భారతదేశంలో పుణ్యక్షేత్రాలకు కొదవేలేదు. ప్రతి రాష్ట్రంలోఎన్నో పురాతన ఆలయాలు కొలువై ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. చాలామంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు. అయితే, దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే, అలాంటివారికోసం ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
ఇందులో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కాకుండా, దక్షిణ భారత్‌లోని ప్రసిద్ధ ఆలయాలను చూసేయొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం తొమ్మిది రోజులు ఉంటుంది. రైలు మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ ధరతోనే పర్యాటకులు దక్షిణ భారతదేశంలోని 7 పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవచ్చు. రూ.14 వేల ప్రారంభ ధరతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. రండి ఈ టూర్ ప్యాకేజీ వివరాలేంటో తెలుసుకుందాం పదండి..
ఈ తొమ్మిది రోజుల రైల్ టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్, విజయవాడ నుంచి బయలుదేరుతోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ టూర్ కొనసాగుతుంది. ఈ టూర్ లో భాగంగా పర్యాటకులు అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవచ్చు. రూ.14250 ప్రారంభ ధరతో 9 రోజుల పర్యటన ఉంటుంది. ఇందులో మొత్తం ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలు దర్శనం చేసుకోవచ్చు.

మొత్తం 9 రోజులు టూర్ షెడ్యూల్..
మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:00 గంటలకు ట్రైన్ బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కాజిపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు స్టేషన్లలో ఆగుతుంది అక్కడ ప్రయాణికులు రైలు ఎక్కుతారు. రెండో రోజు ఉదయం 7 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడ దిగాక ఫ్రెష్ అవ్వడానికి హోటల్ కు చేరుకుంటారు. అనంతరం అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. కుదల్‌నగర్‌కు వెళ్లేందుకు సాయంత్రం అరుణాచలం రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. మూడోరోజు ఉదయం 6.30 గంటలకు కూడాల్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకుంటారు.
హోటల్‌లో చెక్ ఇన్ చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రామేశ్వరంలోని పుణ్యక్షేత్రాలను సందర్శి్స్తారు. రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది. నాలుగోరోజు రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరతారు. అక్కడ మీనాక్షి అమ్మ వారి ఆలయాన్ని చూసి, సాయంత్రం షాపింగ్‌కు వెళ్తారు. ఐదోరోజు ఉదయం 8 గంటలకు కొచ్చువేలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాక, అక్కడినుండి వివేకా రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ టూర్ ఉంటుంది. రాత్రికి అక్కడే స్టే చేస్తారు. ఆరో రోజు ఆ హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు.
త్రివేండ్రంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్ సందర్శన ఉంటుంది. తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్‌లో రైలు ఎక్కుతారు. ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యాక శ్రీరంగం ఆలయ దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు బయలుదేరుతారు. తంజావూరు బృహదీశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. సికింద్రాబాద్ తిరుగు ప్రయాణం కోసం రాత్రి 11 గంటలకు తంజావూరులో రైలు ఎక్కుతారు. ఎనిమిదో రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల దిగుతారు. చివరిరోజు తెల్లవారుజాము 2:30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగుతాం. దీంతో ఈ ఈ టూర్ ముగుస్తుంది.
టూర్ ధరలు...
జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. మొత్తం 8 రాత్రులు/9 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ జూన్ 22,2024 న ప్రారంభమవుతుంది. రైలు మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సీట్ల సంఖ్య 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)
ఎకానమీ -రూ 14250/ -రూ 13250/-
స్టాండర్ట్- రూ 21900/- -రూ 20700/-
కంఫర్ట్- రూ 28450/-- రూ 27010/-



Click it and Unblock the Notifications













