Search
  • Follow NativePlanet
Share
» »Year Ender 2023 : ఈ ఏడాది నటి సారా అలీఖాన్‌ సంద‌ర్శించిన ప్ర‌దేశాలు...

Year Ender 2023 : ఈ ఏడాది నటి సారా అలీఖాన్‌ సంద‌ర్శించిన ప్ర‌దేశాలు...

మ‌రికొద్ది రోజుల్లో కొత్త సంవత్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. అంటే ఈ ఏడాదికి గుడ్‌బై చెప్ప‌బోతున్నాం. ఈ ఏడాదిలో చాలామంది చాలా ప్ర‌దేశాల‌ను చూసి ఉంటారు. అందులో బాలీవుడ్ న‌టుడు సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఆలీఖాన్ కూడా ఉన్నారు. సారా 2023లో ఎన్నో ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. అందులో ఆధ్యాత్మిక ప్ర‌దేశాలున్నాయి. హిమ‌పాతం క‌లిగిన ప్ర‌దేశంలో, మ‌రెన్నో సుంద‌ర‌మైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ న‌టి ప‌ర్య‌టించిన ప్ర‌దేశాలేంటో ఒక‌సారి చూద్దాం.

spitivalley2

లాహౌల్ స్పితి వ్యాలీ

హిమాచల్ ప్రదేశ్‌లో సంద‌ర్శించేందుకు అనువైన ప్రాంతాల‌ను చాలానే ఉన్నాయి. కానీ, చాలామంది ప‌ర్యాట‌కులు స్పితి వ్యాలీకి వెళ్లాలని కలలు కంటుంటారు. ఈ ప్రదేశం నిజంగా ఎంతో అద్భుత‌మైన‌ది. అందుకే న‌టి సారా అలీ ఖాన్ కూడా ఈ ప్రాంతాన్నిప‌ర్య‌టించారు. ఈ ప్ర‌దేశం చుట్టూ వ్యాపించిన లోయలు, చుట్టూ హిమాలయ శ్రేణులు, మంచు ఎడారి, వాటి మధ్య‌లో మ‌లుపులు తిరిగే రహదారులు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. ఈ ప్ర‌దేశంలో కేవ‌లం 250 రోజులు మాత్రమే సూర్యరశ్మిని చూడగలరు.

బిజిలీ మహాదేవ్ ఆలయం

హిమాచల్‌లోని మరొక అంద‌మైన ప్రదేశం బిజిలీ మ‌హాదేవ్ ఆల‌యం. కులు వ్యాలీకి వెళ్లేటప్పుడు ఈ ప్రాంతాన్ని త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే. న‌టి సారా కూడా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించారు. ప్రతి 12 సంవత్సరాలకు, ఆలయం లోపల ఉన్న శివలింగంపై పిడుగు పడుతుందని, ఆ స‌మ‌యంలో శివలింగం విరిగిపోతుందని ఇక్క‌డివారు చెబుతుంటారు. సారా అలీ ఖాన్ కూడా కులు సంద‌ర్శ‌న‌లో భాగంగా ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు.

udaipur2

ఉదయపూర్

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ రాజభవనాలు, దేవాలయాలు, ఉద్యానవనాల‌తోపాటు ప్రకృతి సౌందర్యం వంటి అనేక ఆకర్షణలు క‌లిగి ఉన్న ప్ర‌దేశం. ఈ నగరం ఏడాది పొడవునా అనేక మతపరమైన, సాంస్కృతిక ఉత్సవాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఉదయపూర్‌ని 'సరస్సుల నగరం' అని కూడా పిలుస్తారు. ఇక్కడ అద్భుతమైన జల్ మహల్ కూడా సరస్సుల మధ్యలో ఉంటుంది. ఈ ప్ర‌దేశాన్ని చాలామంది సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు వీక్షించారు. న‌టి సారా ఆలీఖాన్ జాబితాలో కూడా ఈ ప్రాంతం ఉంది.

ఢిల్లీ

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సారా అలీ ఖాన్ ప‌ర్య‌ట‌న‌లో ఢిల్లీ కూడా ఉంది. ఢిల్లీ వేడిని అందరూ చూసినప్పటికీ శీతాకాలంలో కూడా ఢిల్లీ న‌గ‌రాన్ని సంద‌ర్శించాల్సిందే. జనవరి మాసంలో ఈ నగరం సిమ్లాగా రూపాంత‌రం చెందుతుంద‌నే చెప్పుకోవాలి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధిచెందింది. విదేశీయులు కూడా ఇక్కడ ఆహారం, పానీయాల కోసం ఎక్కువగా ఈ ప్రాంతాన్ని వీక్షిస్తుంటారు.

suryatempel1

మార్తాండ్ సూర్య దేవాలయం

జమ్మూ కాశ్మీర్‌లోని ఈ ఆలయం 7 నుండి 8వ శతాబ్దాల మధ్య యుగంలో నిర్మించబడింది. సూర్య వంశానికి చెందిన రాజు లలితాదిత్య ఈ ఆలయాన్ని అనంతనాగ్ అనే చిన్న పట్టణానికి సమీపంలోని కొండపై నిర్మించాడు. ఈ ఆల‌యం 84 స్తంభాలను కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో త‌ప్ప‌కుండా ఈ స్థలాన్ని సందర్శించవచ్చు.

అమర్నాథ్

శ్రీనగర్ నగరానికి ఈశాన్యంగా 135 కిలోమీటర్ల దూరంలో హిమాలయ కొండల్లో అమర్‌నాథ్ ఆలయం వెల‌సింది. ఈ దేవాలయం ఎత్తు నేల మట్టం నుండి దాదాపు 13,600 అడుగులు. అమర్‌నాథ్ గుహ 11 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అమర్‌నాథ్ ఆలయం హిందూ మతంలో శివునికి అంకితం చేయబడిన పవిత్ర స్థల‌మ‌ని చెప్పుకోవాలి. దీనిని యాత్రికుల తీర్థయాత్ర అని కూడా పిలుస్తుంటారు. చాలామంది సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు కూడా ఈ దేవాల‌యాన్ని చూశారు. న‌టి సారా కూడా త‌న సంద‌ర్శ‌న‌లో ఈ ప్రాంతానికి చోటుచేకూర్చింది.

sonmarg

థాజివాస్ గ్లేసియర్ సోనామార్గ్

థాజివాస్ గ్లేసియర్ సముద్ర మట్టానికి సుమారు 3000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం సోనామార్గ్ నుండి 2-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఎంతో అనువైనది ఈ ప్ర‌దేశం. ప్ర‌శాంత‌ను కోరుకునేవారు త‌ప్ప‌కుండా ఇక్క‌డికి రావాల్సిందే. సోనామార్గ్‌లోని ఈ హిమానీనదం పర్యాటకులకు ఎంతగానో నచ్చుతుంది. న‌టి సారా కూడా ఈ ప్ర‌దేశాన్ని వీక్షించారు.

కేధార‌నాథ్‌..

న‌టి సారా అలీఖాన్ ఎక్కువ‌గా ఆధ్యాత్మిక ప్ర‌యాణాల‌ను చేస్తుంటారు. ఈ ఏడాది ఆమె అమర్‌నాథ్ యాత్రలో అలాగే కేదార్‌నాథ్‌లో కూడా క‌నిపించారు. ఆమె కేదార్‌నాథ్‌ను అధిరోహించి, ఇక్కడి ఆలయంలో పూజలు కూడా చేశారు. అంతేకాకుండా ఇక్క‌డ జరిగే వివిధ కార్యక్రమాల్లో కూడా సారా పాల్గొన్నారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+