చలికాలంలో పర్వతాలకు వెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో కొన్నిసమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందులో గది నుండి బయటికి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సీజన్‌లో చాలామంది బీచ్‌లను సందర్శిస్తుంటారు. ఇక బీచ్‌లనగానే గోవానే గుర్తొస్తుంటుంది. కానీ, మహారాష్ట్రలోని తార్కర్లీలో కూడా ప్రసిద్ధిచెందిన బీచ్‌లు చాలానే ఉన్నాయి. ఇక్కడి బీచ్‌లను కుటుంబసమేతంగా వీక్షించొచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై, కేరళ వంటి ప్రదేశాలలో ఉష్ణోగ్రత ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవి సందర్శనకు విలువైన వాతావరణాన్ని కలిగిస్తాయి. శీతాకాలపు వారాంతాల్లో సందర్శనకు మహారాష్ట్రలోని తార్కర్లీ ఉత్తమమైన గమ్యస్థానం అని చెప్పుకోవచ్చు. సింధుదుర్గ్ జిల్లాలోని ఒక చిన్న అందమైన గ్రామం. ఈ గ్రామంలో చాలా పరిశుభ్రమైన, అందమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది తార్కర్లీ బీచ్. ఈ బీచ్ ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంటుంది. రండి ఇక్కడి ప్రసిద్ధప్రదేశాలను వీక్షిద్దాం.

తార్కర్లీలో చూడదగిన ప్రదేశాలు
తార్కర్లీ బీచ్
తార్కర్లి గ్రామంలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశం తార్కర్లీ బీచ్. ఈ బీచ్‌లోని నీరు ఎంతో శుభ్రంగా ఉంటుంది. బీచ్‌లో కూడా మురికి ఉండదు. చుట్టూ అక్కడక్కడ పచ్చదనం బీచ్ అందాన్ని మరింత పెంచుతుంది. ఈ ప్రదేశం ఫోటోషూట్‌లకు కూడా ప్రసిద్ధిచెందింది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ అనేక రకాల సాహస కార్యకలాపాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఆస్వాదించొచ్చు.
ఆచార బీచ్
తార్కర్లీలో సందర్శించదగిన రెండవ బీచ్ అచ్రా బీచ్. అచ్రా బీచ్ తార్కర్లీ బీచ్ నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ గురించి అతి తక్కువ మందికి తెలుసు. దీని కారణంగా ఇక్కడ పర్యాటకుల రద్దీ కనిపించదు. ఇక్కడికి వస్తే దాదాపు 260 ఏళ్లనాటి రామేశ్వరాలయాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.
కొలంబ్ బీచ్
తార్కర్లీ నగరంలోని కొలంబ్ బీచ్‌ని సందర్శించే అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి. ఇది డాల్ఫిన్లకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఇది చూడటానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ బీచ్‌లో వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్‌ని కూడా అనుభవించవచ్చు. సూర్యోదయం మరియు సూర్యాస్తమయపు దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని కూడా తప్పక సందర్శించొచ్చు.

ధాంపూర్ సరస్సు
ఇక్కడ సరస్సులు కూడా ప్రసిద్ధిచెందాయి. దాంపూర్ సరస్సు ఎంతో పేరుగాంచింది. ఈ సరస్సు దాదాపు 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ఒక అందమైన సరస్సు. ఈ సరస్సులో ఎన్నో సాహస కార్యకలాపాలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఆస్వాదించొచ్చు. విహారయాత్రకు ఇది మంచి ప్రదేశమనే చెప్పుకోవాలి.
సింధుదుర్గ్
ఇక్కడి బీచ్‌లతో పాటు సింధుదుర్గ్ కూడా ఎంతగానో పేరుగాంచింది. బీచ్‌లో ఉండే ఈ కోట నిర్మాణం నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ కోట ఛత్రపతి శివాజీ హయాంలో నిర్మించబడిందని చెబుతారు. దీన్ని నిర్మించడానికి 3 సంవత్సరాల కాలం పట్టిందట. ఈ కోట నిర్మాణంలో వేల మంది కూలీలు పాల్గొన్నారట. ఈ కోటలో ఒక దేవాలయం కూడా ఉంది.



Click it and Unblock the Notifications












