Search
  • Follow NativePlanet
Share
» »నహర్‌ఘర్ కోట దెయ్యాల కోట‌గా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

నహర్‌ఘర్ కోట దెయ్యాల కోట‌గా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరం అనేక చారిత్ర‌క నిర్మాణాల‌తో ప్రసిద్ధి చెందింది. అయితే, ఇక్కడ ఉన్న నహర్‌ఘర్ కోట వెనుక ఉన్న మిస్ట‌రీ కారణంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప‌ర్యాట‌కులు ఇక్కడికి వస్తుంటారు. చాలా అందమైన ఈ కోట రాత్రిపూట త‌న చారిత్ర‌క నేప‌థ్యాన్ని మ‌రింత పెంచుతుంది. దాని అందమైన నిర్మాణం వెనుక ఉన్న మిస్ట‌రీపై సంద‌ర్శ‌కులు ఎందుకు అంత‌గా ఆస‌క్తి చూపుతారు? ఈ కోటను ఎందుకు దెయ్యాల కోట‌గా చెబుతారు? న‌హ‌ర్‌ఘ‌ర్ కోట‌లో దాగిన ఆస‌క్తికర వాస్త‌వాల‌ను తెలుసుకుందాం పదండి!

రాజస్థాన్ భారతదేశంలోని విభిన్న‌సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విష‌యం తెలిసిందే. ఈ రాష్ట్రం గొప్ప చరిత్రను కలిగి ఉంది. అందుకు సాక్ష్యాలు ఈ నేల‌పై నేటికీ చూడవచ్చు. ఇక్కడ అనేక చారిత్రక వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఇవి దాని గొప్ప చరిత్రను ప్రతిబింబిస్తాయి. అయితే, భార‌తదేశంలోని భిన్న‌త్వంలో ఏక‌త్వానికి ప్ర‌తీక‌గా నిలిచిని ఓ చారిత్ర‌క క‌ట్ట‌డం మాత్రం జైపూర్‌లోని నహర్‌ఘర్ ఫోర్ట్ అనే చెప్పాలి. ఈ నిర్మాణాన్ని చూసేందుకు ఏటా సుదూర ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు ఇక్క‌డ వాలిపోతుంటారు.

nahargarhfort1 ghost fort

కోటలకు కేరాఫ్ అడ్ర‌స్ జైపూర్‌

నిజానికి రాజస్థాన్‌ను పురాత‌న‌ కోటలు, రాజభవనాల రాష్ట్రం అని కూడా అంటారు. ఇక్కడ అనేక అందమైన కోటలు మరియు రాజభవనాలు ఉన్నాయి. వాటిని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి ప‌ర్యాట‌కులు ఇక్కడకు వస్తారు. ఇలాంటి అందమైన కోటలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది మాత్రం ఈ రాష్ట్ర రాజధాని జైపూర్‌. వీటిని చూడటానికి చాలా మంది ఇక్కడకు వస్తుంటారు. వీటిలో నహర్‌ఘర్ కోటకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కోటలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ కోట చరిత్ర నేప‌థ్యంతోపాటు ప్ర‌చారంలో ఉన్న‌ దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఎంతో ఉత్కంఠ‌రేపుతాయి.

నహర్‌ఘర్ కోట చరిత్ర

రాజస్థాన్ టూరిజం వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చిన వివ‌రాల‌ ప్రకారం.. నహర్‌ఘర్ కోట ఆరావళి కొండల శిఖరంపై ఉంది. ఈ కోట 1734లో జై సింగ్ హయాంలో నిర్మించగా, 1868లో దీనిని విస్త‌రించారు. నహర్‌ఘర్ అంటే పులుల నివాసం అని అర్థం. జైపూర్‌పై దాడి చేసే శత్రువుల నుండి రక్షించడానికి ఈ కోట ప్రత్యేకంగా నిర్మించబడింది. నేటికీ, ఈ కోట ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా ఉంది. దీని అందాన్ని ఆస్వాదించ‌డానికి దేశ విదేశాల నుండి నేటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వ‌స్తున్నారు. దీని నిర్మాణ శైలి చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది.

nahargarhfort inside

నహర్‌ఘర్ కోటలో దాగిన ర‌హ‌స్యాలు

పూర్వం ఈ కోట పేరు సుదర్శన్‌గఢ్. అయితే తర్వాత ఈ కోటకు యువరాజు నహర్ సింగ్ పేరు పెట్టారు. వాస్తవానికి, ఈ కోటకు అతని పేరు పెట్టాలని యువరాజు ఆత్మ కోరుకుంద‌ట‌. అలా అందానికి ప్రసిద్ధి చెందిన ఈ కోట దెయ్యాల కథగా కూడా ప్రసిద్ధి చెందింది. కోట నిర్మాణ సమయంలో ఎన్నో విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు జరిగాయని, దీంతో ఇక్కడి కార్మికులు భయంతో పరుగులు తీయాల్సి వచ్చింద‌ని స్థానికంగా ప్ర‌చారంలో ఉంది. వాస్తవానికి ఈ కోటలో కార్మికులు ఏ పని చేసినా మరుసటి రోజు ధ్వంసమైపోయేద‌ట‌. దీంతో ప్యాలెస్ నిర్మాణ పనులు చాలా ఏళ్ల‌పాటు పూర్తి కాలేదని, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని స్థానిక‌ ప్రజలు చెబుతుంటారు. రాత్రి స‌మ‌యంలో ఈ కోట స‌మీప ప్రాంతాల్లో సంచ‌రించేందుకు నేటికీ ఎవ్వ‌రూ సాహ‌సం చేయ‌రు. ఈ కార‌ణంగా దెయ్యాల కోట‌గా ఈ కోట మరింత ప్ర‌సిద్ధి చెందింది.

బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణకు ప్రసిద్ధి

ఈ కోట టూరిజంతో పాటు బాలీవుడ్ చిత్రాల షూటింగ్‌కి కూడా ప్రసిద్ధి చెందింది. నటుడు అమీర్ ఖాన్ నటించిన రంగ్ దే బసంతి చిత్రం ఇక్కడే చిత్రీకరించబడింది. అప్పటి నుండి ఈ కోట ప్రజలలో మరింత ప్రసిద్ధి చెందింది. తరువాత, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్ కోసం కూడా ఇక్కడ చిత్రీకరించారు. ఈ కార‌ణాల‌తో నహర్‌ఘర్ కోట పేరు చెబితేచాలు దాని నేప‌థ్యంతోపాటు నేరుగా చూసేందుకు ప‌ర్యాట‌కులు మ‌రింత ఆస‌క్తి చూపుతూ వ‌స్తున్నారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+