కబ్బన్ పార్క్, బెంగళూరు

1870 లో ఏర్పాటైన కబ్బన్ పార్క్ నగరంలోని ప్రధాన కేంద్రం – ఇది నగర పరిపాలన ప్రాంతంలోనే వుంది. ఎం జీ రోడ్డు, కస్తూర్బా రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మొదట్లో 100 ఎకరాల్లో మాత్రమె వున్న ఈ పార్క్ తర్వాత్తర్వాత 300 ఎకరాలకు విస్తరించింది. ఇక్కడ చాలా వృక్ష, పుష్ప జాతులు వున్నాయి.

మొదట్లో దీన్ని మీడేస్ పార్క్ అనేవారు. అప్పటి రాజు రజతోత్సవాల స్మారకంగా దీనికి శ్రీ చర్మరాజేంద్ర పార్క్ గా నామకరణం చేశారు. దట్టమైన వెదురు వనాల మధ్య విస్తరించి వున్న ఈ పార్క్ ను కర్ణాటక ప్రభుత్వ ఉద్యానవన శాఖ నియంత్రిస్తోంది. 

Please Wait while comments are loading...