Search
  • Follow NativePlanet
Share
» »ర‌థ‌స‌ప్త‌మి రోజున ఈ సూర్యుని ఆల‌యాల‌ను ద‌ర్శించుకోవాల్సిందే..

ర‌థ‌స‌ప్త‌మి రోజున ఈ సూర్యుని ఆల‌యాల‌ను ద‌ర్శించుకోవాల్సిందే..

నేడు ర‌థ‌స‌ప్త‌మి. ఈ రోజు సూర్య‌భ‌గవానికి అంకితం చేస్తారు. అందుకే ఈ రోజున సూర్య నారాయణుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. దేశంలో ఏన్నో పురాతన ఆల‌యాలు ఉన్నాయి. అందులో సూర్య దేవుని ఆలయాలు కూడా ఉన్నాయి. ర‌థ‌స‌ప్త‌మి నాడు ఈ ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తే స‌క‌ల పాపాలు తొల‌గి పాప విముక్తులు అవుతార‌ని చాలామంది న‌మ్మ‌కం. ఈ సందర్భంగా భార‌త‌దేశంలో ఉన్న ప్రముఖ సూర్య దేవాలయాల గురించి తెలుసుకుందాం.

గ్వాలియర్‌లోని సూర్య దేవాలయం, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఉండే సూర్య దేవాలయం ఎంతగానో ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయం కోణార్క్ సూర్య దేవాలయం మాదిరిగానే ఉంటుంది.

రాంచీ సూర్య దేవాలయం, జార్ఖండ్

జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ పేరుగాంచిన సూర్య దేవాలయం ఉంది. ఇది రాంచీ, టాటా రోడ్డుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఏడు గుర్రాలపై వస్తున్న సూర్యుడిని చూసేందుకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లిస్తుంటారు.

arasavallisuryanarayantemple1

అరసవల్లి సూర్య నారాయణుడి ఆలయం, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుణ్య‌క్షేత్రాల‌కు కొదవే లేదు. ఇక్క‌డ అనేక పురాత‌న ఆల‌యాలు ఉన్నాయి. ఇక్క‌డి సూర్య నారాయ‌ణుడి ఆల‌యం కూడా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్య నారాయణుడి ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయంలో రథసప్తమి రోజున ప్రత్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. ఈ ఆల‌యంలోని గ‌ర్భ‌గుడికి నేరుగా సూర్య‌కిర‌ణాలు తాకుతాయి. ఇది కూడా సంవత్సరానికి రెండుసార్లు జ‌రుగుతుంది. ఇక‌, ఈ పురాత‌న ఆలయానికి 1300 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఆల‌యంలో కొలువైన సూర్యనారాయణుడు ఉష, ఛాయలతో కలిసి విశేష పూజలందుకుంటారు.

konarksuryatemple1

కోణార్క్ సూర్య దేవాలయం, ఒడిశా

ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాల‌యం ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని శ్రీ క్రిష్ణుని కుమారులు సాంబ కట్టించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆల‌యం చంద్ర భాగ నది తీరాన వెల‌సింది. ఈ ఆల‌యానికి ఓ ప్ర‌త్య‌క‌త ఉంది. ఇది రథం ఆకారంలో ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ఉండే రథచక్రాలపై పడే నీడను బట్టి సమయాన్నితెలుసుకోవచ్చ‌ని ఇక్క‌డికి వ‌చ్చిన వారు చెబుతుంటారు.

moderasuryatemple1

మోదెరా సూర్య దేవాలయం, గుజ‌రాత్‌

గుజ‌రాత్ రాష్ట్రంలో కూడా ప్ర‌సిద్ధిచెందిన సూర్య భ‌గ‌వానుడి ఆల‌యం ఉంది. ఇది పటాన్ జిల్లా నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీ.శ.1026లో సోలంకి రాజవంశానికి చెందిన భీముడు నిర్మించినట్లు చ‌రిత్ర చెబుతోంది. వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి అపూర్వమైన ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఆల‌యం. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం వినియోగించలేదట‌. ఈ దేవాలయంలో హస్త కళలకు, వాస్తు శిల్పాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ఈ ఆల‌యం సుమారు 1200 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయాన్ని మారు గుర్జర్ శైలిలో నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఈ దేవాలయంలోని కళాఖండాలు సంవత్సరంలోని రోజులను శాస్త్రీయంగా లెక్కిస్తారు. వీటితోపాటు ఈ ఆలయంలోని గుర్భగుడిలో జూన్ 21న సూర్యుని తొలి కిరణం ఈ విగ్రహం కిరీటంపై ఉన్న రత్నంపై ప‌డుతుంది. దీని వల్ల గర్భగుడి మొత్తం ప్రకాశవంతంగా మారుతుంది.

పురాతన సూర్య దేవాలయం , జమ్మూ కాశ్మీర్‌

జమ్మూ కాశ్మీర్ లోనూ కూడా సూర్య నారాయ‌ణుని పురాతన సూర్య దేవాలయం ఉంది. ఈ దేవాల‌యం కాశ్మీర్ సమీపంలోని మార్తాండ్‌లో వెల‌సింది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అనంత నాగ్ అనే ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

డియో సూర్య దేవాలయం, బీహార్

బీహార్ రాష్ట్రంలోకూడా ప్ర‌ముఖ సూర్య దేవాల‌యం ఉంది. దీనిని డియో సూర్య దేవాలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలోనూ అత్యద్భుతమైన ప్రత్యేకతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఇక్కడ ఉండే ఆలయం తూర్పు ద్వారం కాకుండా పడమర వైపునకు ఉంటుంది. ఈ ఆలయం త్రేతా యుగానికి సంబంధించినది. ఈ ఆల‌యంలోని సూర్య నారాయణుడు మూడు రూపాల్లో భ‌క్తులు దర్శనమిస్తుంటాడు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+