దుర్గయాన ఆలయంనకు వాయువ్య మూలన హనుమాన్ మందిర్ ఉన్నది. అమృత్సర్ లో ఉన్న ఈ హిందూ మత ఆలయంను తప్పక సందర్సించాలి. హనుమంతునికి అంకితం చేయబడింది. అంతేకాక ఈ అందమైన ఆలయంలో లార్డ్ రామ తన అశ్వమేధ యాగంను జరిపించిన ప్రదేశంగా భావిస్తున్నారు. ఆలయంలో లంగూర్వాల మేళా సమయంలో భక్తులు ప్రదర్శించే లంగూర్ నృత్యం అత్యంత ప్రశంసలు పొందినదని చెప్పవచ్చు.
దీనిని బారా హనుమాన్ మందిర్ అని కూడా పిలుస్తారు. హనుమంతుని అద్భుతమైన పురాతన విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. ఈ దేవాలయంను భక్తులు ప్రతిరోజు సందర్శిస్తే వారి కోరికలు నెరవేరుతాయని స్థానికుల నమ్మకం. దంపతులు వారి మగ శిశువును ఆలయ ప్రాంగణంలో పురాతన మర్రి చెట్టు దగ్గర నిలబడి ఒక దారం కడతారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత నవరాత్రులు సమయంలో ఆ దారంను విప్పుతారు. మగ శిశువు తొమ్మిది రోజులు లంగూర్ వంటి దుస్తులు దరించి నవరాత్రులు ముగింపు రోజున అదే మర్రి చెట్టు దగ్గర వారి దుస్తులను తీసివేసే ఒక ఆచారం ఉన్నది.



Click it and Unblock the Notifications