మసీద్ బాబా దావూద్ ఖాకి ని సుమారు 600 సంవత్సరాల కిందట నిర్మించారు. ఇది పట్టణం లో అతి పురాతన మసీదు. ఇది రిషి బజార్ లో అనంతనాగ్ మొహాల ఖక్కి షాబాన్ లో కలదు. ఈ మసీద్ ఆ నాటి ముస్లిముల పండితుడు అయిన హజరత్ షేక్ బాబా దావూద్ ఖాకి పేరు పై ఏర్పరచారు. ఆయన హజారత్ షేక్ హంజా మఖ్దూం సాహిబ్ అనుచరుడు. ఈ ప్రాంతానికి ప్రధాన కాజి గా పరిగనిస్తారు హజారత్ షేక్ బాబా దావూద్ ఖాకి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి గాను మసీద్ బాబా దావూద్ ఖాకి తో సహా అనంతనాగ్ జిల్లాలో అనేక మసీదులు స్థాపించాడు
ఈ మసీదు ఒక చిన్న నిర్మాణం గా వున్నపుడు, ప్రవక్త షా హమ్దాన్ , ఇరాన్ నుండి ఇక్కడకు వచ్చాడని, చెపుతారు. ఈ మసీద్ గ్రౌండ్ ఫ్లోర్ ను 1397 లో మీర్ మొహమ్మద్ హమదాని నిర్మించాడు. ఈయన ప్రవక్త షా హమ్దాన్ కుమారుడు దీని తర్వాత బాబా దావూద్ ఖాకి 2వ మరియు 3వ అంతస్తులను వరుసగా క్రి. శ. 1579 మరియు 1582 సంవత్సరాలలో నిర్మించాడు. అనంతనాగ్ లో సుమారు 10 సంవత్సరాలు గడిపిన తర్వాత, ప్రవక్త ఖాకి 1587 లో మరణించాడు.



Click it and Unblock the Notifications