Search
  • Follow NativePlanet
Share
» »కుట్రాలంలో జలపాతాల సోయగాలు !!

కుట్రాలంలో జలపాతాల సోయగాలు !!

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుండి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరు. ఆ నీటి ధారల్లో తడవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదేమో! ఇంతటి సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే కుట్రాలం వెళ్లాల్సిందే మరి!!

కుట్రాల జలపాతం తమిళనాడులోని తిరునల్వేలికి గంటన్నర ప్రయాణ దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఏడాది పొడవునా పర్యాటకులతో నిండుగ, సందడిగా ఉంటుంది. వారాంతాల్లో, సెలవురోజుల్లో , ముఖ్యంగా ఎండాకాలంలో సందర్శకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. కుట్రాలంని త్రికోటాచలం అని కూడా పిలుస్తారు.

చిత్తరువి అనే పేరుగల ఒక నది పశ్చిమ కనుమల్లోని తిరుకూడమ్‌ ప్రాంతంలో పుట్టి, కొండ కోనల్లో ప్రవహిస్తూ శిలలప్పెరి అనే ప్రధాన నదిలో కలుస్తుంది. దానికి ముందు కుట్రాలంలోని వివిధ ప్రదేశాల్లో ఏడు జలపాతాలుగా విడిపోతుంది. అత్యంత అద్భుతంగా కనిపించే ఈ ఏడు జలపాతాల్లో కొన్ని అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో ఉన్నాయి. అందుకే అక్కడ పర్యాటకులను స్నానానికి అనుమతించరు. మిగతా చోట్ల సందర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాటిలో తనివితీరా జలకాలాడొచ్చు, మీకు ఇష్టంవచ్చినట్లు కేరింతలు కొట్టవచ్చు.

ఫ్రీ కూపన్ సేల్ : ఎక్స్ పీడియా వద్ద ఫ్లైట్స్ బుక్ చేసుకోండి 50% వరకు ఆఫర్ పొందండి

ఈ ఏడు జలపాతాల్లో ప్రధానమైంది కుర్తాల నాదన్‌ ఆలయానికి సమీపంలో ఉంది. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుండి జాలువారే ఈ జలపాతాన్ని పర్యాటకులు చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. సిత్తరవి అనే మరో జలపాతం స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది.

కుట్రాలం..ఎప్పుడూ నీరు ప్రవహించే భూమి!!

ఆలయానికి సమీపంలో జలపాతం

Photo Courtesy: Yesmk Photography

పెద్దగా ఉండే ఇంకో జలపాతం ఐదు పాయలుగా కిందికి పడుతుంది. అందుకే దీనిని ఐదు జలపాతాలు అని పిలుస్తారు. ఇక్కడ కూడా పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి ఉంది. ఇవే కాకుండా ఇంకొన్ని చిన్న జలపాతాలకూ ఉన్నాయి. ఇవి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

కుట్రాలం..ఎప్పుడూ నీరు ప్రవహించే భూమి!!

ఐదు జలపాతాల వద్ద పర్యాటకులు స్నానం చేస్తూ....

Photo Courtesy: Ramakant Pradhan

మరో జలపాతం పేరు టైగర్‌ ఫాల్స్‌. ఇక్కడి నీళ్ల శబ్దం పులి గాండ్రింపులా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ కూడా పర్యాటకులు స్నానం చేయవచ్చు. ఇది కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కుట్రాలంలో బోట్ విహారం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు పిల్లలైనా, పెద్దలైనా తప్పక బోట్ క్లబ్ ప్రదేశంలో షికారు చేయవలసిందే!! ఇది అయింత రువి మరియు పజయ కుర్తల్ల అరువి లేదా క్యిడు జలపాతాలకు వెళ్ళే దోవలో కలదు.

కుట్రాలం..ఎప్పుడూ నీరు ప్రవహించే భూమి!!

టైగర్‌ ఫాల్స్‌ పర్యాటకులు స్నానం చేస్తూ..

Photo Courtesy: Aronrusewelt

నాదర్‌ స్వామి ఆలయం

పేదవాళ్ళ ఊటీగా పేర్కొనబడుతున్న కుట్రాలానికి ఆ పేరు ఏర్పడటానికి కారణం అక్కడ నెలకొన్న కుట్రాలీశ్వరుడే !! శివతాండవాన్ని బ్రహ్మదేవుడు చిత్రించిన పుణ్యస్థలిగా కుట్రాలం పేరుగాంచింది. దీన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. నటరాజ రూపంలో ఉన్న పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌ గా వెలిశాడని చెబుతారు. ఇక్కడి శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించాడని కథనం. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వున్నప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే జరుగుతాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్ప సంపద చూపరులను కట్టిపడేస్తుంది. పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు. ఈమెతో పాటు పరాశక్తి కూడా కొలువై ఉంది. ఇక్కడ కొలువైన పరాశక్తి అమ్మవారి పీఠం 51 ధరణీ పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. నత్తి, మూగ తనంతో బాధపడేవారు ఈ అమ్మవారిని మొక్కుకుంటే చక్కని ఫలితం ఉంటుందని భక్త జనుల విశ్వాసం.

కుట్రాలం..ఎప్పుడూ నీరు ప్రవహించే భూమి!!

ఆలయంలో కొలువైన నటరాజ స్వామి

Photo Courtesy: templenet

రవాణా సౌకర్యాలు

విమాన సదుపాయం

ట్యటికొరన్ ఏర్‌పోర్ట్ కుట్రాలంకి 90 కి మీ. దూరంలో గల విమానాశ్రయం. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు విమాన సర్వీసులు నడుపుతుంటారు.

రైలు మార్గం

కుట్రాలంకి ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. కానీ కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్‌ పేరు తెన్‌కాశి. ఇక్కడ నుంచి సుమారుగా 5 కి .మీ. దూరంలో కుట్రాలం కలదు. ఈ స్టేషన్ కి దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి రైలు సదుపాయం కలదు. ఇక్కడ్నుండి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది.

రోడ్డు సదుపాయం

కుట్రాలం కి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. ఇక్కడికి తిరునల్వేలి నుంచి నిరంతరం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అంతేకాదు నుంచి కూడా నిరంతరం బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు కూడా రాక పోకలు సాగిస్తూ ఉంటాయి.తెన్‌కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం. చెన్నై, పరిసర ప్రాంతాలనుంచి కూడా ఇక్కడికి బస్సులు వస్తుంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+