Search
  • Follow NativePlanet
Share
» »త్రిపుర అందాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రిప్ మీకోస‌మే..!

త్రిపుర అందాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రిప్ మీకోస‌మే..!

ప్ర‌కృతి అందాల‌ను వీక్షించాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈశాన్య రాష్ట్రాల‌ను సంద‌ర్శించాల్సిందే. ఇక‌, ఈ వేసవిలో ఈశాన్య రాష్ట్రాల అందాల మ‌రింత రెట్టింప‌వుతుంది. అందులో ముఖ్యంగా త్రిపుర అందాల‌ను మాటల్లో వ‌ర్ణించలేం. త్రిపుర‌లోని ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు ప‌ర్యాట‌కుల‌కు ఎప్పుడూ స్వాగ‌తం ప‌లుకుతూనే ఉంటాయి. ఇక్క‌డి ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతుంది. త్రిపుర‌లో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

ఇక‌, ఈ హాలిడేస్‌లో త్రిపుర‌ను సంద‌ర్శించాల‌నుకునేవారికి ఐఆర్‌సిటి ఓ స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆరు రోజులు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ త్రిపుర రాజ‌ధాని ఆగ‌ర్త‌లా నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఐఆర్‌సిటిసి వారి రోడ్డు టూర్ ప్యాకేజీ..ఈ టూర్ ప్రతి శుక్రవారం, శనివారం త్రిపుర రాజధాని అగర్తలా(Agartala) నుంచి ప్రారంభ‌మవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ రూ.23,420 ప్రారంభ ధరతో ప్ర‌యాణికులకు అందుబాటులో ఉంది.

unokoti1

త్రిపురలో ప్ర‌సిధ్ధిచెందిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. హిందూ, బౌద్ధ ప్రదేశాలు, దేవాలయాలు, నదులు, రాతి శిల్పాలు వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలను ఈ ప్ర‌దేశం కలిగి ఉంది. ఐఆర్‌సిటిసి ఆరు రోజుల టూర్ ప్యాకేజీలో అగర్తల, ఉనోకోటి, దోంబూర్, సెపాహిజాల ప్రాంతాల‌ను సంద‌ర్శించొచ్చు.

టూర్ ప్యాకేజీ ధ‌రల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

ఒక్కో వ్యక్తికి ధర..

స్టాండర్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.41730 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీ అయితే, రూ.30350 ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.23420 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ విత్ బెడ్(5-11 years) రూ.22670 గా నిర్ణ‌యించారు. చైల్డ్ విత్ అవుట్ బెడ్ (5-11 years) 22300 రూపాయ‌లు చెల్లించాలి.
మొత్తం ఆరు రోజుల టూర్ ప్రయాణ వివరాలివే..!

మొద‌టి రోజు అగర్తలా విమానాశ్రయం/ రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకోవ‌డం జ‌రుగుతుంది. హోటల్‌లో చెక్ ఇన్ చేసి రెస్ట్ తీసుకున్న త‌ర్వాత, సాయంత్రం స్థానిక మార్కెట్‌లో డిన్నర్ ప్లాన్ చేస్తారు. ఆ రాత్రికి హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది. రెండో రోజు ఉద‌యం అల్పాహారం అనంత‌రం ఉనోకోటి సంద‌ర్శ‌న‌ ఉంటుంది. ఈ టూర్ అనంత‌రం అదే రోజు సాయంత్రం తిరిగి అగర్తలకు వెళ్లాల్సి ఉంటుంది. డిన్నర్, రాత్రిపూట బస అగర్తలా హోటల్‌లో చేయాలి. మూడో రోజు అల్పాహారం తర్వాత త్రిపురేశ్వరి ఆలయ దర్శనం కోసం ఉదయపూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

damburlakeisland1

అనంత‌రం చబిమురా, తర్వాత దంబూర్ లేక్ ఐలాండ్ సందర్శనం ఉంటుంది. డిన్నర్, రాత్రి బస డోంబూర్‌లో చేయాలి. నాలుగోరోజు టిఫిన్ చేశాక మేలఘర్ (నీర్ మహల్)కి వెళ్లాలి. అనంత‌రం అక్క‌డినుంచి సెపాహిజలా సందర్శన ఉంటుంది. ఆ త‌ర్వాత అగర్తలాకు తిరిగి వెళ్లాలి. హోటల్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది. ఇక‌, ఐదోరోజు బ్రేక్‌ఫాస్ట్ చేశాక రోజంగా స్థానిక టూరిస్ట్ ప్రదేశాల సందర్శన ఉంటుంది. అగర్తలాలోని స్టేట్ మ్యూజియం, ఉజ్జయంత ప్యాలెస్, క్యాపిటల్ కాంప్లెక్స్ - అఖౌరా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ సందర్శన వంటివి ఉంటాయి. అగర్తలాలోని హోటల్‌లో రాత్రి భోజనం, రాత్రి బస చేయాలి. ఆరో రోజు టిఫిన్ చేశాక హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.

మీ ప్రాంతం నుంచి అగర్తలాకు విమాన సర్వీసుల కోసం ఈ లింక్‌ను https://www.air.irctc.co.in/ క్లిక్ చేయండి.

మీ ప్రాంతం నుంచి అగర్తలాకు రైలు సర్వీసుల కోసం ఈ లింక్‌ను https://www.irctc.co.in/nget/train-search క్లిక్ చేయండి.

త్రిపుర ఐఆర్సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై https://www.irctctourism.com/pacakage_description?packageCode=EGH011క్లిక్ చేయండి

More News

    Read more about: irctc tour package tripura
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+