గావిల్ ఘర్ కోట సుమారు 300 సంవత్సరాల క్రిందటిది. అమరావతిలోని చిక్కల ధార సమీపంలో ఈ కోట సుమారు 1103 మీటర్ల ఎత్తున మరియు పురాతన రాజధాని బేరార్, అచలపూర్ కు ఉత్తరాన 30 కి.మీ. ల దూరంలో కలదు. ఈ కోటకు ఆ పేరు గావలిస్ నుండి వచ్చింది. ఈ కోటను 1425 లో అహ్మద్ షా వలి నిర్మించారు. తర్వాత దానిని ఫతే ఎల్లా ఇమాద్ ఎల్ ముల్క్ పునర్నించారు. గావిల్ ఘర్ ను రెండు దశలలో నిర్మించారు. బయటి కోట లోపలి కోటకంటే పల్లపు ప్రదేశంలో ఉంటుంది. ప్రసిద్ధి చెందిన ఢిల్లీ దర్వాజా రెంటిని వేరు పరుస్తుంది. దీనిలో ఒక మసీదు పఠాన్ శైలి శిల్పకళా నైపుణ్యంతో ఉంటుంది. ఇక్కడ కల ఎనిమిది ట్యాంకులలోను రెండు ట్యాంకులు నేటికి పని చేస్తూనే వున్నాయి. కోట గోడలపై ఉర్దు, హింది, అరబిక్ భాషలలో వ్రాసిన శాసనాలు మరియు ఎద్దులు, సింహాలు, ఏనుగులు, పులులు వంటి జంతువుల బొమ్మలు కనపడతాయి.



Click it and Unblock the Notifications