Search
  • Follow NativePlanet
Share
» »కృష్ణాష్ట‌మి నాడు దేశంలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించేయండి..

కృష్ణాష్ట‌మి నాడు దేశంలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించేయండి..

కృష్ణాష్ట‌మి నాడు దేశంలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించేయండి..

ప్రతి సంవత్సరం జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న ఈ పండుగను నిర్వహించనున్నారు. హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో శ్రీకృష్ణుడు ఒకరు. శ్రీ‌కృష్ణుని అనేక పేర్లతో పిలుస్తారు. జన్మాష్టమి సందర్భంగా చాలా చోట్ల దహీ హండి పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగలో ప్రధానంగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున భక్తులు నూతన వస్త్రాలు ధరించి స్వామి వారిని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను కూడా ఎంతో అందంగా అలంక‌రించుకుంటారు.

జన్మాష్టమి సందర్భంగా చాలా చోట్ల దహీ హండి వేడుక కూడా జరుగుతుంది. వెన్న, పెరుగు, ఇతర పాలు ఆధారిత ఆహారాలను మట్టి కుండలో ఉంచుతారు. ఆ కుండను చాలా ఎత్తులో వేలాడదీస్తారు. ఆ మట్టి కుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. దహీ హండీ పండుగ సందర్భంగా జనం గుంపులు గుంపులుగా గుమిగూడ‌తారు. ఈ పండుగ‌ను ఎంతో సంతోషంగా, కోలాహాలంఆ జ‌రుపుకుంటారు. దహీ హండి పండుగ శ్రీ కృష్ణుడి జీవితంతో ముడిపడి ఉందని చాలామంది భ‌క్తులు నమ్ముతారు. ఈ సంవత్సరం జన్మాష్టమి సందర్భంగా దహీ హండి పండుగను ఆస్వాదించాలనుకుంటే మాత్రం ఈ ప్రత్యేక ప్రదేశాలను త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే.

1

బాంకే బిహారీ దేవాలయం

ఈ ఆలయం బృందావనంలోని రామన్ రేతిలో ఉంది. భారతదేశంలోని అత్యధిక దేవాలయాలలో ఇది ఒకటి. ఇది శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జన్మాష్టమి ప్రత్యేక సందర్భంలో దహీ హండి పండుగను చూసేందుకు ఇక్కడకు వెళ్లొచ్చు.ఈ ఆలయం భారతదేశంలోని ప్రతిష్టాత్మక దేవాలయాలలో ఒకటిగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఆలయం 1864లో నిర్మించబడింది. బృందావనం ప్రాంతంలో శ్రీ కృష్ణుడు గోపికలతో కలిసి భోజనం చేశాడు. తన వేణువులోని మధురమైన శ్రావ్యరాగంతో జగమంతా మరచిపోయేలా పాడాడు. గోవర్ధన్‌ పర్వతం కూడా బ్రిజ్‌ ప్రాంతంలోనే ఉంది. ఇదే స్థలంలో కృష్ణుడు తన వేలు పైకెత్తి ఇంద్రుని కోపం నుంచి గ్రామస్థులను రక్షిస్తాడు.

2

శ్రీ కృష్ణ దేవాలయం

శ్రీ కృష్ణ దేవాలయం కర్ణాటకలోని ఉడిపిలో ఉంది. ఈ ఆలయం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 13వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయంలో ఉన్న వేణు మాధవుడిని నవ రంధ్రాల కిటికీ నుండి మాత్రమే పూజిస్తారు. భక్తులకు కిటికీ నుండి మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఈ ఆలయం చెక్క, రాతితో నిర్మించబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనులోని నీటిలో గుడి గోపురానికి సంబంధించిన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

3

గురువాయూర్ దేవాలయం

ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. శ్రీకృష్ణుడి వల్ల ఈ ప్రదేశం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆల‌యాన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. దీన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహానికి నాలుగు చేతులలో శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి మరియు పద్మం ఉంటాయి. దేవాలయం వివిధ రకాల కూడ్య చిత్రాలతో కృష్ణుని లీలలను చూపుతూ అందంగా అలంకరించబడి ఉంటుంది.

More News

    Read more about: banke bihari temple brindavan
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+