Search
  • Follow NativePlanet
Share
» »ఒడిషాలోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించారా?

ఒడిషాలోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించారా?

ఒడిషాలోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించారా?

ఒడిశా సందర్శించడానికి చాలా అందమైన రాష్ట్రం. దీని రాజధాని భువనేశ్వర్‌ను దేవాలయాల నగరం అంటారు. అయితే ఇక్కడ మతపరమైన ప్రదేశాలే కాకుండా అనేక అందమైన ప్రదేశాలను కూడా చూడొచ్చు. ఒడిశాలోని జగన్నాథ్ పూరీ ఆలయం పర్యాటకులలో బాగా ప్రసిద్ధి చెందింది. అయితే అదే కాకుండా, ఈ రాష్ట్రంలో చూడవలసిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలను చూసి మీరు కూడా మైమరిచిపోతారు. అంతే కాకుండా, ఒడిశాలో చారిత్రక ప్రదేశాలు,ఆధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సంద‌ర్శించేందుకు ఆసక్తికరమైన ప్రదేశాలకు కొరత లేదు. కాబట్టి మీరు కూడా ఒడిషాను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇక్కడ ఉన్న కొన్ని ఉత్తమ ప్రదేశాల గురించి ముందుగా తెలుసుకోవ‌డం మంచిది.

konark

కోణార్క్ సూర్య దేవాలయం

ఈ పురాతన ఆలయాన్ని చూసేందుకు ఏడాది పొడవునా పర్యాటకుల రద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఆలయం UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చబడింది. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఇక్కడ పురాతన శిల్పకళను ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు. ఇది హిందూ దేవతల చిత్రాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆల‌యం ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథకూడా ఉంది. దీనినే మైత్రేయవనమని పిలుస్తారు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగింద‌ని న‌మ్ముతారు.

purijagannath

జగన్నాథ దేవాలయం

పూరీలో ఉన్న జగన్నాథ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ఇది హిందూ దేవత అయిన విష్ణువు యొక్క అవతారమైన జగన్నాథునికి అంకితం చేయబడింది. ఇది ప్రసిద్ధ రథయాత్ర ఉత్సవ ప్రదేశం కూడా. పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. జగన్నాథుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఒడిశాను సందర్శిస్తారు. ఈ ఆలయం కూడా చార్ ధామ్ యాత్రలో చేర్చబడింది.

chilkalake1

చిల్కా సరస్సు

ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ద‌నే చెప్పుకోవాలి. ఈ స‌ర‌స్సును చూసేందుకు పర్యాటకుల రద్దీ ఎక్కువ‌గానే ఉంటుంది. చిల్కా సరస్సు పక్షి వీక్షకులకు మరియు ప్రకృతి ప్రేమికులకు గొప్ప గమ్యస్థానం. ఇది ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా కూడా పిలువబడుతుంది. భారతదేశంలో అతిపెద్ద కోస్తా సరస్సు మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరస్సుగా ప్ర‌సిద్ధి చెందింది.

dhaulihills1

ధౌలి కొండలు

ఈ కొండలు దయా నది ఒడ్డున ఉన్నాయి. ఇవి భువనేశ్వర్ నుండి 8 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్నాయి. దీనిని సాధారణంగా ధౌలి శాంతి స్థూపం అంటారు. ఇది పర్యాటకులకు కేంద్రంగా ఉంది. మీరు ఇక్కడ అశోక స్తంభం, బుద్ధ విగ్రహాల పార్క్ మరియు మరెన్నింటినో చూసే అవ‌కాశం ఉంటుంది.

lingarajatemple

లింగరాజు దేవాలయం

ఇది భువనేశ్వర్‌లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు కాకుండా విష్ణువు కూడా పూజలందుకుంటున్నాడు. లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగానికు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు మునుపు నిర్మించబడినది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కృత లిపి సాక్ష్యంగా ఉన్నది.

More News

    Read more about: konark sun temple odisha
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+