Search
  • Follow NativePlanet
Share
» »దేవరకొండ కోట, నల్గొండ జిల్లా !!

దేవరకొండ కోట, నల్గొండ జిల్లా !!

900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ కనువిందు చేస్తుంది. అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి బావులు కోటలో కనిపిస్తాయి.

By Mohammad

దేవరకొండ కోట తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో ఉంది. ఈ కోట ఏడు కొండలతో చుట్టబడిన ఒక కొండపై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్దంలో రేచెర్ల వెలమ రాజులు నిర్మించారు. శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడంకోసం ఈ కోటను నిర్మించారని చెబుతారు.

చరిత్ర

గతంలో కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పనిచేసిన పద్మనాయక వంశస్థులకు చెందిన భేతాళ నాయకుడు సంతతి వారు దేవర కొండ రాజ్యాన్ని స్థాపించి నట్టుగా చారిత్రిక ఆధారలను బట్టి తెలుస్తున్నది. వీరి తరంలో రెండవ మాదానాయుడు కాలంలోనె దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాదారలనుబట్టి తెలుస్తున్నది. ఇతనికాలంలో దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది. ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ ధుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.

దేవరకొండ కోట దృశ్యం

దేవరకొండ కోట దృశ్యం

చిత్రకృప : తెలంగాణ పర్యాటకం

విశేషాలు

దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు కనువిందు చేస్తుంది. దాదాపు 500 మీటర్ల పై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట ఏడు కొండల ప్రాంతాల నడుమ సుమారు 520 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి వుంది.

కాకతీయ రాజుల ఏలుబడిలో దేవరకొండ కోట చాలాకాలం పాటు ఉంది. కాకతీయులు తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాచకొండ కోట తో పాటు దేవరకొండ కోటను కూడా వారు తమ వశం చేసుకున్నారు. సుమారు 1230 సంవత్సర ప్రాంతంలో దేవరకొండను ఆధారంగా చేసుకొని కాకతీయులు తమ రాజ్యపాలనను గావించారం. దాదాపు 290 సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే వుండి అనేక విధాలుగా తీర్చిదిద్దబడింది. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంటభూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు ఉన్నాయి.

కోటలోపలి భాగం

కోటలోపలి భాగం

చిత్రకృప : Pranayraj1985

ఈ కోటలో ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు ఉన్నాయి. పూర్తి గ్రానైట్‌ రాయితో చెక్కబడిన 9 ద్వారాలపై అనేక కాకతీయుల రాజ చిహ్నాలు మనకు నేటికీ దర్శనమిస్తాయి. 9 ప్రధాన ప్రాకారాలు మాత్రమే కాకుండా కోట లోపలి వైపు వెళుతున్నకొద్దీ దాదాపు 30 చిన్న ప్రాకారాలు సహితం మనకు దర్శనమిస్తాయి. కోటలోకి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి వారిని బంధించడానికి వారి ఎత్తులను చిత్తు చేయడానికి, ఎక్కడికక్కడ శతృవుల రాకను నిరోధించడానికి ఆ ద్వారాలు నిర్మించారు.

అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి బావులు కోటలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా కోటలోని ప్రజల జల అవసరాల కోసం ఆరు డ్యాం వంటి నిర్మాణాలు, అయిదు వరకు చెరువుల నిర్మాణాలు మనకు ఈ కోటలో కనిపిస్తాయి. శత్రువులు నెలల తరబడి కోటను చుట్టుముట్టినా నీటికి కొరతలేకుండా ఇన్ని నీటి నిర్మాణాలు ఈ కోటలో అలనాటి రాజులు చేపట్టటం గొప్ప విశేషం.

కోటకు 360 బురుజులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలున్నట్లు ఆధారాలున్నాయి.

దిండి రిజర్వాయర్

దిండి రిజర్వాయర్

చిత్రకృప : రహ్మానుద్దీన్

దేవరకొండ ఆలయాలు

పాత శివాలయం, పాత రామాలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, సంతోషిమాత ఆలయం, శ్రీ భక్త మార్కెండయ దేవాలయం, సాయిబాబా ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, పెద్దదర్గా ఉరుసు చూడదగ్గవి.

ఇది కూడా చదవండి : పంచనారసింహ క్షేత్రం ... యాదగిరి గుట్ట !!

దేవరకొండ కోట కు ఎలా చేరుకోవాలి ?

హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వెళ్ళే రహదారిలో మల్లెపల్లి గ్రామం ఉంది. అక్కడి నుండి 7 కిలోమీటర్ల దూరంలోనే దేవరకొండ దుర్గం ఉంది. హైదరాబాద్ నుండి రెగ్యులర్ గా దేవరకొండ కు బస్సులు తిరుగుతాయి. అక్కడ దిగి ఆటోలో కోట వరకు చేరుకోవచ్చు. కోట పట్టణానికి 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X