Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రిషికేశ్

రిషికేశ్ - దేవభూమి !

63

డెహ్రాడున్ జిల్లా లోని ప్రఖ్యాత పుణ్య స్థలం రిషికేశ్, దీనినే దేవభూమిగా కుడా పిలుస్తారు. పవిత్రమైన గంగ నదీ తీరాన ఉన్నఈ పుణ్య క్షేత్రం హిందువులకు పరమ పవిత్రమైనది. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు, సందర్శకులు దేశం నలుమూలల నుండి ఈ పవిత్ర స్థలాన్ని, హిమాలయాలను సందర్శించి గంగా నదిలో స్నానం చేసేందుకు ఇక్కడకు వస్తారు. హిమాలయాల పాద ప్రాంతంలోని కొండలలో ఉన్నటువంటి రిషికేశ్ అనేక హిందూ దేవతలా నివాసంగా చెప్పవచ్చు.

ఇక్కడి పురాతన దేవాలయాలతో, మరియు ఆశ్రమాలతో కల ఈ ప్రదేశం చాల ప్రఖ్యాతి గడించింది. యోగ గురువులచే నడుపబడే అనేక యోగ మరియు మెడిటేషన్ సెంటర్స్ ఇక్కడ ఉన్నయి. హిందువుల పురాణమైన రామాయణం లో చెప్పబడిన రావణ సంహారం తరువాత శ్రీ రాముడు ఇక్కడ తపస్సు చేసాడని చెప్తారు. నార వారధి ద్వారా శ్రీ రాముని తమ్ముడయిన లక్ష్మణుడు గంగా నదిని దాటిన ప్రదేశంగా కుడా చెప్తారు. అందువలన ఈ వారధిని లక్ష్మణ్ ఝూలా అని పిలుస్తారు. 1889 లో కొమ్మలతో నిర్మితమైన ఈ వారధి తరవాత 1924 లో సస్పెన్షన్ ఐరన్ బ్రిడ్జిగా పునర్నిర్మితమైనది.

శివాలిక్ శ్రేణి లోని 13 అతి ముఖ్య మైన దేవతలలో ఒకరైన సతీ దేవత యొక్క కున్జపురి టెంపుల్ ఇక్కడ ఉన్నది. పురాణం ప్రకారం శివుడు తన భార్య అయిన సతీ దేవి శరీరాన్ని కైలాస పర్వతానికి తీసుకు వెళుతుండగా ఆమె యొక్క పై భాగం ఇక్కడ పడిందని చెప్తారు. ఈ దేవాలయం ఆమె శరీర భాగం పడిన ప్రదేశం లోనే నిర్మితమైనది.

పంకజ మరియు మధుమతి నదులు కలిసే చోట,పర్యాటకులు ఇక్కడి నీలకంట మహాదేవ్ టెంపుల్ ను కూడా సందర్శించవచ్చు. విష్ణు కూట్ , మనికూట్ మరియు బ్రహ్మ కూట్ కొండలు ఈ దేవాలయం నలువైపులా ఉంటాయి

శివరాత్రి పర్వ దినాన అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.

త్రివేణి ఘాట్ కు దగ్గర లోని రిశికుండ్ ను సందర్శకులు దర్శించటం మరవకూడదు. కుబ్జ్ ముని కి కానుకగా యమునా నది దేవత ఈ చిన్న కొలనుని నీటితో నింపిందని చెప్తారు. పురాతన రఘునాథ్ టెంపుల్ యొక్క ప్రతిబింబాన్ని ఈ చిన్ని కొలనులో సందర్శకులు చూడవచ్చు. వశిష్ట గుహ ఇక్కడి మరొక ఆకర్షణ. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ తో కలిసి ఒక ప్రాముఖ్య ప్రదేశంగా క్యాంపులకు అనువుగా సాహసికులకు కనిపిస్తుంది. ఈ గుహకి సమీపం లోనే మెడిటేషన్ కేంద్రమైన శ్రీ స్వామి ప్రురుషోత్తమానంద ఆశ్రమం ఉన్నది.

ఇంతే కాక కాళి కంబ్లివాలే పంచాయతి క్షేత్ర, శ్రీ బాబా విశుద్దానందాజి చే స్తాపించబడిన ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఉన్నది. గర్హ్వాల్ మొత్తం శాఖలు విస్తరించిన ఈ కేంద్రం యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ రిషికేశ్ లో ఉన్నది. పర్యాటకుల సౌకర్యార్ధం ఈ ఆశ్రమం బస వసతి కలిగిస్తుంది. శివానంద ఆశ్రమం , స్వామీ శివానందచే స్థాపించబడిన ఈ ఆశ్రమం రిషికేశ్ లో ఉన్నది. హిమాలయాల పాద ప్రాంతంలో గంగా నదీ తీరాన ఈ ఆశ్రమం ఉన్నది. 1967 లో స్థాపించబడిన ఓంకారానంద ఆశ్రమం కూడా పర్యాటకులు సన్దర్సించవచ్చు. ఈ ఆశ్రమం, సంఘం యొక్క అభివృద్ధికి మరియు సంస్కృతిక వికాసం కోసం కృషి చేస్తుంది. స్వామి ఓంకారానంద నాయకత్వంలో హిందూ సాధువులతో ఇది నిర్వహించబదుతున్నది.

పర్యాటకులు సమయం అనుకూలిస్తే ఇక్కడికి 16 కి మీ దూరం లోని శివపురి టెంపుల్ ను సందర్శించవచ్చు. భగవంతుడు శివుని ఈ గుడి పవిత్ర గంగానది తీరాన ఉన్నది. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ తో పర్యాటకులు ఆనందించ వచ్చు. నీలకంట్ మహదేవ్ టెంపుల్, గీత భవన్, త్రివేణి ఘాట్ మరియు స్వర్గ ఆశ్రమం మొదలగు ప్రఖ్యాత ప్రదేశాలు రిషికేశ్ లో ఉన్నాయి.

భక్తులతో పాటు సాహస యాత్రికులను కుడా ఈ ప్రదేశం ఆకర్షిస్తుంది. పర్వతాల మధ్యలో ఉండే ఈ సుందర ప్రదేశం ట్రెక్కింగ్ కి అనువైనది. గర్హ్వాల్ హిమాలయా శ్రేణి , బువని నీర్గుద్, రూప్కుండ్, కూరి పాస్, కాలింది ఖల్ ట్రెక్, కంకుల్ ఖల్ ట్రెక్ మరియు దేవి నేషనల్ పార్క్ ఇక్కడి ప్రఖ్యాత ట్రెక్కింగ్ రూట్ లు. ఫెబ్రవరి మరియు అక్టోబర్ ట్రెక్కింగ్ కి అనువైన సమయాలు.

అంతేకాక ఈ ప్రదేశం రివర్ రాఫ్టింగ్ కి ఒక ప్రఖ్యాత స్థలంగా వ్యవహరిస్తుంది. అనుభవజ్ఞుల సహాయం తో ఇక్కడి వాటర్ స్పోర్ట్ లను ఆనందించవచ్చు. రివర్ క్రాసింగ్ మరొక ఆసక్తికర సాహస క్రీడ. ఈ క్రీడలో తాడుపై నడుస్తూ నదిని దాటాల్సి ఉంటుంది

డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ నుండి రిషికేశ్ కు వాయు మార్గం ద్వారా పర్యాటకులు చెరుకొవచ్చు. ఇది రిషికేశ్ కు 18 కి మీ దూరం లో ఉన్నది. రిషికేశ్ లోని రైల్వే స్టేషన్ భారత దేశపు ఢిల్లీ, ముంబై, కోట్ద్వార్ మరియు డెహ్రాడున్ వంటి ముఖ్య నగరాలను

కలుపుతుంది. అంతే కాక పర్యాటకులు ఢిల్లీ, డెహ్రాడున్ మరియు హరిద్వార్ వంటి ప్రదేశాల నుండి ప్రైవేటు లేదా రాష్ట్ర ప్రభుత్వ బస్సుల ద్వారా ఇక్కడికి చెరుకొవచ్చు.

రిషికేశ్ లో వాతావరణం సంవత్సరంలో చాలాభాగం ఆహ్లాదకరంగా ఉంటుంది. మే సమయంలో మాత్రం ఉష్ణోగ్రత అధికంగా ఉండి పర్యటనకు అనువుగా ఉండదు.

రిషికేశ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రిషికేశ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రిషికేశ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రిషికేశ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రిషికేశ్ దగ్గరలోని ఢిల్లీ, డెహ్రాడున్, మరియు హరిద్వార్ వంటి నగరాలకు బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉన్నది. ఈ నగరాల ప్రైవేటు లేదా రాష్ట్ర ప్రభుత్వ బస్సుల ద్వారా ఇక్కడికి చెరుకొవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గమ్ రిషికేశ్ లోని రైల్వే స్టేషన్ భారత దేశపు ఢిల్లీ, ముంబై, కోట్ద్వార్ మరియు డెహ్రాడున్ వంటి ముఖ్య నగరాలను కలుపుతుంది. ఇది నగరానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం డెహ్రాడున్ జాలి గ్రాంట్ ఎయిర్ పోర్ట్ రిషికేశ్ కు దగ్గర లోని ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడికి 18 కి మీ దూరంలో ఉన్నది. డిల్లి లోని ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కలుస్తుంది. అక్కడి నుండి భారత దేశపు ముఖ్య నగరాలకు ఫ్లైట్స్ లభిస్తాయి. పర్యాటకులు కాబ్ లను కుడా అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed