Search
  • Follow NativePlanet
Share
» »ఇండోర్ స్పోర్ట్స్ హ‌బ్‌ల‌కు విశాఖ వేదిక‌నే చెప్పాలి!

ఇండోర్ స్పోర్ట్స్ హ‌బ్‌ల‌కు విశాఖ వేదిక‌నే చెప్పాలి!

విశాఖ న‌గ‌రంలో ప‌ర్యాట‌క ప్రేమికుల‌కు దొర‌కందంటూ లేదు. అయితే, క్రీడా ఔత్సాహికుల ప‌రిస్థ‌తి ఏంట‌నే సందేహం రావొచ్చు. అలాంటివారు ప్లేగ్రౌండ్ కోసం సిటీలో చ‌క్క‌ర్లు కొట్టాల్సిన ప‌నిలేదు. అత్యాధునిక సౌకర్యాలతోపాటు ఆహ్లాదాన్ని పంచే ఇండోర్ స్పోర్ట్స్ మైదానాలను ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేస్తున్నాం. వైజాగ్ న‌గ‌రంలో బ్యాడ్మింటన్ కోర్టుల నుండి స్నూకర్ క్లబ్‌ల వ‌ర‌కూ అన్నీ మిమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాయి. ఇక్క‌డ వ్యాయామం, వినోదం రెండూ దొరుకుతాయి. మ‌రెందుకు ఆల‌స్యం స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా ఇండోర్ గేమ్స్ ఆడేందుకు అనువైన ఆ ప్ర‌దేశాలేంటో చూసేద్దామా?!

క్రీడాల‌కు కేరాఫ్‌ అడ్ర‌స్‌.. స్ట్రైక్‌- 8

స్ట్రైక్‌- 8 పేరు వింటే చాలు విశాఖ‌వాసుల‌కు అద్భుతమైన స్నూకర్ టేబుల్, బాక్స్ క్రికెట్ క‌ళ్ల‌ముందు క‌నువిందు చేస్తాయి. ఆక‌ట్టుకునే సౌకర్యాలతో ఇది క్రీడా ఔత్సాహికుల గ‌మ్య‌స్థానంగా గుర్తింపు పొందింది. ఈ స్ట్రైక్‌- 8 ప్రాంగ‌ణం ఇత‌ర క్రీడా మైదానాల మాదిరి కాకుండా అందంగా క‌నిపిస్తూ.. మీలోని క్రీడా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. క్రీడ‌ల‌కు ఇక్క‌డ ఏర్పాటు చేసిన క్రీడా ప‌రిక‌రాలు ఎంతో అనువుగా ఉంటాయి. అంతేకాదు, అంద‌రికీ అందుబాటులో ఉండేలా నిర్వ‌హ‌కులు ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించారు. ఎన్‌టీఆర్ బీచ్ రోడ్‌లోని స‌రోవ‌ర్ అపార్ట్‌మెంట్‌, లాస‌న్స్ బే కాల‌నీ, పెద్ద వాల్తేర్ ద‌గ్గ‌ర స్ట్రైక్‌- 8 ఉంది. ఇది ఉద‌యం 10ః30 నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ తెరిచి ఉంటుంది.

Visakha is the venue for indoor sports hubs 1

నగరం నడిబొడ్డున.. రూఫ్‌టాప్ ప్లే

విశాఖ‌ నగరం నడిబొడ్డున ఉన్న రూఫ్ టాక్ ప్లే ఇండోర్ స్పోర్ట్స్ మైదానంలో ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్ కోసం ప్రీమియం టర్ఫ్ అందుబాటులో ఉంది. నాణ్య‌మైన మ‌ట్టితో నిండిన ఈ మైదానంలో వేసే ప్ర‌తి అడుగూ మంచి అనుభూతిని చేరువ చేస్తుంది. హై క్వాలిటీ గల క్రీడా పరికరాలతోపాటు ప్రేక్ష‌కులు వీక్షించేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాల‌రీలు ఆట‌పై మ‌రింత మ‌క్కువ క‌లిగేలా చేస్తాయి. విశాఖ న‌గ‌రంలో అంద‌రికీ అంబాటులో ఉండే మైదానాల‌లో రూఫ్‌టాప్ పే పేరు త‌ప్ప‌క‌చేర్చాల్సిందే. ఇక్క‌డి సిబ్బంది స్నేహ‌పూర్వ‌క ప‌ల‌క‌రింపు ఈ మైదానానికి వ‌చ్చేందుకు అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చుతుంది. అసిల్మెట్ట‌లోని వీఐపీలో రోడ్డులో ఈ ఇండోర్ స్పోర్ట్ మైదానం ఉంది. ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కూ ఇది తెర‌చి ఉంటుంది.

నీటి విన్యాసాల.. ఓజోన్ స్పోర్ట్స్ హబ్

ఓజోన్ స్పోర్ట్స్ హబ్ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్‌తోపాటు వాటర్ స్లైడ్‌లకు ప్రసిద్ధి చెందింది. వీటితోపాటు ఈ స్పోర్ట్స్ హబ్‌లో బ్యాడ్మింటన్ కోర్ట్, బాక్స్-క్రికెట్, ఇండోర్ షూటింగ్ వంటి క్రీడ‌ల‌కు కూడా ఆతిథ్యం ఇస్తోందని చాలామందికి తెలియ‌దు. ప్ర‌తి క్రీడ‌లోనూ అనుభ‌విజ్ఞులైన కోచ్‌ల ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది. వారు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు, కోచింగ్ సేవలను కూడా అందిస్తారు. అన్ని సేవలు అందుబాటు ధరలకు లభిస్తాయని వినియోగదారులు చెబుతున్నారు. ఈ స్పోర్ట్ హ‌బ్ ఎన్ఎస్ ఆర్ కాంప్లెక్స్ వెనుక సుజాత న‌గ‌ర్‌లో ఉంది. ఉద‌యం 5ః30 నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ ఈ హ‌బ్ తెర‌చి ఉంటుంది.

Visakha is the venue for indoor sports hubs

MVP రూఫ్‌టాప్ బ్యాడ్మింటన్ కోర్ట్

ఈ రూఫ్‌టాప్ బ్యాడ్మింటన్ కోర్ట్ వైజాగ్‌లోని టాప్ షటిల్ కోర్ట్‌లలో ఒకటిగా చెబుతారు. అయితే, ఇది కొంచెం ధరతో కూడుకున్నదని అంటున్న‌ప్ప‌టికీ విశాలమైన ఇక్క‌డి ప్రాంగ‌ణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా ఆడేందుకు ఎంవీపీ రూఫ్‌టాప్ బ్యాడ్మింట‌న్ కోర్టు స‌రైన ఎంపిక‌గా చెప్పొచ్చు. ఎంవీపీ కాల‌నీలో ఉన్న ఈ స్పోర్ట్స్ కోర్టు రోజూ ఉద‌యం ఆరు నుంచి రాత్రి 9 వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+