హీరాకుడ్ జలాశయంలో సగం మునిగిన కొండే క్యాటిల్ ఐలాండ్. హీరాకుడ్ ఆనకట్ట నిర్మాణానికి ముందు ఈ ద్వీపం ఒక అభివృద్ది చెందినా గ్రామం. ఆనకట్ట పూర్తి కాగానే, చుట్టూ పక్కల నివసించే గ్రామస్తులను ఖాళీ చేయమని చెప్పారు. గ్రామస్థులు వేరేప్రదేశానికి తరలుతూ వారి స్వంత పశుసంపదలో పెంపుడు జంతువులూ కొన్నింటిని అక్కడే వదిలి పెట్టారు.
కాలక్రమేణా, మనిషిని వేరొక గ్రహ జీవిగా భావించే ఈ పశువులు వన్య జాతులుగా అభివృద్ధి చెందాయి. దాదాపు అన్ని పశువులు తెలుపు లేదా మీగడ రంగులో పూర్తి ద్వీపానికి దివ్యత్వం కలగా జేస్తుంటాయి. ఈ పశువులు అడవి జంతువులైనందున, పెంపుడు జంతువుల కంటే పెద్దవిగాను, భయం కొల్పెట్టుగా ఉంటాయి. వీటిని మచ్చిక చేసుకోవడానికి మనిషి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈ ద్వీపాన్ని సందర్శించి, భయం కల్గించే ప్రకృతి తిరిగి పరిరక్షిస్తున్న ఈ గ్రామ అవశేషాలను చూడండి.