అత్యంత సురక్షితమైన ప్రయాణం ఏదీ అని అంటే టక్కున గుర్తొచ్చేది ట్రైన్ జర్నీ. ఇది కేవలం సురక్షితమైన ప్రయాణంగానే కాకుండా సౌకర్యవంతంలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంది. అందుకే భారత్‌లోని చాలామంది ప్రయాణికులు ట్రైన్ జర్నీకే మగ్గు చూపుతుంటారు. ఇది ప్రయాణికులకు అందమైన అనుభూతులను చేరువ చేయడంతో పాటు సుందరమైన ప్రకృతి దృశ్యాలతో వారిని ఆహ్లాదపరుస్తుంది.
చాలామంది కిటీకీ పక్కన కూర్చుని పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎన్నో మధురమైన అనుభూతులను తమ వెంట తీసుకెళ్లిపోతారు. ఇది ఎంతో థ్రిల్‌ని అందిస్తూనే ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితిని కూడా కలిగిస్తాయి. అటువంటి అతి ప్రమాదకరమైన రైలు మార్గం భారత్‌లో కూడా ఉంది. ఈ ట్రైన్ రూట్‌లో ప్రయాణం చేయాలంటే ఓ పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆ రైలు మార్గం ఎక్కడో తెలుసుకుందామా..?
దేశంలోనే అతి ప్రమాదకరమైన రైలుమార్గం ది మాథెరన్ హిల్ రైల్వేస్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ ట్రైన్ రూట్ నెరల్ నుంచి మాథేరన్ వరకు ఉంటుంది. ఇది కేవలం కొంత సమయానికే మాత్రమే ప్రయాణిస్తుంది. సుమారు ఇరవై కిలోమీటర్ల ఈ రైలు మార్గంలో అనేక ప్రమాదకరమైన మలుపుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక సొరంగం ద్వారా పశ్చిమ కనుమలకు చెందిన కొండగుండా ఈ ట్రైన్ మాథెరన్ హిల్ స్టేషన్ కు చేరుకుంటుంది.

దేశంలో మోస్ట్ డేంజరస్ ట్రైన్ రూట్‌లో సాగే ఈ జర్నీనీ ఎంతో సాహసం చేసి మరీ డ్రోన్ తో వీడియో తీశారు. ఈ రైలు మార్గంలో ప్రయాణించేవారికి వణుకు పుట్టాల్సిందే..! అంత ప్రమాదకరంగా ఈ మార్గం ఉంటుంది. అయినా కానీ, చాలామంది పర్యాటకులు ఈ ట్రైన్ రూట్ లో జర్నీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక, అడ్వంచర్ ట్రిప్ వంటివి చేయాలనుకునేవారు మాత్రం తప్పకుండా ఈ రూట్‌లో ప్రయాణించాల్సిందే.
ఆ సమయంలో ప్రయాణికులు నిల్చోరాదు..
అతి ప్రమాదకరమైన ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో ఇండియన్ రైల్వే ఒక నిబంధనను కూడా విధించింది. రైలు కదిలే సమయంలో ప్రయాణికులు అస్సలు నిలబడకూడదు. ఎందుకంటే, దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. రైలు కదిలే సమయంలో కోచ్ ల గురుత్వాకర్షణ శక్తిని మారుస్తుందని, దీనిద్వారా ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, వర్షాకాలంలో మాత్రం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఉండవు. ఎందుకంటే, ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ఈ ట్రైన్ మార్గంలో రైళ్ల రాకపోకలను నిషేధిస్తారు.
సాహసం తప్పదు..
ఈ రైలు మార్గంలో ప్రయాణించాలంటే సాహసం చేయాల్సిందే.. కానీ, జీవితకాలంలో ఒకసారైనా ఈ రైలు మార్గంలో ప్రయాణించాలి అని అనుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. అత్యంత ప్రమాదకర మలుపులు ఉన్న ఈ ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే, రోజూ ప్రయాణం చేసేవారు మాత్రం ఎలాంటి భయం లేకుండా ట్రైన్ ఎక్కుతారు. మొదటిసారి ఈ ప్రయాణం చేసేవారికి మాత్రం ఇది కాస్త భయాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. మీరు కూడా థ్రిల్లింగ్ పొందాలనుకుంటే మాత్రం ఈ డేంజరస్ ట్రైన్ రూట్‌లో ప్రయాణం చేయాల్సిందే.



Click it and Unblock the Notifications













