Search
  • Follow NativePlanet
Share
» »అస్సాంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు..!

అస్సాంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు..!

అస్సాంలో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు..!

భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న అస్సాం సంస్కృతి, సంప్రదాయాలు, వన్యప్రాణులు, ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఇక్క‌డ స‌మృద్ధిగా వన్యప్రాణులు, అభివృద్ధి చెందుతున్న గిరిజన సంప్రదాయాలు, అన్యదేశ బిహు నృత్యం, నోరూరించే వంటకాలు, విశాలమైన పచ్చని తేయాకు తోటలు, శక్తివంతమైన బ్రహ్మపుత్ర న‌ది, మరెన్నో ఉన్నాయి. ఆగస్టు నుండి నవంబర్ మధ్య సందర్శించేందుకు మంచి ప్ర‌దేశం కోసం వెతుకుతున్న‌ట్ల‌యితే అస్సాం ఒక ఉత్త‌మ‌మైన ఎంపిక అని చెప్పుకోవాలి. ఈ ప్ర‌దేశం ప్రయాణానికి ఎంతో అనుకూలమైన వాతావరణం క‌లిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్రదేశపు అందం కూడా ఈ సీజన్‌లో గరిష్ట స్థాయిలో ఉంటుంది. అస్సాంలో సందర్శించేందుకు కొన్ని ఉత్తమ పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం.

1

దిబ్రూఘర్ ప్రత్యేకత

అస్సాం టీ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ప‌ర్యాట‌కులు నిజమైన అస్సాం టీని ఆస్వాదించాలనుకుంటే మాత్రం దిబ్రూఘర్‌కు వెళ్లాల్సిందే. ఇక్క‌డ కనీసం 165 తేయాకు తోటలను చూడొచ్చు. భారతదేశంలోని టీ సిటీ అస్సాం ఎగువ పశ్చిమ ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఉత్పత్తి చేసే పట్టణం దిబ్రూఘర్. ప్రపంచవ్యాప్తంగా వినియోగించబడే కొన్ని అత్యుత్తమ టీ మిశ్రమాలను ఇక్క‌డి నుండే ఉత్ప‌త్తి చేస్తారు. మనోహరమైన తేయాకు తోటలతో పాటు, దిబ్రూఘర్ సహజమైన ప్రకృతి సౌందర్యంతో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్, క్యాంపింగ్, పర్వతారోహణ వంటి సాహస కార్యకలాపాలకు ప్రసిద్ధ గమ్యస్థానం.

2

జోర్హాట్

దిబ్రూఘర్‌తో పాటు ఇక్క‌డికి స‌మీపంలోని జోర్హాట్‌లో కూడా టీ రుచిని ఆస్వాదించొచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన టోక్లాయ్ టీ పరిశోధన కేంద్రం ఇక్క‌డే ఉంది. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఇది. ఇక్కడ టీ కి సంబంధించిన‌ అనేక రకాల పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రంలో కనీసం 213 రకాల టీలు, 14 రకాల టీ విత్తనాలను కనుగొన్నారు. ఈ ప్రాంతంంలో విభిన్న సంస్కృతుల ప్రజలు నివసిస్తారు. జోర్హాట్ ప్ర‌జ‌లు ఏడాది పొడవునా అనేక పండుగలను నిర్వ‌హిస్తారు. ఇది నవంబర్-జనవరిలో టీ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తుంది.

4

ఇత‌ర ప్ర‌దేశాలు..

టీ గార్డెన్‌ను సందర్శించడమే కాకుండా ఇక్క‌డ‌ కజిరంగా నేషనల్ పార్క్, కామాఖ్య దేవాలయం, శివసాగర్ వంటి అనేక ప్రదేశాలను సంద‌ర్శించొచ్చు. ఇంకా, బురిగోసైన్ దేవాలయం, బిల్వేశ్వర శివాలయం, ధేకియాఖోవా బోర్నాంఘర్, తెంగల్ మానోర్, మాగోలు ఖాట్ మొదలైన ప్ర‌దేశాల‌ను చూడొచ్చు. గౌహతి అందాన్నిమ‌రింత‌ పెంచేందుకు ఇక్క‌డి అరటి చెట్లు ఎంత‌గానో ప‌నిచేస్తాయి. గౌహతి నుండి షిల్లాంగ్ వెళ్ళే మార్గంలో ఆకుపచ్చ, నీలం, పసుపు, ఊదా రంగుల పూలతో నిండిన చెట్లు కనిపిస్తాయి.

3

నేచర్ వాక్ ఆఫ్ టీ గార్డెన్

డార్జిలింగ్ టాయ్ ట్రైన్‌కు మాత్రమే కాదు, వాక్ ఆఫ్ టీ గార్డెన్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. వేల ఎకరాల్లో అనేక టీ ఎస్టేట్లు ఇక్క‌డ క‌ల‌వు. అంతేకాకుండా ఇక్క‌డి టీ తోటలు పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా ఇక్క‌డి తేయాకు తోటలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప‌ర్యాట‌కులు త‌ర‌లి వస్తుంటారు.

ఎక్క‌డ బ‌స చేయాలి

అస్సాం సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు. ఇక్క‌డ బ్రిటీష్ కాలంలో నిర్మించిన బంగ్లాలలో బస చేసిన అనుభవం వేరుగా ఉన్నప్పటికీ, రిసార్ట్‌ల‌కు కొద‌వే లేదు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఇక్కడ హోమ్‌స్టే సంస్కృతి కూడా ప్రారంభమైంది. స్థానికులు తమ ఇళ్లను హోమ్‌స్టేలుగా మార్చుకున్నారు. మకైబారి టీ ఎస్టేట్‌లో అనేక హోమ్‌స్టేలు అందుబాటులో ఉన్నాయి.

More News

    Read more about: assam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+