Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అష్టవినాయక

అష్టవినాయక - గణపతుల ప్రదేశం

12

అష్ట వినాయక అంటే ఎనిమిది గణపతులని అర్ధం చెప్పాలి. మహారాష్ట్రలో వివిధ ప్రదేశాలలో కల ఎనిమిది గణపతి దేవాలయాలకు పర్యటన అని భావించాలి. ఈ ఎనిమిది దేవాలయాల పేర్లు వరుసగా చెప్పాలంటే, మోర్గాంవ్ వద్ద కల మయూరేశ్వర, సిద్ధాటెక్ వద్ద సిద్ధి వినాయక, బల్లలేశ్వర్ వద్ద పలి, లేన్యాద్రి వద్ద గిరిజాత్మక్, చింతామణి వద్ద ధేయూర్, ఒజార్ వద్ద విగ్నేశ్వర్, రంజన్ గాంవ్ వద్ద మహాగణపతి, మరియు చివరిదైన మహాద్ వద్ద వరద వినాయక దేవాలయాలు.

ఈ ఎనిమిది అష్టవినాయక దేవాలయాలు కూడా పురాతనమైనవి మరియు ప్రాచీన కాలంనాటివి. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంధాలైన గణేష మరియు ముద్గాల పురాణాలలో పేర్కొన్నారు.  ఈ దేవాలయాల శిల్ఫశైలి ఎంతో అందంగా ఉంటుంది. వీటి నిర్వహణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికపుడు వీటిని పునర్నిర్మిస్తూనే ఉన్నారు.

ప్రత్యేకించి గణపతి ఆరాధ్యులైన  పేష్వా పాలనలో వీటి పునర్నిర్మాణాలు అమోఘంగా జరిగాయి. ప్రతి హిందూ మతస్తుడు తన జీవితంలో ఆనందాలను అదృష్టాలను పొందేందుకు కనీసం ఒకసారైనా ఈ అష్టవినాయకుల ఎనిమది దేవాలయాలు దర్శించి తరించవలసిందే. ఈ దేవాలయాలన్నింటికి ఒక ఉమ్మడి అంశం ఏమంటే, వాటిలో ప్రతి ఒక్కటి స్వయంభూ దేవాలయమే. అంటే విగ్రహాలు మానవ నిర్మితమైనప్పటికి దేవాలయాలున్న ప్రదేశాలు ఒకప్పుడు గణపతి వెలసిన ప్రదేశాలే.

ఎనిమిది దేవాలయాలకు తీర్ధయాత్రమొత్తంగా ఎనిమిది గణపతి దేవాలయాలలోను ప్రతి ఒక్క గణపతికి ఒక్కొక్క రకం మహిమ, అంటే విఘ్నాలను తొలగించటం, ఐశ్వర్యాన్ని ప్రసాదించటం, విద్యా బుద్ధులు నేర్పించటం వంటివి తప్పక జరుగుతాయని ఆయా ప్రాంతాల భక్తులు విశ్వసిస్తారు.  ప్రతి దేవాలయం మరి ఒకదానితో అసాధారణ సారూప్యతలు కలిగి వున్నప్పటికి, వేరు వేరు మహిమలు కలిగి ఉన్నాయి.

గణపతి విగ్రహంలో ఉన్న భంగిమ అంటే ఆయన తొండము కూడి వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. కాని సిద్ధాటెక్ వద్దగల సిద్ధి వినాయక దేవాలయంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి కనపడుతుంది.

మయూరేశ్వర దేవాలయం మోర్గాంవ్ గ్రామంలో కలదు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. సమీపంలో పెద్ద దీపమాల అంటే ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది.

సిద్ధి వినాయక దేవాలయం సిద్ధా టెక్ లో కలదు. ఈ ప్రదేశం ప్రత్యేకత అంటే, ప్రదక్షిణం. దేవాలయం ఒక కొండకు ఆనుకొని ఉంటుంది. పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది.  బల్లాలేశ్వర దేవాలయం పాలి గ్రామంలో కలదు. అన్ని దేవాలయాల వలే కాక ఈ దేవాలయానికి బ్రాహ్మణ రూపంలో సాక్షాత్కరించిన ఒక భక్తుని పేరు పెట్టారు.

గిరిజాత్మక దేవాలయం గుహలు కల ఒక కొండ పైభాగాన కలదు. దీనిని దర్శించాలంటే 300 మెట్లు ఎక్కాలి. కష్టమైనప్పటికి పైకి వెళితే అక్కడి అందచందాలకు ఎంతో ఆనందం కలుగుతుంది.

చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి రూపం కలిగి ఉంటాడు.

ఓజార్ వద్ద గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరం బంగారంతో తయారు చేయబడ్డాయి.  మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దదిగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. ఇది రంజన్ గాంవ్ లో కలదు.

చివరగా, మహాడ్ గ్రామంలో వరద వినాయక దేవాలయం కలదు. ఈ దేవాలయ విగ్రహం ఒక సరస్సు ఒడ్డున లభిస్తే దానిని దేవాలయంలోపల ప్రతిష్టించారు. నేడు మనం చూసే వరద వినాయక దేవాలయం వాస్తవానికి పేష్వా పాలకులచే పునరుద్ధరించబడిన దేవాలయం.  

ఈ ప్రదేశాలను ఎలా సందర్శించాలి? అనేకమంది ప్రయివేటు బస్ ఆపరేటర్లు ఈ ఎనిమిది దేవాలయాలకు మూడు రోజుల కాలంలో ఎంతో సౌకర్యంవంతమైన బస్ లను అందిస్తారు. ఈ మూడు రోజుల అద్భుత ఆనందకర ప్రయాణం కొరకు మీరు ఏ బస్ ఆపరేటర్ ను అయినా సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. మీరు ఒంటిరిగా లేదా కుటుంబ సభ్యులతో కలసి కూడా వెళ్ళి ఆనందించవచ్చు.

ఈ అష్ట గణపతి దేవాలయాలకు ఎంతో మహిమ కలదని చెపుతారు. ప్రయాణం కొంచెం మీకు అలసట కలిగించేదైనా, గణపతి దేవుడు ఒకడే అయినప్పటికి వివిధ పేర్లతో కల ఈ గణపతులను వివిధ ప్రదేశాలలో దర్శించి గణపతి దేవుడి ఆశీర్వాదం మరియు మహిమలను తప్పక పొందవచ్చు.  

ఎనిమిది దేవాలయాలలోను ఆరు దేవాలయాలు పూనే జిల్లాలోను చివరగా మరో రెండు దేవాలయాలు రాయ్ గడ్ జిల్లాలో కలవు. దర్శనం కొద్దిపాటి అలసట కలిగించేదే అయినప్పటికి చూడదగిన ప్రదేశాలు. దర్శనం చివరిలో ప్రతి వారికి ఎంతో ప్రశాంతత, తృప్తి కలుగుతాయి.

ఈ దేవాలయాలకు ఎలా చేరాలి?   1. మయూరేశ్వర్ దేవాలయం, మోర్గాంవ్మోర్గాంవ్ కు పూనే సమీప పట్టణం. 80 కి.మీ. ల దూరం. పూనే - సోలాపూర్ జాతీయ మార్గంలో ఉంటుంది. పూనే నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. మోర్గాంవ్ ను అక్కడికి 15 కి.మీ.ల దూరంలో ఉన్న జెజూరి నుండి కూడా చేరుకోవచ్చు.

2. సిద్ధివినాయక దేవాలయం, సిద్ధాటెక్ సిద్ధి వినాయక దేవాలయం అహ్మద్ నగర్ జిల్లాలో కర్జాత్ తాలూకాలో కలదు. ట్రైన్ లో వెళ్ళే వారైతే, పూనే - సోలాపూర్ మార్గంలోని డౌండ్ స్టేషన్ లో దిగాలి. అక్కడనుండి 18 కి.మీ.ల దూరంలో కల సిద్ధి వినాయక దేవాలయం చేరవచ్చు. అష్ట వినాయక దేవాలయాల దర్శనకు ప్రభుత్వ బస్ లతో పాటు ప్రయివేటు బస్సులు కూడా ఉంటాయి. ముంబై నుండి డ్రైవింగ్ లో వచ్చే వారు పటాస్, భిగవాన్, రేషిన్ మార్గాల ద్వారా ఈ దేవాలయం చేరవచ్చు.

3. బల్లాలేశ్వర దేవాలయం - పాలి పాలి గ్రామంలోని బల్లాలేశ్వర దేవాలయం కర్జాత్ నుండి 30 కి.మీ.లు ముంబై నుండి 125 కి.మీ.లు కలదు. పాలి ప్రదేశానికి ముంబై నుండి ఖోపోలి లేదా పాన్వేల్ ల ద్వారా చేరవచ్చు. పూనే నుండి పాలి 10 కి.మీ.ల దూరం మాత్రమే. పాన్వేల్, ఖోపోలి, కర్జాత్, పూనే మరియు ముంబై లనుండి అష్ట వినాయక దేవాలయాలకు పర్యటనలు ప్రయివేటు వాహనదారులు నిర్వహిస్తారు.    4. గిరిజాత్మక్ దేవాలయం, లేన్యాద్రి పూనే - నాసిక్ రోడ్డు పై గల లేన్యాద్రి చాకన్ మరియు నారాయణగాంవ్ మార్గంలో కలదు. లేన్యాద్రికి సమీపంలో సుమారు 5 కి.మీ.ల దూరంలో జున్నార్ కలదు. ట్రైన్ లో ప్రయాణించేవారు పూనే రైలు స్టేషన్ లో దిగి చేరుకోవచ్చు. పూనే లోని శివాజి నగర్ మరియు ముంబై లనుండి జున్నార్ కు బస్ లు లభ్యంగా ఉంటాయి.  

5. చింతామణి దేవాలయం, ధియోర్ పూనేకు 25 కి.మీ. ల దూరంలో ధియోర్ కలదు. బోర్ ఘాట్ తర్వాత వస్తుంది. బోర్ ఘాట్ ముంబై - ఖండాల రోడ్డు మార్గంలో కలదు. పూనే సోలాపూర్ జాతీయ రహదారినుండి కూడా ధియోర్ చేరుకోవచ్చు. పూనే మరియు ముంబై లనుండి బస్ లు దొరుకుతాయి.  

6. విఘ్నేశ్వర్ దేవాలయం, ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగాంవ్ మరియు జున్నార్ ల నుండి ఓజార్ 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలలో చేరవచ్చు. ఈ రూట్ లో స్ధానిక బస్సులు లభ్యంగా ఉండవు. పూనే మరియు ముంబై ల నుండి జున్నార్ కు సౌకర్యవంతమైన ప్రయివేటు బస్ లు కలవు.

7. మహాగణపతి దేవాలయం, రంజన్ గాంవ్రంజన్ గాంవ్ గ్రామం పూనే నుండి 50 కి.మీ.లు. పూనే - నాగపూర్ జాతీయ రహదారి లో కలదు. పూనే శివాజి నగర్ బస్ డిపో నుండి అనేక ప్రభుత్వ బస్ లు దొరుకుతాయి.

8. వరద వినాయక దేవాలయం, మహాడ్ ముంబై నుండి ఈ దేవాలయం 83 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఖోపోలి కి ముందు వచ్చే హాలగాంవ్ మహాడ్ కు 6 కి.మీ.ల దూరం మాత్రమే. ట్రైన్ లో ప్రయాణించేవారుముంబై- పూనే మార్గంలోని  కార్జత్ లేదా ఖోపోలిలో దిగి స్ధానిక ఆటో రిక్షా లేదా బస్ లలో మహాడ్ చేరవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ బస్ లు కూడా కలవు.  

అష్టవినాయక ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అష్టవినాయక వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అష్టవినాయక

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అష్టవినాయక

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat