Search
  • Follow NativePlanet
Share
» »ఈ లాంగ్ వీకెండ్‌లోని డ‌ల్హౌసీలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించండి..

ఈ లాంగ్ వీకెండ్‌లోని డ‌ల్హౌసీలోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించండి..

వీకెండ్ డెస్టినేషన్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా ప్ర‌సిద్దిచెందింది. లాంగ్ వీకెండ్ ప్లాన్ చేస్తున్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా ఈ సెల‌వుల్లో హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్ర‌దేశాన్ని చూసేయండి. ఇక్కడ సంద‌ర్శించేందుకు అనేక ప్ర‌దేశాలున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా ఈ స్థలాన్ని ఇష్టపడతారు, కాబట్టి క్రిస్మస్ లాంగ్ వీకెండ్‌కి త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయండి.

డల్హౌసీలో చూడవలసిన ప్రదేశాలు

ఖజ్జియార్

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని డల్హౌసీ నుండి సుమారు కిలోమీట‌రు దూరంలో ఖ‌జ్జియార్ ఉంటుంది. ఈ లాంగ్ వీకెండ్‌లో సంద‌ర్శించేందుకు ఈప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. దీనిని మినీ స్విట్జ‌ర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు ప‌ర్యాట‌కుల మ‌న‌సుల‌ను దోచేసుకుంటాయి. ఇక్క‌డి విశాలమైన గడ్డి భూములు చూసేందుకు ప‌ర్యాట‌కులు సూదుర ప్రాంతాల నుండి వ‌స్తుంటారు. ఎందుకంటే ఈ ప్ర‌దేశం అంద‌మైన దృశ్యాల‌కు నిల‌యంగా ఉంటుంది. ఫొటోగ్రఫికి ఈ ప్ర‌దేశం ఎంతో అనువైన‌ది.

ఇక్క‌డ ప్ర‌కృతి అందాల‌ను మీ కెమెరాల్లో బంధించొచ్చు. ఇక్క‌డి ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో కాసేపు సేద‌తీరొచ్చు. ఇక్క‌డ దట్టమైన పైన్, దేవదార్ అడవులతో చుట్టుముట్టబడిన ఒక చిన్న సుందరమైన సాసర్-ఆకారపు పీఠభూమి కూడా ఉంటుంది. ఇక్క‌డ అంద‌మైన స‌ర‌స్సు కూడా ఉంటుంది. ఖజ్జియార్‌లోని సరస్సు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఖజ్జియార్‌లో ఉంది. ఇది డల్హౌసీ మరియు చంబా టౌన్ మధ్య సముద్ర మట్టానికి సుమారు 1,951 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

dalhusie

కలాతోప్ ఖజ్జీర్ అభయారణ్యం

డ‌ల్హౌసిలో సంద‌ర్శించేందుకు మ‌రో అనువైన ప్ర‌దేశం కలాతోప్ అభయారణ్యం.ఇది కుటుంబంతో క‌లిసి విహ‌రించేందుకు ఎంతో అనువైన ప్ర‌దేశమ‌నే చెప్పుకోవాలి. కలాతోప్ ఖజ్జియార్ అభయారణ్యం చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ నుండి మీరు ఎత్తైన మంచు పర్వతాలను కూడా వీక్షించొచ్చు. ఈ అభయారణ్యం అనేక రకాల జంతువులు మరియు పక్షులకు నిలయంగా ఉంది. ఇక్క‌డికి స‌మీపంలోని చంబా డ్యామ్ కూడా ఉంది. దీన్ని చేరుకోవాలంటే కొన్ని కిలోమీట‌ర్ల వ‌ర‌కూ న‌డ‌క ప్ర‌యాణం చేయాల్సిందే. ఖజ్జీర్ కలాతోప్ ఖజ్జియార్ అభయారణ్యం కోసం అత్యంత ప్రసిద్ధి చెందింది.

ఇది దాదాపు 31 కిలోమీట‌ర్ల మేర విస్తరించి ఉంది. రావి నది అభయారణ్యం గుండా ఇది ప్రవహిస్తుంది. ఈ అభ‌యార‌ణ్యంలో నెమళ్లు, సెరో మరియు నల్ల ఎలుగుబంట్లకు అత్య‌ధికంగా నివ‌సిస్తున్నాయి. ఖజ్జియార్‌లో ప్ర‌సిద్దిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఖజ్జియార్ సరస్సు, దౌలాధర్ పర్వతాలు మరియు ఖజ్జినాగ్ ఆలయం. వీటిని కూడా సంద‌ర్శించొచ్చు.

dainkundpeak1

దైన్‌కుండ్ శిఖరం

డ‌ల్హౌసిలోని దైన్‌కుండ్ శిఖరం ఇక్కడ ఉన్న అతి ఎత్తైన శిఖరం. ఇది డల్హౌసీకి సుమారు ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. సాహ‌స ప్రియుల‌కు ఎంతో ఇష్ట‌మైన ప్ర‌దేశం ఇది. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవాలంటే త‌ప్ప‌కుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ స‌మ‌యంలో అందమైన దృశ్యాలను కూడా చూడొచ్చు.

satdharafalls

సత్ధార జలపాతం

డల్హౌసీలో ప్ర‌సిద్ధిచెందిన జ‌లపాతాలు కూడా ఉన్నాయి. సత్ధార జలపాతం ఇక్కడికి కేవలం కిలోమీట‌రు దూరంలో ఉంటుంది. సత్థార జ‌ల‌పాతం పేరు సూచించినట్లుగా, దాని ఏడు ప్రవాహాల కారణంగా సత్ధార అని పేరు పెట్టారు. ఈ జ‌ల‌పాతం డ‌ల్హౌసిలో ప్ర‌సిద్దిచెందిన జ‌ల‌పాతాల‌లో ఒక‌టి. ఈ లాంగ్ వీకెండ్‌లో డ‌ల్హౌసిని సంద‌ర్శించిన‌ప్ప‌డు త‌ప్ప‌కుండా ఈ జ‌ల‌పాతాన్ని వీక్షించొచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+