Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ హిల్ స్టేషన్‌ని సంద‌ర్శించారా?

ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ హిల్ స్టేషన్‌ని సంద‌ర్శించారా?

ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ హిల్ స్టేషన్‌ని సంద‌ర్శించారా?

వేసవి కాలంలో ఎవ‌రైనా గానీ చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకుంటారు. అంటే, బీచ్‌ల‌కు గానీ, హిల్‌స్టేష‌న్ల‌కు గానీ వెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంటారు. అక్కడ వారు వేడి నుండి ఉపశమనం పొంద‌డ‌మేకాకుండా, కొద్ది రోజులు ప్ర‌శాంతంగా గ‌డుపుతారు. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ప్రజలు హిల్ స్టేషన్లను ఎంచుకుంటారు. కానీ మీరు వారాంతంలోని ఈ చిన్న ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఢిల్లీకి స‌మీపంలోని ఈ హిల్‌స్టేష‌న్స్ గురించి తెలుసుకోండి. మ‌రెందుకాల‌స్యం ఆ హిల్ స్టేష‌న్స్ గురించి తెలుసుకుందాం రండి..

హర్యానాలోని అందమైన హిల్ స్టేషన్ మోర్ని హిల్స్. ఈ వేసవిలో సందర్శించడానికి గొప్ప ప్రదేశంగా నిరూపించబడుతుంది. హర్యానాలోని పంచకులలో ఉన్న ఈ స్టేషన్ 1200 మీటర్ల ఎత్తులో ఉంది. ఢిల్లీ నుండి 252.6 కిలోమీటర్ల‌ దూరంలో ఉన్న ఈ స్టేషన్ చేరుకోవడానికి మీకు కేవలం 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. మీరు ఈ ప్రాంతంలోని అనేక అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈప్రాంతం చుట్టూ ప‌చ్చ‌ద‌నంతో నిండి ఉండ‌డ‌మో కాకుండా అక్క‌డి వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగా ఉంటుంది. మోర్ని హిల్స్‌లో ఉన్న కొన్ని ప్రసిద్ధ ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి.

mornifort1

టిక్కర్ తాల్

మోర్ని హిల్స్‌లో ఉన్న టిక్కర్ తాల్ ఇక్కడి అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉన్న రెండు అందమైన సరస్సుల వద్ద మీరు బోటింగ్ కూడా ఆనందించవచ్చు. ఇక్కడి సహజ సౌందర్యం మరియు నిర్మలమైన వాతావరణం మిమ్మల్ని చూపుతిప్పుకోనివ్వ‌కుండా చేస్తుంది. కారులో ఇక్క‌డికి చేరుకోవ‌డానికి దాదాపు 2గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఇక్క‌డ టిక్క‌ర్ తాల్ మౌంటైన్ క్వాయిల్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్‌కి స‌మీపంలో చిల్ర్డ‌న్‌పార్క్ ఉంది. ఈ పార్క్‌లో ఒక భ‌యాంక‌ర సొరంగం ఉంది. ఈ ప్రదేశం స్నేహితుల‌తో, కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డిపేందుకు అనువైన ప్ర‌దేశం ఇది.

మోర్ని కోట

చారిత్రాత్మక ప్రదేశాలను చూడాల‌నుకునేవారు మోర్ని హిల్స్‌లోని మోర్ని కోటను ఎంచుకోవ‌చ్చు. అందమైన కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం నుండి అందమైన లోయలను చూడవచ్చు. మోర్నికోట అనేది 17వ శ‌తాబ్దంలో దాదాపు 1200 మీటర్ల ఎత్తులో మోర్ని కొండ‌పై నిర్మించ‌బ‌డిన రాతిక‌ట్ట‌డం. కోట‌కు తూర్పున ద్వారం ఉంది. దీనికి నాలుగు ట‌వ‌ర్లు ఉన్నాయి. కోట లోప‌లి వ‌స‌తి నిరాండ‌రబరంగాఉంది. కోట మ‌ధ్య‌లో ఒక బావి ఉంది.

adventurepark

అడ్వెంచర్ పార్క్

చారిత్రక ప్రదేశాలు మరియు అందమైన దృశ్యాలతో పాటు, సాహ‌స క్రీడ‌లు ఆస్వాదించాల‌నుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న అడ్వెంచర్ పార్కుకు వెళ్లవచ్చు. ఈ ప్రాంతంలో అంద‌మైన ప‌చ్చ‌ని చెట్లు మిమ్మ‌ల్ని ఆహ్వ‌నం ప‌లుకుతాయి. ఇక్క‌డ స్వింగులు క‌లిగి ఉండే అనేక ప‌చ్చిక డాబాలు ఉన్నాయి. ఒక విచిత్ర‌మైన గుడిసె ఆహార‌పు నిర్మాణంలో ఇక్క‌డ ఒక ఫ‌ల‌హార‌శాల ఉంది. ఈ పార్క్‌లో ప్ర‌త్యేక‌మైన పూలు ఉన్నాయి. అంద‌మైన గులాబీరంగు, వాన లిల్లీ పువ్వులు ప‌సుపురంగు పారే డైసీలు, ముదురు ఎరుపు మందార పూలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ బోట్ రైడ్, ట్రెక్కింగ్, రోప్ క్లైంబింగ్, బర్మా బ్రిడ్జ్, రాపెల్లింగ్ మరియు రాక్ క్లైంబింగ్ వంటి కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.

karohpeak1

కరోహ్ శిఖరం

క‌రోహ్ శిఖ‌రం మోర్నిలోని అతి ఎత్త‌యిన ప్ర‌దేశం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఎంతో అనువైన‌ది. ఈ ప్రదేశం హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతం హిమాల‌య దృశ్యాలు, వృక్ష‌జాలం మ‌రియు స‌ర‌స్సుల‌కు ప్ర‌సిద్ధిచెందింది. మోర్ని అనే పేరు ఒక‌ప్పుడు ఈప్రాంతాన్ని పాలించిన రాణి నుండి ఉద్భ‌వించింద‌ని ఇక్క‌డివారు న‌మ్ముతారు. మోర్ని కొండ‌లు హిమాల‌యాలోని శివాలిక్ శ్రేణికి చెందిన‌వి. మోర్నిగ్రామం స‌ముద్ర‌మ‌ట్టానికి 1220 మీట‌ర్ల ఎత్తులో ప‌ర్వ‌త‌ప్రాంతంలో ఉంది. ఈ శిఖ‌రం నుంచి చూస్తే ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌న్నీ క‌నిపిస్తాయి.

thakurdwartemple1

ఠాకూర్ ద్వార్ ఆలయం

ఈ పర్యటనలో మతపరమైన స్థలాన్ని సందర్శించాలనుకుంటే మాత్రం ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఠాకూర్ ద్వార్ ఆలయాన్ని

సందర్శించవచ్చు. ఈ ఆల‌యం శ్రీ కృష్ణునికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది. అంతేకాకుండా, ఇక్క‌డికి స‌మీపంలోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా నాడా సాహిబ్‌ని కూడా సందర్శించవచ్చు. మ‌రెందుకాల‌స్యం మోర్నీ హిల్స్‌లో ఈ ప్రాంతాల‌ను ఒక‌సారి చుట్టేయండి.

More News

    Read more about: tikkar tal morni fort
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+