భందసేర్ జైన దేవాలయం బికనేర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన దేవాలయం. 15 వ శతాబ్దపు ఈ దేవాలయం జైనుల 5 వ తీర్థంకరుడు సుమతినాథ్ కోసం నిర్మించారు. పర్యాటకులు మంత్రముగ్ధ౦ చేసే అద్దాల పని, కుడ్య చిత్రాలు, గోడలపై బంగారపు ఆకు చిత్రాలను చూడవచ్చు. స్వచ్చమైన నెయ్యి, కొబ్బరికాయలు ఈ దేవాలయ పునాదులలో వాడారని విశ్వసిస్తారు. ఈ దేవాలయం చెక్కడాలు, కుడ్య చిత్రాలు, అందమైన నిర్మాణ౦, విగ్రహాల సొంపైన రూపకల్పనకు ప్రసిద్ది. ఎరుపు ఇసుక రాయి, తెలుపు పాలరాళ్ళను అందంగా చెక్కారు. పర్యాటకులు ఈ దేవాలయ౦ పై అంతస్తు నుండి బికనేర్ నగర దృశ్యాలను చూడవచ్చు.