Search
  • Follow NativePlanet
Share
» »గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా దేశంలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి..

గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా దేశంలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి..

భార‌త్‌లో ప్ర‌తి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వ‌హించుకుంటారు. ఈ రోజునే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు కూడా సెలవు ఉంటుంది. ఈసారి జనవరి 26న లాంగ్ వీకెండ్ రాబోతుంది. అందులో ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకోవ‌చ్చు. భారతదేశంలో సంద‌ర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి, ఈ ప్రాంతాల‌ను వీక్షించేందుకు రెండు రోజుల సెలవు సరిపోదు.

అందుకే లాంగ్ వీకెండ్ కోసం ట్రావెల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరిలో మకర సంక్రాంతి, గణతంత్ర దినోత్సవంలో రెండు పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సారి ఈ రెండు పండుగల్లోనూ లాంగ్ వీకెండ్ ఉంటుంది కాబట్టి రిపబ్లిక్ డే హాలిడేస్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ స‌మ‌యంలో కొత్త స్థ‌లాన్ని చుట్టేయాల‌నుకుంటే మాత్రం 4 రోజుల సెలవుదినం కోసం ఏ ప్రదేశాలు ఉత్తమంగా ఉంటాయో, తెలుసుకోండి.

ఢిల్లీ నుంచి..

ఢిల్లీలో నివ‌సిస్తున్న‌వారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు. సిమ్లా, రిషికేశ్, లాన్స్‌డౌన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఆగ్రా, జైపూర్, ముస్సోరీ, నైనిటాల్, నీమ్రానా, భరత్‌పూర్, కసౌలి, ఓర్చా, రణతంబోర్, గ్వాలియర్, అల్మోరా, బిర్ బిల్లింగ్, ఫాగు, సరిస్కా నేషనల్ పార్క్.

బెంగళూరులో..

బెంగుళూరులో ఉంటున్న‌వారు ఈ లాంగ్‌వీకెండ్‌కు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు. ఆ ప్ర‌దేశాలేంటో చూసేయండి. చిక్కమగళూరు, ఉడిపి, దండేలి, పాండిచ్చేరి, కబిని, సకలేష్‌పూర్, కూర్గ్, ఊటీ, హంపి, కుద్రేముఖ్, గోకర్ణ, మైసూర్, కూనూర్, మంగళూరు, షిమోగా.

ముంబైలో..

ముంబైలో ఉండేవారు త‌ప్ప‌కుండా ఈ లాంగ్‌వీకెండ్‌కు ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు. పవన సరస్సు, లోనావాలా, అలీబాగ్, గణపతిపూలే, మహాబలేశ్వర్, పూణే, పంచగని, మాథెరన్.

చెన్నైలో...

చెన్నైలో నివ‌సించే వారు లాంగ్‌వీకెండ్ కోసం పాండిచ్చేరి, మహాబలిపురం, తిరుపతి, కాంచీపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు, నాగలాపురం వంటి ప్రాంతాల‌ను సంద‌ర్శించొచ్చు.

kolkata

కోల్‌కతాలో..

ఇక‌, కోల్‌క‌తాలో నివ‌సిస్తున్న వారు ఈ లాంగ్ వీకెండ్ కోసం కుర్సియోంగ్, కాలింపాంగ్, దిఘా, మందరమణి, శాంతినికేతన్, సుందర్బన్స్, కోణార్క్, డియోఘర్, భువనేశ్వర్ వంటి ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించొచ్చు.

hyderabad

హైదరాబాద్‌లో..

హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న వారు ఈ లాంగ్ ట్రిప్‌కు నాగార్జునసాగర్, గండికోట, సోమశిల, చీరాల బీచ్, వరంగల్, ఆదిలాబాద్, బెలం గుహలు, అనంతగిరి కొండలు, బీదర్, హంపి, కర్నూలు, పెంచ్ నేషనల్ పార్క్, విశాఖపట్నం, హార్సిలీ హిల్స్, అరకులోయ వంటి ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు.

gujarat1

గుజరాత్..

ఇక‌, గుజ‌రాత్‌లో నివ‌సించేవార‌యితే రిప‌బ్లిక్ డే లాంగ్ వీకెండ్ ట్రిప్ కోసం ఉదయార్‌పూర్, కల్పేశ్వర్, థోల్ పక్షుల అభయారణ్యం, మౌంట్ అబు, గిర్ నేషనల్ పార్క్, డామన్, డయ్యూ, కచ్, సువాలీ బీచ్, భుజ్, చంపానేర్, సిల్వస్సా, ద్వారక, జోధ్‌పూర్, మాండు, చిత్తోర్‌గఢ్, దండి, ఇండోర్, సపుతారా వంటి ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు.

rajasthan3

రాజస్థాన్..

రాజ‌స్థాన్‌లో నివ‌సించే వారికోసం అయితే ఈ ప్రాంతాలు ఎంతో బెస్ట్ అని చెప్పుకోవ‌చ్చు. అందులో అజ్మీర్, పుష్కర్, ఫతేపూర్ సిక్రి, ఢిల్లీ, సరిస్కా నేషనల్ పార్క్, అల్వార్, బికనీర్, ఉదయపూర్, రణతంబోర్, ఆగ్రా, భరత్‌పూర్ నేషనల్ పార్క్, మాండ్వా, గ్వాలియర్, హరిద్వార్, సలాసర్ బాలాజీ, జోధ్‌పూర్, ఓర్చా, గర్ముక్తేశ్వర్, మథుర, మౌంట్ అబూ, బృందావన్, పక్షుల అభయారణ్యం.

ఉత్తరప్రదేశ్...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసుల‌యితే ఆగ్రా, వారణాసి, నైనిటాల్, దేవా షరీఫ్, నవాబ్‌గంజ్ పక్షుల అభయారణ్యం, బితూర్, అయోధ్య, శ్రావస్తి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో, గ్వాలియర్, పిథోరఘర్, పన్నా నేషనల్ పార్క్, భీమ్టాల్, అల్మోరా, దుధ్వా నేషనల్ పార్క్, రామ్‌గఢ్, చంపావత్, జైపూర్ వంటి ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు..
రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా లాంగ్ వీకెండ్‌కు ఈ ప్ర‌దేశాల‌ను వీక్షించండి..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+