Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ నగ్నంగా ఉండాలంటేనే వెళ్లండి

ఇక్కడ నగ్నంగా ఉండాలంటేనే వెళ్లండి

ఈశాన్య రాష్ట్రాలో హనీమూన్‌కు ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రాలు ఇవే

జీవితంలో మరుపురాని ఘట్టం వివాహం. అటు పై రెండు మనసులు ఏకాంతాన్ని కోరుకొంటూ కొత్త ప్రదేశాలను తిరిగి రావాలనుకొంటారు. దీని వల్ల వారి శరీరాలే కాకుండా మనస్సులు కూడా కలిసిపోయి మరో వందేళ్లు ఎటువంటి కలహాలు లేకుండా ఉంటారని నమ్ముతారు. అందువల్లే యువతీ, యువకులు ఈ హనీమూన్ కోసం కలలు కంటూ ఉంటారు. ఇటువంటి వారికి ఈశాన్య భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య భారత దేశంలో హనీమూన్‌కు అనువైన ప్రాంతాల వివరాలు మీ కోసం...

గ్యాంగ్‌టక్

గ్యాంగ్‌టక్

P.C: You Tube

సిక్కింలోనే కాకుండా భారతదేశంలో కూడా అత్యంత అందమైన నగరంగా గ్యాంగ్‌టక్‌కు పేరుంది. సముద్ర మట్టానికి 5,500 అడుగుల ఎత్తు ఉండటంతో ఇక్కడ ఏడాదిలో ఎప్పుడైనా చల్లని వాతావరణం ఉంటుంది. అందువల్లే ఇది హనీమూన్ ప్రత్యేక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ రాక్‌క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి సహసక్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే చాలా మంది ఇక్కడికి హనీమూన్‌కు వెలుతుంటారు.

షిల్లాంగ్

షిల్లాంగ్

P.C: You Tube

మేఘాలయకు వెళ్లిన వారు తప్పకుండా షిల్లాంగ్‌ను చూసి కాని వెనుదిరగరు. మేఘాలయాలో సుమారు 1,491 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ షింల్లాంగ్ తూర్పు ఖాసీ‌హిల్ జిల్లాలో ఇది ఒక భాగం. ఇక్కడ పర్వతశిఖరాలతో పాటు జలపాతాలూ కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. మేఘాలయ సంస్క`తి, సంప్రదాయాలకు ఈ ప్రాంతం నిలువుటద్దం ఈ షిల్లాంగ్.

పెల్లింగ్

పెల్లింగ్

P.C: You Tube

ఈశాన్య భారత దేశంలో హనీమూన్ జంటలు ఖచ్చితంగా వెళ్లే ప్రాంతం షెల్లింగ్. ఇక్కడ చల్లని మంచుపర్వతాలు మీలో వేడి కోర్కెలను రెచ్చగొడొతూ మీకు కేటాయించిన గదిలో నుంచి బయటకు రానివ్వవు. ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. ఇక్కడి నేషనల్ పార్కులు, నదుల పై కట్టిన వంతెనలు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడ కయాగింగ్, మౌంటైనింగ్ వంటి సాహసక్రీడలు అందుబాటులో ఉంటాయి.

రవాంగ్ల

రవాంగ్ల

P.C: You Tube

సిక్కింలో దాదాపు 7వేల అడుగుల ఎత్తులో రవాంగ్ల ఉంటుంది. ఇది గ్రేటర్ హిమాలయాల్లో ఒక భాగం. శృంగారం అంటే ఏమిటో తెలియని వారు కూడా ఇక్కడికి వస్తే ఆ కాముడికే కామశాస్త్రం నేర్పించగలిగే స్థితికి చేరుకొంటారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులే అని చెప్పవచ్చు. ఇక్కడి టీ తోటలు కూడా ఎంతగానో ఆకట్టు కొంటాయి.

ఆఫ్లాంగ్

ఆఫ్లాంగ్

P.C: You Tube

సముద్రమట్టానికి దాదాపు 680 మీటర్ల ఎత్తుగా ఉండే అఫ్లాంగ్ అస్సాంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం. ముఖ్యంగా అస్సాంకు వెళ్లినవారు ఆఫ్లాంగ్ ను సందర్శించి కాని వెనుతిరగరు. ఇక్కడకు చేరుకొన్నతర్వాత మీలో కామం తారాస్థియికి చేరుకుంటుందడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే హనీమూన్ జంటలకు ఇది రారమ్మని ఆహ్వనిస్తూ ఉంటుంది.

తవాంగ్

తవాంగ్

P.C: You Tube

అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. కనుచూపు మేర మంచుతో కప్పబడిన ఆ పర్వతాల మధ్య నచ్చిన నెచ్చెలి నడుపు పై చేయివేసి అలా పచ్చిక మైదానంలో కుర్చొని కాలును కాలుతో తాకించడం ఎవరూ చూడకుండా మెడ ఒంపుల్లో ముద్దులు పెట్టుకోవడానికి అవసరమైన ఎన్నో ప్రాంతాలు ఈ తవాంగ్ వద్ద ఎన్నో ఉన్నాయి.

మజులీ

మజులీ

P.C: You Tube

ప్రపంచంలోని అతి విశాలమైన నదీ ద్వీపం మజూలీ. ప్రక`తితో మమేకమై హనీమూన్ జరుపుకోవాలనుకొనేవారికి ఈ మజూలీ ఖచ్చితంగా నచ్చితీరుతుంది. అదువల్లే ఏడాదిపొడుగునా ఇక్కడకు నవదంపతులు వెలుతూ ఉంటారు. పర్యాటక పరంగా అరుణాచల్ ప్రదేశ్ ఆర్జిస్తున్న ధనంలో ఎక్కువ భాగం మజూలి నుంచే వస్తుంది.

లాచుంగ్

లాచుంగ్

P.C: You Tube

సిక్కిం రాష్ట్రంలో లాచుంగ్ ప్రక`తి సంపదకు నిలయం. అదే ప్రక`తితో మమేకమవుతూ దంపుతులు సమయాన్ని మరిచిపోవడానికి ఇక్కడికి వెలుతూ ఉంటారు. సముద్రమట్టానికి దాదాపు 8,610 మీటర్ల ఎత్తులో లాచుంగ్ ఉంటుంది. ఒక వైపు పర్వత శిఖరాల సోయగం, మరోవైపు నదీజలాల నవదంపతులను ఇట్టే ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు.

జీరో వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్

జీరో వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్

P.C: You Tube

అరుణాచల్ ప్రదేశ్‌లో జీరో ఓ ప్రముఖ హిల్ స్టేషన్. సముద్రమట్టానికి దాదాపు 1,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వరిపొలాలు, పైనాపిల్ తోటలతో పాటు వేల రకాల పూవ్వులతో కూడిన పర్వత లోయ ప్రాంతాలు ఈ జీరోవ్యాలీకి ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయి. నవదంపతులు ఉండటానికి అవసరమైన వసతి సౌకర్యాలు చాలా తక్కువ ధరకే ఇక్కడ లభిస్తాయి.

జంపూయి హిల్స్, త్రిపుర

జంపూయి హిల్స్, త్రిపుర

P.C: You Tube

అగర్తలకు దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జంపూయి ప్రముఖ హిల్‌స్టేషన్. ప్రక`తితో మమేకం కావాలనుకొన్నవారు ఇక్కడకు తప్పకుండా వెలుతూ ఉంటారు. ఇక్కడ సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.

l

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+