ఇక, నవంబర్ నెల రాబోతుంది. ఈ నెలలో ఉత్తరాఖండ్, హిమాచల్‌లోని ప్రాంతాలలో తీవ్రమైన చలి ప్రారంభం అవుతుంది. చాలా ప్రాంతాల్లో ఈ నెలలో ఎక్కువ హిమపాతం కూడా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇలాంటి ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా కష్టతరమైన పని అని చెప్పుకోవాలి. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ నుంచి ట్రావెల్ సీజన్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో సందర్శించే ముఖ్యమైన ప్రదేశాలలో రాజస్థాన్ ఒకటి. ఎందుకంటే, రాజస్థాన్‌లో ఇప్పుడు కాస్తా వేడిగానే ఉంటుంది. శీతాకాలం ఇక్కడ సందర్శించేందుకు ఉత్తమమైన సమయం.
నవంబర్‌లో టూర్‌కు వెళ్లాలని ప్రణాళికలు వేస్తుంటే మాత్రం తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.. రాజస్థాన్‌లోని ప్రతి నగరం దాని సొంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ ప్రాంతం అందంతో పాటు అనేక చారిత్రక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. రాజస్థాన్‌లో సందర్శించేందుకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. అందులో జైపూర్, జైసల్మేర్, ఉదయపూర్, బికనీర్ వంటి ప్రదేశాలు. అంతే కాకుండా, ఇక్కడ అనేక హిల్ స్టేషన్లు కూడా ఉన్నాయి. వాటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈసారి వాటిని సందర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ యాత్రను సరదాగా, చిరస్మరణీయంగా మార్చాలనుకుంటే మాత్రం రాజస్థాన్‌లోని ఈ హిల్‌స్టేషన్‌లను సందర్శించాల్సిందే.. ఎడారితో పాటు, ఇక్కడ అనేక హిల్ స్టేషన్లు కూడా ఉన్నాయి. మరెందుకాలస్యం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. .

గురు శిఖర్ హిల్ స్టేషన్..
రాజస్థాన్‌లోని ఈ గురు శిఖర్ హిల్ స్టేషన్‌ను 'గురుస్ పీక్' అని కూడా అంటారు. ఇక్కడ నుండి రాజస్థాన్‌లోని అద్భుతమైన అందమైన దృశ్యాలను చూడొచ్చు. ఈ హిల్ స్టేషన్‌లకు ఒంటరిగా కూడా చూడొచ్చు. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త ప్రశాంతతను కోరుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంతో ప్రకృతి అందాలను చూస్తు సమయం గడిపేయొచ్చు. ట్రెక్కింగ్ ప్రియులకు కూడా ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఈ ప్రాంతంలో దత్తాత్రేయ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

అచల్‌ఘర్ హిల్ స్టేషన్
ఆరావళి శ్రేణిలో ఉన్న అచల్‌ఘర్ హిల్‌స్టేషన్ రాజస్థాన్‌లోని అత్యంత అందమైన హిల్ స్టేషన్‌లలో ఒకటి. ఇది మౌంట్ అబూ నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అచల్‌ఘర్ హిల్ స్టేషన్ చుట్టూ పచ్చదనం కమ్మేసి ఉంటుంది. ఇక్కడికి రావడం వల్ల పర్యాటకులు ప్రకృతి అనుభూతులను ఎన్నో ఆస్వాదిస్తారు. ఇంకా ఈ ప్రాంతంలో సందర్శించేందుకు అచల్‌ఘర్ కోట కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఇక్కడ ఉన్న సరస్సులు, వన్యప్రాణులను చూసే అవకాశాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి.

సజ్జన్‌గఢ్
రాజస్థాన్‌లోని సజ్జన్‌ఘడ్ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకట్టకుంటుంది. సెలవులను పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. సజ్జన్‌గఢ్ ప్యాలెస్ సాటిలేని అందానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని మేవార్ రాజవంశానికి చెందిన మహారాణా సజ్జన్ సింగ్ నిర్మించారు. ఇక్కడ అనేక సరస్సులు ప్రసిద్ధిగాంచాయి. ఇక్కడి అందాలను మీమీ కెమెరాలలో బంధించొచ్చు. ఇక్కడ పర్యాటకులు చేసేందుకు సాహసకార్యకలాపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బోటింగ్‌లో సరాదాగా విహరించొచ్చు.



Click it and Unblock the Notifications













