Search
  • Follow NativePlanet
Share
» »త‌క్కువ ధ‌ర‌లో హైద‌రాబాద్ నుంచి అయోధ్య, వార‌ణాసి సంద‌ర్శించేయొచ్చు...

త‌క్కువ ధ‌ర‌లో హైద‌రాబాద్ నుంచి అయోధ్య, వార‌ణాసి సంద‌ర్శించేయొచ్చు...

భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇందులో అయోధ్య, వార‌ణాసి వంటి ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను ప్ర‌తి ఒక్క పర్యాట‌కుడు అనుకుంటారు. మీరు కూడా అదే ఆలోచిస్తుంటే మాత్రం ఐఆర్‌సిటిసి మీకోక స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా మొత్తం ఆరురోజుల ప‌ర్య‌ట‌న ఉంటుంది. గంగా స‌ర‌యూద‌ర్శ‌న్ పేరుతో ఈ ప్యాకేజీ ప్రారంభం కానుంది. సెప్టెంబ‌ర్ 22నుంచి ఈ ప్యాకేజీ ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో రానుంది.

ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అనేక టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ప్యాకేజీనీ కూడా తీసుకొచ్చింది. ఇది ట్రైన్ జ‌ర్నీ. ఈ ప్ర‌యాణం హైదార‌బాద్ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అయోధ్య‌, వార‌ణాసి పుణ్య‌క్షేత్రాల సంద‌ర్శ‌న ఉంటుంది. ఇక, ఈ ట్రైన్కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఆ స్టేష‌సన్ల‌లో ప్ర‌యాణికులు రైలు ఎక్కొచ్చు.

varanasi1

ఆరురోజుల ప్ర‌యాణం షెడ్యూల్ ఇదే..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా 12791అనే నెంబ‌ర్‌గ‌ల దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ట్రైన్ మొద‌టిరోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు వార‌ణాసి చేరుకుంటారు. అక్క‌డికి వెళ్లగానే ముందుగా బుక్ చేసిన హోట‌ల్‌కు చేరుకోవ‌చ్చు. అదే రోజు సాయంత్రం కాశీ విశ్వ‌నాథుని పుణ్య‌క్షేత్రం, గంగ హార‌తి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా తిల‌కించొచ్చు. ఇక ఆ రోజు నైటంతా అక్క‌డే స్టేయింగ్ ఉంటుంది. మూడో రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని వార‌ణాసిలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల‌ను చూడొచ్చు. కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు కాలభైరవ్‌ మందిర్ కూడా తిల‌కించొచ్చు.

hyderabad1

సాయంత్రం షాపింగ్ కూడా చేసుకోవ‌చ్చు. నైట్ స్టేయింగ్ అక్క‌డే. ఆ మ‌రుస‌టిరోజు అల్పాహారం ఆర‌గించి అయోధ్యకు ప‌య‌న‌మ‌వుతారు. అక్క‌డికి చేరుకున్నాక‌న హోట‌ల్‌లో రెస్ట్ తీసుకుని దేశంలోని ప్ర‌సిధ్ధిచెందిన అయోధ్య రాములోరి ఆల‌యం సంద‌ర్శ‌నకు వెళ‌తారు. అనంత‌రం స‌మీపంలోని హనుమంతుని దర్శనం, దశరథ్‌ మహల్‌ను సంద‌ర్శించొచ్చు. సాయంత్రం వేళ స‌ర‌యూ ఘాట్ ప‌ర్య‌ట‌న ఉంటుంది. నైట్ ప్ర‌యాగ్‌రాజ్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ఐదోరోజు టిఫిన్ చేశాక సాయంత్రం సికింద్రాబాద్ 12729 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్‌ను ఎక్కాల్సి ఉంటుంది. ఇక అక్క‌డినుంచి సికింంద్రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం ఉంటుంది. ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది.

ayodhya-nagri-

ప్యాకేజీ వివ‌రాలివే...

కంఫర్ట్ థర్డ్‌ ఏసీ బెర్త్ ఒక్కో ప్రయాణికుడికి అయితే రూ.41,090, చెల్లించాలి. ఇద్ద‌రికి షేరింగ్‌కు అయితే రూ.24,350 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,720 చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల మధ్య పిల్ల‌ల‌కు విత్ బెడ్ అయితే రూ.15,390 ఉంటుంది. విత్ అవుట్ బెడ్ అయితే రూ.13,790గా నిర్ణయించారు. స్టాండర్డ్ స్లీపర్‌ బెర్త్ ఒక్క ప్ర‌యాణికుడికి రూ.21,620 ఉటుంది. అదే ఇద్ద‌రికి అయితే రూ.17,220 చెల్లించాలి. అదే ముగ్గురిక‌యితే, రూ.16,710 ఉంటుంది. ఇక 5-11 ఏళ్ల మధ్య పిల్ల‌ల‌కు విత్ బెడ్‌తో క‌లిపి రూ.13,620 ఉంటుంది. అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.12,010 చెల్లించాల్సి ఉంటుంది.

More News

    Read more about: irctc tourpackage hyderabad
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+