యానా గ్రామంలో యానా గుహలు మరో ఆకర్షణ. ఈ 3 మీటర్ల లోతున్న గుహలు దట్టమైన సహ్యాద్రి పర్వ శ్రేణులలో ఉన్నాయి. పర్యాటకులు ఈ కొండలు ఎక్కి ఆనందించవచ్చు. యానా గుహలు నల్లని సున్నపు రాతితో ఏర్పడ్డాయి. ఈ గుహలలో గంగోద్భవ అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇది ప్రవేశం లోనే ఉంటుంది. పురాతన దేవాలయం, రాతి నిర్మాణాలు, పర్వత శ్రేణులు, జలపాతాలతో ఈ ప్రదేశం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. మాత దుర్గాదేవి అవతారమైన చంద్రిక కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ పర్యాటకులు చూడవచ్చు. ఈ రాళ్ళగుండా ప్రవహించే నీరు చండిహోల్ అనే చిన్న నదిగా ఏర్పడి అది అఘనాశిని నదిలో ఉప్పినపట్టణం వద్ద కలుస్తుంది. ఇక్కడ బస చేయాలనుకునే వారికి అవసరమైన వస్తువులు సమకూరుస్తారు.