Search
  • Follow NativePlanet
Share
» »ప‌ర్యాట‌కుల‌కు ఇచ్చ‌ట ఫ్రీ ఫుడ్ ల‌భించును..

ప‌ర్యాట‌కుల‌కు ఇచ్చ‌ట ఫ్రీ ఫుడ్ ల‌భించును..

ప‌ర్యాట‌కుల‌కు ఇచ్చ‌ట ఫ్రీ ఫుడ్ ల‌భించును..

సెల‌వుల్లో విహారయాత్ర‌ల‌కు వెళ్లాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి. కుటుంబంతో, స్నేహితుల‌తో క‌లిసి అన్నీ తిరిగేయాల‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ దానికి స‌రిప‌డినంతా డ‌బ్బు స‌మకూరాలి క‌దా. అప్పుడే ఏ విహార‌యాత్ర అయినా సంతృప్తినిస్తుంది. చాలామంది ముందుగా విహార‌యాత్ర‌ల‌న‌గానే డ‌బ్బు స‌మ‌కూర్చుకుంటారు. ఎందుకంటే అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఎటువంటి లోటు లేకుండా రాకుండా ఉండేందుకు. అందుకే చాలామంది వారిదగ్గ‌ర‌న్న డ‌బ్బుల‌తోనే విహార‌యాత్ర‌ను ప్లాన్ చేస్తుంటారు. అయితే, మీరు కూడా తక్కువ డబ్బుతో విహారయాత్ర చేయాల‌నుకుంటున్నారా? అయితే, భారతదేశంలో కొన్ని వ‌స‌తులు ప్రీగా క‌ల్పించే ప్ర‌దేశాలు కూడా ఉన్నాయి. ఉచిత భోజ‌న స‌దుపాయం అందించే ప్రదేశాలు ఉన్నాయి. వీటిని మీ జాబితాలో చేర్చండి. అలాంటి ప్రాంతాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకోబోతున్నాం.

1

గోల్డెన్ టెంపుల్, అమృత్‌స‌ర్‌

విహారయాత్ర‌ల‌కు ఇది చాలా మంచి ప్రదేశం. చ‌రిత్ర మరియు మతం పట్ల ఆసక్తి ఉన్న‌వారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే. ఇక్క‌డికి స‌మీపంలోని గురుద్వారాలో ఉచిత భోజ‌న స‌దుపాయాన్ని అందిస్తారు. లంగర్ ప్రతి గురుద్వారాలో నిర్వహించబడుతుంది. 1481లో గురునానక్ ప్రారంభించిన ఈ కార్య్ర‌క‌మం నేడు వేలాది మంది ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం అందిస్తోంది. గురుద్వారాలో అన్ని మతాలు మరియు కులాల వారు ఒకచోట కూర్చొని భోజనం చేస్తారు. గోల్డెన్ టెంపుల్‌లో ఏర్పాటు చేసిన లంగర్ చాలా పెద్దది. ఇక్కడ రోజుకు దాదాపు 50000 మందికి ఆహారం అందుతుంది. పండుగల సందర్భంగా, ఈ సంఖ్య 100,000 వరకు కూడా పెరుగుతుంది. ఇక్కడ కూర్చోవడానికి రెండు పెద్ద హాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకేసారి 5000 మంది ఆహారం తినవచ్చు. కాబట్టి అమృత్‌సర్‌ను చాలా తక్కువ బడ్జెట్‌తో వీక్షించొచ్చు.

2

వైష్ణో దేవి, జమ్మూ మరియు కాశ్మీర్

2019 సంవత్సరంలో, శ్రీ మాతా వైష్ణో దేవి కమిటీ ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ లంగర్ నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సౌకర్యం ఇక్కడ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. కత్రా నుండి సుమారు మూడు కిలోమీట‌ర్ల దూరంలోని తారకోట్ వద్ద ఈ లంగర్‌ను ప‌ర్యాట‌కుల‌కు అందిస్తారు. ప్రతిరోజు 8500 మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. దాల్, అన్నం మరియు అంబల్ జమ్మూ యొక్క సాంప్రదాయ ఆహారం. ఈ లంగర్ 24 గంటలపాటు తెరిచి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్లి తినొచ్చు.

3

తిరుపతి బాలాజీ, ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటైన తిరుపతి బాలాజీని సంద‌ర్శించేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు త‌ర‌లివ‌స్తుంటారు. వారికోసం ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ఉచిత ఆహారాన్ని కూడా వండుతారు. ఇక్కడ వంటగదికి అన్నదానం అని పేరు కూడా పెట్టారు. ఇక్క‌డి మ‌రోక ప్ర‌త్యేక‌త ఏమిటంటే, అరటి ఆకుపై ఆహారం అందించబడుతుంది. ఇది ఆహారం యొక్క రుచిని మరింత పెంచుతుంది. ఇక్క‌డ భోజనంతో పాటు అన్నం, సాంబార్ మరియు కూరగాయలు లేదా చట్నీ వడ్డిస్తారు.

4

సాయి సంస్థాన్ ప్రసాదాలయ, షిర్డీ

షిర్డీలోని సాయి సంస్థాన్ ప్రసాదాలయం ఆసియాలోనే అతిపెద్ద ప్రసాదాలయం. డైనింగ్ హాల్‌లో ఒకేసారి 5500 మంది కలిసి కూర్చుని భోజనం చేయొచ్చు. ఇక్కడ రోజుకు సుమారు 100000 మందికి ఆహారం అందుతుంది. ఈ ప్రసాదాలయాన్ని రెండు భాగాలుగా విభజించారు. దీని మొదటి భాగం గ్రౌండ్ ఫ్లోర్ హాల్, ఇందులో 3500 మంది కూర్చోవచ్చు మరియు రెండవ భాగం మొదటి అంతస్తులో నిర్మించిన రెండు భారీ హాల్స్. ఒక్కో హాలు సామర్థ్యం 1000. ఇక్క‌డి ఆహారం చాలా రుచికరమైనది. ఇక్కడ ఆహారంలో పప్పు, అన్నం, రోటీ, రెండు రకాల కూరగాయలు మరియు దానితో పాటు ఒక స్వీట్ ఉంటాయి. ప్రసాదాలయం ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా ఆహారం తీసుకోవచ్చు.

More News

    Read more about: golden temple amritsar
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+