Search
  • Follow NativePlanet
Share
» »Valentine's Day 2024 : వాలెంటైన్స్ డేకి దేశంలోని ఈ ప్రాంతాల‌ను చుట్టేయండి...

Valentine's Day 2024 : వాలెంటైన్స్ డేకి దేశంలోని ఈ ప్రాంతాల‌ను చుట్టేయండి...

ఫిబ్రవరి నెల ప్రేమికులకు చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో రానున్న వాలెంటైన్స్ డేకి యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రేమికుల దినోత్సవాన్ని అందరూ ప్రత్యేకంగా జరుపుకోవాలని చూస్తుంటారు. ఫిబ్రవరి 7 నుండి వాలెంటైన్ వీక్ ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ఫిబ్ర‌వ‌రి 14 న ప్రేమికుల దినోత్స‌వం. ఇటువంటి పరిస్థితిలో, మీ జీవిత భాగస్వామితో క‌ల‌సి కొన్ని ప్రేమపూర్వక క్షణాలను గడపడానికి ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే దేశంలోని ఈ ప్రాంతాలు ఎంతో అనువైన‌వి. ఇవి పూర్తిగా మీ బ‌డ్జెట్‌కు అనుకూల‌మైన ప్రాంతాలు. ఇక్కడ మీరు మీ ప్రేమతో క‌లిసి ప్రయాణం చేయ‌వ‌చ్చు. ఈ ప్ర‌దేశాల్లో ఖచ్చితంగా అందమైన జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకోవ‌చ్చు. ఇండియాలోని ఈ అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

mcleodganj1

మెక్‌లియోడ్‌గంజ్

మెక్‌లియోడ్‌గంజ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రాంతం. భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉన్న ఒక పర్వత రాష్ట్రం. ఇది ప్రకృతి సౌందర్యం, సాహస కార్యకలాపాలు మరియు ట్రెక్కింగ్ అవకాశాలకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం అనేక రకాల ట్రెక్కింగ్ మార్గాలను ప‌ర్యాట‌కుల‌కు అందిస్తుంది. ఇక్క‌డ‌ పచ్చని అడవులు, సుందరమైన లోయలు, మెరిసే ప్రవాహాలు మరియు మంచుతో కప్పబడిన పర్వతాలు ఉంటాయి. మెక్‌లియోడ్‌గంజ్ ప్రేమ‌ప‌క్షుల‌కు ఓ గొప్ప ప్రదేశం. ఇక్కడ మీరు మీ భాగస్వామితో క‌లిసి విశ్రాంతి తీసుకునేందుకు అనువైన ప్ర‌దేశం. ఈ ప్రదేశం రొమాన్స్‌కూడా ఎంత‌గానో పేరుగాంచింది. ఇక్కడ సందర్శించడానికి, ఇక్కడి లోయలను ఆస్వాదించడానికి ఫిబ్రవరి నెల సరైన సమయం.

rishikesh

రిషికేశ్

ప్రేమికుల దినోత్స‌వం నాడు సంద‌ర్శించేందుకు ఉత్త‌రాఖండ్‌లోని రిషికేష్ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం. ఇక్క‌డ మీ జీవిత భాగ‌స్వామి, ప్రియురాలితో క‌లిసి రాఫ్టింగ్ మరియు ట్రెక్కింగ్ వంటివి చేయొచ్చు. ప్రకృతి అందాలతో నిండి ఉండే అద్భుతమైన ప్రదేశమే రిషికేష్‌. రిషికేశ్ ప్రధానంగా ఆధ్యాత్మికత పరంగా, యోగా కేంద్రంగా, సాహస ప్రియుల గమ్యస్థానంగా మంచి గుర్తింపు పొందింది. కొత్త‌గా పెళ్ల‌యిన వారు, ప్రేమికులు ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు. ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో ఉన్న లోయల ఆనందం మరోలా ఉంటుంది. ఇక్క‌డి ప్ర‌శాంత‌మైన వాతావ‌రణంలో సేద‌తీరాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటారు. జనపనారతో చేసిన వంతెన మరియు లక్ష్మణ్ జూలా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాయి.

shillong

షిల్లాంగ్

జీవిత‌ భాగస్వామితో కలిసి మేఘాలయలోని షిల్లాంగ్‌ని సందర్శించేందుకు ఫిబ్ర‌వ‌రి నెల ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న ఒక కొండ పట్టణం. మేఘాలయలోని షిల్లాంగ్ సముద్ర మట్టానికి 1496 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొండలపై ఉన్న ఈ నగరం పర్యాటకులకు చాలా ఇష్ట‌మైన ప్ర‌దేశం. ఫిబ్రవరి ఇక్కడ సందర్శించడానికి మంచి సమయం. ఇక్కడ ఉన్న లేడీ హైదర్ పార్క్, డాన్ బాస్కో మ్యూజియం మరియు షిల్లాంగ్ పీక్‌లు ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు.

హార్సిలీ హిల్స్‌..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రదేశం వాలెంటైన్ రోజున ప్రియురాలితో, జీవిత భాగ‌స్వామితో గ‌డిపేందుకు అనువైన ప్ర‌దేశం. హార్సిలీ హిల్స్ ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి సుమారు 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ పర్యావరణపు అద్భుతమైన దృశ్యాల‌ను ప‌ర్యాట‌కుల‌కు చూడొచ్చు. అంతేకాకుండా ఈ ప్ర‌దేశం ట్రెక్కింగ్ కూడా అనువైన‌ది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+