జాతకాలను నమ్మేవారికి గురుం బలం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఈ గురుబలం పై ఎక్కువ గురి ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో గురువు ఉంటే మంచి జరుగుతుందని చెబుతారు. ఆ సమయంలో ప్రత్నించిన అన్ని పనులు ద్విగ్విజయంగా పూర్తవుతాయి. మరికొన్ని ఇళ్లల్లో గురువు ఉంటే మాత్రం వారి ప్రయత్నాలు ఏవీ సఫలం కావు. అందువల్లే ఆ గురువుకు శాంతి చేయిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తారు. అలా గురువు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం తమిళనాడులో ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

ఎక్కడ ఉంది
P.C: You Tube
తమిళనాడులో ఉన్న ఆ దేవాలయం పేరు వశిష్టేశ్వర దేవాలయం. తమిళనాడులోని తంజావూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని తిరుక్కూరుగవూర్ మార్గంలో తంజావూరు మలట్టూరు మార్గంలో వచ్చే తిట్టై
గ్రామంలో ఈ వశిష్టేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో చోళుల నుంచి నిర్మించినట్లు చెబుతారు.

స్వయంభువు
P.C: You Tube
ఇక్కడ ఉన్న మూలవిరాట్టు స్వయంభువుగా చెబుతారు. అమ్మవారిని ఉళగనాయకి అని అంటారు.ఇక్కడ మూలవిరాట్టు స్వయంభువు కాబట్టే స్వామివారిని స్వయంభూథేశ్వర అని స్థనికులు పిలుస్తుంటారు.

గురు భగవాన్
P.C: You Tube
ఇక్కడ ఉన్న మరో ప్రత్యేక ఏమిటంటే గురు భగవాన్ కు ప్రత్యేక దేవాలయం ఉండటం. వశిష్టేశ్వర, లోకనాయకి దేవాలయాల మధ్య ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ మూలవిరాట్టు దక్షిణ దిశగా ఉంటాడు కాబట్టి ఆయన్ను దక్షిణ మూర్తి అనే పేరుతో కూడా పిలుస్తారు.

నాలుగు భుజాలతో
P.C: You Tube
ఇక్కడ ఉన్న గురువుకు నాలుగు భుజాలు ఉంటాయి. నిలబడిన స్థితిలో స్వామివారు దర్శనమిస్తారు. నాలుగు చేతుల్లో నాలుగు గ్రంథాలు ఉంటాయి. ఇక్కడ చిత్ర పౌర్ణమి, గురు పయార్చి ఇక్కడ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు

ఉత్సవాలు
P.C: You Tube
ఈ దేవాలయంలో ఏడాది మొత్తం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అయితే పైన పేర్కొన్న ఉత్సవాలు ఇక్కడ ప్రధానమైనవి. వీటితో పాటు మహాశివరాత్రి రోజున ఇక్కడ ఎక్కువ మంది భక్తులు హాజరవుతారు.

సూర్య కిరణాలు
P.C: You Tube
ఈ దేవాలయంలో మరో విశిష్టత ఏమిటంటే ఇక్కడ ఏడాదిలో కేవలం ఆరు రోజులు మాత్రమే సూర్య కిరణాలు శివలింగం పై పడుతాయి. ప్రతి ఏడాది మార్చిలో 25,26,27 అదే విధంగా ఆగస్టు లో 15,16,17 ఈ
చమత్కారం ఇక్కడ జరుగుతుంది.

మరో అద్భుతం
P.C: You Tube
ఈ దేవాలయం పై కప్పు నుంచి ప్రతి 24 గంటలకు ఒకసారి ఒక నీటి బిందువు శివలింగం పై పడుతుంది. ఇందుకు కారణం ఈ దేవాలయం నిర్మాణంలో వాడిన వాస్తు శైలి అని చెబుతారు. అంతేకాకుండా
వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ విధమైన అద్బుతం జరుగుుతందని చెబుతారు.

రెండు ప్రత్యేక రాళ్లు
P.C: You Tube
ఆలయ గోపురం పై రెండు ప్రత్యేకమైన రాళ్లను ఉంచారు. వీటిని సూర్యగాంధక్కల్, చంద్ర గాంధక్కల్ అని అంటారు. ఈ రాళ్లవల్లే వాతావరణంలోని తేమ నీటి బింధువులుగా మారి శివలింగం పై పడుతోందని
చెబుతారు.

చక్రతీర్థం
P.C: You Tube
ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న కోనేరును చక్రతీర్థం అంటారు. ఈ దేవాలయాన్ని విష్ణువు స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈ దేవాలయానికి కన్నెపిల్లలు వెళితే వారికి త్వరగా వివాహం అవుతుందని చెబుతారు.



Click it and Unblock the Notifications













