బలంగీర్ నుండి జల మహాదేవ 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివలింగానికి బదులుగా ఎల్లప్పుడు ప్రవహించే కాలువ అడుగున భక్తులు పాలు, నీళ్ళు పోసి పూజించే పరమశివుని విగ్రహం ఉండటం ఈ ప్రాంతం ప్రత్యేకత.
జలమహదేవలో స్వయంభూ పరమశివుడు లేదా తన స్వంత రూపంలో కనబడే పరమశివుని చూస్తాం. ఇక్కడ దూర, దగ్గర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి నేరేడు ఆకులు, పూవులను కాలువలో వదిలి పూజ చేస్తారు. ఈ ప్రాంతం చుట్టూ లెక్కలేనన్ని శివలింగాలు ఉన్నాయి.
విముక్తి కోసం కూడా భక్తులు ఈ కాలువలో స్నానమాచరిస్తారు. సుందర దృశ్యాల మదరా కొండల పైన జలమహాదేవ ఉంది. ఈ ప్రాంతం కొన్ని అసాధారణ మొక్కలు, అందమైన పక్షులు, ఎన్నో జంతువులకు నివాసం. ఈ ప్రాంతంలో ఎన్నో సరీసృపాలు, వివిధ జాతుల కీటకాలు కూడా ఉన్నాయి. ధార్మిక సందర్శనతో బాటుగా, ప్రజలు ఇక్కడకు విహారయాత్రకు కూడా వస్తారు. సాహసప్రియులు పర్వతారోహణకు, శిబిరాలలో బస చేయడానికి వస్తారు. జలమహాదేవ, బలంగీర్ లో తప్పక చూడవలసిన ఆకర్షణ. ఫోటోగ్రఫిలో ఆసక్తి ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా సందర్శించాలి.



Click it and Unblock the Notifications