంది. అదే విధంగా మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాల నుంచి కూడా కామశేట్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్న రెండు ప్యారగ్లైడింగ్ ప్రాంతాల్లో కామశేట్ ఒకటి. ఇక్కడ అక్టోబర్ లో ప్యారగ్లైడింగ్ సీజన్ మొదలవుతుంది.

ఎలగిరి, తమిళనాడు

ఎలగిరి, తమిళనాడు

P.C: You Tube

తమిళనాడులోని ఎలగిరి ప్రముఖ హిల్ స్టేషన్. అంతే కాకుండా ఈ ఎలగిరి సహసక్రీడలకు కూడా ప్రసిద్ధిగాంచినది. వనియంబడి, తిపుటూరు మార్గంలో చిన్న కొండప్రాంతమే ఎలగిరి. అక్టోబర్ లో ప్యారాగ్లైడింగ్ కోసం ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు.

సిక్కిం

సిక్కిం

P.C: You Tube

ఈశాన్య భారత దేశంలో సిక్కిం అత్యంత ప్రసిద్ధి చెందిన ప్యారాగ్లైడింగ్ డెస్టినేషన్. ఇక్కడ ప్యారగ్లైడింగ్ సమయంలో తెల్లటి దూదె పింజల్లాంటి హిమాలయ పర్వతాల అందాలను చూస్తూ ముందుకు వెళ్లవచ్చు. అందువల్లే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడకు ఎక్కువ మంది ప్యారగ్లైడర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

గోవా

గోవా

P.C: You Tube

భారతదేశంలో పర్యాటక రంగంలో గోవాది ప్రత్యేక స్థానం. ఇక్కడ బీచ్ లు అనేక సాహస క్రీడలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే గోవాలోని అరంబోల్ బీచ్ ప్యారగ్లైడింగ్ కు అత్యంత అనుకూలమైనది. ఈ బీచ్ లో ప్యారగ్లైడింగ్ ఒక్కటే కాకుండా బోటింగ్, స్పీడ్ బోటింగ్ వంటి ఎన్నో క్రీడలు అందుబాటులో ఉన్నాయి.

పంచగణి, మహారాష్ట్ర

పంచగణి, మహారాష్ట్ర

P.C: You Tube

మహారాష్ట్రలో కమశేట్ తర్వాత ప్యారగ్లైడింగ్ కు అత్యంత అనుకూలమైన ప్రాంతం పంచగణి. ఇక్కడి సిడ్నీ పాయింట్, క`ష్ణా వ్యాలీ తదితర ప్రాంతాలు కూడా ఈ పంచగణి కిందికే వస్తాయి. పూనే, ముంబై నుంచి వీకెండ్ సమయంలో ఎక్కువ మంది ప్యారగ్లైడింగ్ కోసం పంచగణికి వస్తుంటారు.

బెంగళూరు, కర్నాటక

బెంగళూరు, కర్నాటక

P.C: You Tube

కర్నాటకలో ప్యారగ్లైడింగ్ కు అత్యంత అనుకూలమైన ప్రాంతం నందిహీల్స్. ఇది బెంగళూరు నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ నంది హీల్స్ ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఇక్కడ బోగ నందీశ్వర దేవాలయం కూడా ఉంది.

అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకొన్న దేవత ఉన్న క్షేత్రం తెలుసాఅయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకొన్న దేవత ఉన్న క్షేత్రం తెలుసా

షిల్లాంగ్, మేఘాలయ

షిల్లాంగ్, మేఘాలయ

P.C: You Tube

షిల్లాంగ్ ను స్కాంట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈ హిల్ స్టేషన్ మేఘాలయ రాజధాని కూడా. ఇక్కడ ప్యారగ్లైడింగ్ క్రీడకారులు దాదాపు 700 మీటర్ల ఎత్తువరకూ ప్రయాణించవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్జానంతో పాటు నిపుణుల సమక్షంలో ప్యారగ్లైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇక దేవాలయం ప్రవేశానికి రుతుస్రావం అడ్డుకాదుఇక దేవాలయం ప్రవేశానికి రుతుస్రావం అడ్డుకాదు

ఈ దసరా ఉత్సవాల్లో ఒక్కటైనా మీరు చూశారా?ఈ దసరా ఉత్సవాల్లో ఒక్కటైనా మీరు చూశారా?

l

<strong></strong>ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.ఇక్కడ వివాహిత మహిళలు ఐదు రోజులు దుస్తులు ధరించక నగ్నంగా ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X