Search
  • Follow NativePlanet
Share
» »గడగ్ - తప్పక చూడవలసిన ప్రదేశం !!

గడగ్ - తప్పక చూడవలసిన ప్రదేశం !!

గడగ్ లో అందరూ మెచ్చే ప్రదేశం అంటే త్రికూటేశ్వర దేవాలయం. యాత్రికులను ఆకర్షించేది దీని శిల్ప వైభవమే కాదు. ఈ దేవాలయానికి మతపర విశిష్టత కూడా ఉంది.

By Mohammad

పర్యాటక ప్రదేశం : గడగ్

జిల్లా : గడగ్

రాష్ట్రం : కర్నాటక

ప్రముఖ ఆకర్షణలు : లక్కుండి, త్రికూటేశ్వర దేవాలయం, మాగడి పక్షి సంరక్షణాలయం, వీర నారాయణ దేవాలయం, సరస్వతి దేవాలయం

సమీప బస్ స్టాండ్ : గడగ్ బస్ స్టాండ్

సమీప రైల్వే స్టేషన్ : గడగ్ జంక్షన్ రైల్వే స్టేషన్

సమీప విమానాశ్రయం : హుబ్బళ్ళి ఎయిర్ పోర్ట్

కర్నాటక రాష్ట్రంలోని పడమటి భాగంలో దాగి వున్న చరిత్ర గడగ్ పట్టణం. కాని భారతీయ కళలను ఇష్టపడే వారు గడగ్ పట్టణాన్ని అలరిస్తున్న వివిధ దేవాలయ సముదాయాల వైభవాలను తప్పక చూసి ఆనందిస్తారు.

గడగ్ పట్టణంలో ఏం చూడాలి? ఏం చేయాలి?

గడగ్ దేవాలయాలు చాళుక్యుల కళా పిపాసకు నిదర్శనాలు. ఈ శిల్ప సంపద ఎంతో విభిన్నంగా ఉంటుంది. కొండరాతి గోడలు, దేవాలయాల గోడలపై చెక్కడాలు వంటివి గత చరిత్ర వైభవాన్ని చాటుతూంటాయి.

గడగ్ లో అందరూ మెచ్చే ప్రదేశం అంటే త్రికూటేశ్వర దేవాలయం. యాత్రికులను ఆకర్షించేది దీని శిల్ప వైభవమే కాదు. ఈ దేవాలయానికి మతపర విశిష్టత కూడా ఉంది. ఈ యాత్రా స్ధలం శివ, బ్రహ్మ, విష్ణుమూర్తులైన త్రిమూర్తుల నిలయంగా ఉంటుంది.

దీనితో పాటు గడగ్ లో దర్శించదగిన దేవాలయాలు వీర నారాయణ, డంబాల మరియు కాశీ విశ్వేశ్వర దేవాలయాలు. గడగ్ లో చూడవలసింది దేవాలయాలు వాటి శిల్ప సంపదలే కాదు. ప్రకృతి ప్రియులను మాగడి పక్షుల సంరక్షణాలయ జీవ వైవిధ్యం అబ్బుర పరుస్తుంది కూడాను. ఈ బర్డ్ శాంక్చువరీ గడగ్ పట్టణానికి 26 కి.మీ.ల దూరంలో ఉంది.

దొడ్డ బసప్ప

దొడ్డ బసప్ప

దొడ్డ బసప్ప డంబాలలోని దేవాలయాలలో ఈ దేవాలయం అనేక కోణాలు కలిగి ఆకర్షణీయ ఆకారంలో ఉంటుంది. ఈ గుడిలో శివలింగాన్ని ఆ ప్రాంత ప్రధాన దేవుడుగా కొలుస్తారు.చరిత్రకారుల మేరకు ఈ దేవాలయాన్ని కళ్యాణి చాళుక్య వంశ పాలకులు నిర్మించారు.

చిత్రకృప : Siddharth Pujari

వీర నారాయణ దేవాలయం

వీర నారాయణ దేవాలయం

వీర నారాయణ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. గడగ్ లో చూడవలసిన ప్రధాన దేవాలయాలలో ఇది ఒకటి. దీనిలో మహా విష్ణువు లేదా నారాయణుడి విగ్రహం ఉంటుంది. పర్యాటకులు లక్ష్మీ మరియు గరుడ విగ్రహాలను ప్రధాన విగ్రహానికి ఇరువైపులా దర్శిస్తారు.

చిత్రకృప : Dineshkannambadi

గజేంద్రఘడ్

గజేంద్రఘడ్

గజేంద్రఘడ్ ఒక చిన్న యాత్రా పట్టణం. దీనికి చట్టుపక్కల అంతా కొండలు. శివాజి కోట చాళుక్యుల చారిత్రాత్మక నిర్మాణాలున్న పడమటి భాగాలలో ఉంది. ఈ కోటకు చరిత్ర ప్రాధాన్యత కూడా ఉంది. శివ భగవానుడికి అంకితం చేశారు. దీనినే దక్షిణ కాశి అని కూడా అంటారు.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

హజరత్ - జిందాశవ్ - అలి దర్గా మరియు దుర్గా దేవి దేవాలయం

హజరత్ - జిందాశవ్ - అలి దర్గా మరియు దుర్గా దేవి దేవాలయం

హజరత్ - జిందాశవ్ - అలి దర్గా మరియు దుర్గా దేవి దేవాలయాలను పర్యాటకులు కోటుమచాగి వెళ్ళే సమయంలో దర్శించవచ్చు. ప్రఖ్యాత కవి ఛామరస తన ప్రభులింగ లీలే అనే కావ్యాన్ని దర్గా మరియు సోమేశ్వర దేవాలయం ల వద్ద గల ఇక్కడి సరస్సు వద్ద కూర్చొని వ్రాశారని చెపుతారు.

చిత్రకృప : Sikandar

రాణ్ చారిత్రక చిహ్నాలు

రాణ్ చారిత్రక చిహ్నాలు

గడగ్ పట్టణంలోని రాణ్ ప్రదేశం చారిత్రక ప్రాధాన్యత కలది. ఈ పట్టణంలోని దేవాలయం ప్రాచీన శిల్పి మరియు యోధ గురువు అయిన ద్రోణా చార్యులు నిర్మించారని స్ధానికుల కధనం. ఈ పట్టణంలో గల మరికొన్ని చారిత్రక నిర్మాణాలు, అనంతశయన దేవాలయం, ఈశ్వర దేవాలయం, కళ్ళ గుడి, సోమలింగేశ్వర దేవాలయం మొదలైనవి.

చిత్రకృప : Dineshkannambadi

హార్టి

హార్టి

హార్టి ప్రదేశంలో కూడా అనేక పురాతన మరియు ఆధునిక దేవాలయాలున్నాయి. ఈ చిన్న పట్టణంలో పార్వతీ పరమేశ్వరుల దేవాలయం ఉంది. దీనినే శ్రీ ఉమా మహేశ్వరి దేవాలయం అని కూడా అంటారు. దీనిని చాళుక్యుల పాలనలో నిర్మించారు. హార్టి లో శ్రీ బసవేశ్వర దేవాలయం కూడా ప్రధానంగా పేరుపొందింది.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

మాగడి పక్షి సంరక్షణాలయం

మాగడి పక్షి సంరక్షణాలయం

పర్యాటకులు మాగడి సరస్సు లేదా మాగడి కెరె వద్ద కల మాగడి పక్షి సంరక్షణాలయాన్ని చూడాలి. ఇది గడగ్ నుండి 26 కి.మీ.ల దూరం. ఈ సరస్సు సుమారు 134 ఎకరాలలో విస్తరించింది. పర్యాటకులు అందమైన పక్షులు చూడవచ్చు. ఈ శాంక్చురీ పొడవైన తల కల వలస బాతులను కూడా చూపుతుంది.

చిత్రకృప : Diliff

లక్ష్మేశ్వర

లక్ష్మేశ్వర

లక్ష్మేశ్వర ఒక వ్యవసాయ వ్యాపార పట్టణం. గడగ్ జిల్లాలో కలదు. ఈ పట్టణం మతపర అంశాలకు ప్రసిద్ధి. సోమేశ్వర దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం కలదు. ఈ దేవాలయం సుందరమైన శిల్పాల కళ కలిగి ఉంటుంది.

చిత్రకృప : Dineshkannambadi

లక్కుండి

లక్కుండి

గడగ్ జిల్లాలో లక్కుండి అనేది ఒక చిన్న పట్టణం. ఇది కుకునూర్ నుండి సుమారు 50 కి.మీ. ల దూరంలో ఉంటుంది. లక్కుండి దేవాలయాలన్నింటిలోకి కాశీ విశ్వనాధ దేవాలయం ప్రసిద్ధి. దీనిని దేవాలయాలలో స్వర్గంగా భావిస్తారు.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

సరస్వతి దేవాలయం

సరస్వతి దేవాలయం

గడగ్ లోని త్రికూటేశ్వర దేవాలయం వద్ద సరస్వతి దేవాలయం కలదు. ఈ దేవాలయం చాళుక్యుల నాటి శిల్ప వైభవం కలిగి ఉంది. ఇక్కడే ఆది శంకరాచార్య విగ్రహం కూడా చూడవచ్చు. సరస్వతి దేవాలయం కాక, ఇంకా ఇతర దేవాలయాలు కూడా ఇక్కడ కలవు.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

నారాయణ దేవాలయం

నారాయణ దేవాలయం

నారాయణ దేవాలయం పద్మబ్బరాసి బసడి గా పిలువబడే జైన దేవాలయం. దీనిని క్రీ.శ. 950 లో క్రిష్ణ III నిర్మించారు. దీనిని గంగ పెర్మాడి భుట్టయ్య పాలకులు రాణి పద్మబ్బరాశి అనుమతించారు. ఇది రాష్ట్రకూట దేవాలయాలలో పెద్దది. అతి పెద్దదైన ఈ రాష్ట్రకూట దేవాలయాన్ని తప్పక సందర్శించాలి.

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

నార్గుండ్ కోట

నార్గుండ్ కోట

గడగ్ జిల్లా నార్గుండ్ ప్రదేశంలో నార్గుండ్ కోట ప్రసిద్ధి గాంచింది. శివాజి నిర్మించిన రెండు కోటలలో ఇది ఒకటి. రెండవది రామదుర్గ కోట. ఇది ఇది కూడా తప్పక చూడవలసిన ప్రదేశం.

చిత్రకృప : Prabhakar Kurtakoti

గడగ్ ఎలా చేరుకోవాలి ?

గడగ్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం
గడగ్ పట్టణం రోడ్డు ద్వారా కర్నాటకలోని వివిధ పట్టణాలకు, బెంగుళూరు, మైసూరు, మంగుళూరు వంటి వాటితో కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులతో కలుపబడి ఉంది.

రైలు ప్రయాణం
గడగ్ రైలు జంక్షన్ పట్టణ సమీపంలో సుమారు రెండు కి.మీ. ల దూరంలో ఉంటుంది. ఇది చాలా చిన్న స్టేషన్. హుబ్లీ మరియు గుంటకల్ పట్టణాలను వయా హోస్పేట కలుపుతుంది.

విమాన ప్రయాణం
గడగ్ పట్టణానికి హుబ్లీ విమానాశ్రయం 64 కి.మీ. దూరంలో సమీప విమానాశ్రయం.

చిత్రకృప : indian railinfo

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+