శింగ్బా రోడోడెన్డ్రాన్ అభాయారణ్య౦ ఉత్తర సిక్కిం లోని యుమతాంగ్ లోయలో 3048 నుంచి 4575 మీటర్ల మధ్య వున్న ప్రకృతి ఉద్యానవనం. ఈ పార్కులో 49 వివిధ జాతుల రోడోడెన్డ్రాన్ పుష్పాలు, పాపీలు, సాక్సిఫ్రేజ్ లు, పోటేంటిల్లాలు, అకోనైట్ లు, ప్రిములా లు, గెంతియన్ లు లాంటి చాలా రకాల నేల పుష్ప జాతులు కూడా వున్నాయి.
పునుగు పిల్లి లాంటి కొన్ని అరుదైన జాతుల జంతువులు కూడా ఇక్కడ కనపడతాయి. రోడోడెన్డ్రాన్ లు పూర్తిగా వికసి౦చినప్పుడు చంజోమేయి నుచి లావా పాస్ వారు విస్తరించి వుండే 33 హెక్టార్ల మేర చాలా అందంగా కనపడుతుంది. ఈ కాలంలో ఈ ప్రాంతం అంటా స్విట్జర్లాండ్ అంత అందంగా కనపడుతుంది.
ఈ అడవి సిక్కిం రాష్ట్ర పక్షి ఎర్రటి ఫీసంట్ కు కూడా ఆలవాలం గా వుంది. ఏప్రిల్, మే నెలల్లో ఈ అభయారణ్యాన్ని సందర్శించడం మంచిది. ఈ అభయారణ్యం యుమతాంగ్ వేడి నీటి చలమాలకు దగ్గరలోనే వుంది, ఇది కూడా సిక్కిం లో చూడ దగ్గ ప్రదేశం.