వళచల్ జలపాతం షోలయార్ పర్వత శ్రేణులలోని అతిరాప్పిల్లి వర్షాధార అడవులలో ఉంది. ఇది అతిరాప్పిల్లి జలపాతం నించి 5 కి.మీ , చలకుడి అడవులనించి 36 కి.మీ ల దూరం లో ఉంది. జలపాతపు మనోజ్ఞమైన అందం నగర జీవనం లోని ఒత్తిడి నించి విరామం తీసుకోవటానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. తన సోదరి జలపాతమైన అతిరాప్పిల్లి జలపాతం లా కాకుండా వళచల్ జలపాతం వేగవంతమైన నది లా కనిపిస్తుంది. వళచల్ ప్రాంతం నదీతీర సంబంధిత వృక్షసంపద తో వేలాది జీవ జాతులతో విరసిల్లుతుంది. ఈ ప్రాంతం ఆరంభంలోనే అందరి పర్యాటకులకోసం ఒక టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఈ ప్రదేశం ముఖ్యమైన బర్డ్ ఏరియా గానూ భారతదేశం లో అత్యుత్తమ ఏనుగుల సంరక్షణ యత్నం గానూ ప్రసిద్ధిచెందింది. నీటి మట్టం మాములుగా తక్కువ గానే ఉంటుంది. అయితే వర్షాకాలం లో నీళ్ళు పైకి వచ్చి ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించి ఒక భారీ జలపాతం లా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications