గగన్ మహల్ బీజపూర్ నగరానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక రాజప్రాసాదం. దీనిని ఒకటవ అలి అదిల్ షా 1561 లో నిర్మించాడు. దీనినే దర్బార్ హాల్ గా కూడా వాడేవారు. ఈ చారిత్రక నిర్మాణంలో 21 మీటర్ల విశాలమైన ప్రాంగణం మరియు నాలుగు అతి పెద్ద కొయ్య స్తంభాలు మధ్యలో ఒక చక్కటి ఆర్చి ఉంటాయి. గగన్ మహల్ మొదటి అంతస్తును రాజ కుటుంబీకులు తమ నివాసంగా వాడేవారు. దాని కింది నేల అంతస్తు దర్బార్ హాల్ గా ఉపయోగించేవారు. బీజపూర్ లోని అన్ని ఆర్చీలలో కంటే, ఈ కట్టడంలోని మధ్య ఆర్చి ఎంతో పొడవు మరియు వెడల్పు కలిగి ఉంది. ఈ కట్టడం ఇపుడు చాలావరకు శిధిలం అయింది. ఈ ప్రదేశాన్ని ఒక అందమైన పార్క్ గా పునరుద్ధరించారు. హాల్ ఇపుడు ఒక ఒపేరా స్టేజ్ వలే కనపడుతుంది. ఒకవైపున ఈ హాలు అందరిచే చూడబడుతుంది. గగన్ మహల్ కు చారిత్ర ప్రాధాన్యం అధికం. దీని చుట్టూ చక్కటి ప్రహరీ గోడలు ఉంటాయి.



Click it and Unblock the Notifications