Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోమ్డిలా » ఆకర్షణలు » బొమ్డిల గోమ్పాలు

బొమ్డిల గోమ్పాలు, బోమ్డిలా

1

జి ఆర్ ఎల్ ఆశ్రమంగా కూడా ప్రసిద్ది చెందినా గొంత్సే గడెన్ రాబ్గిల్ ల్లింగ్ ఆశ్రమం బోమ్డిలా వద్ద బౌద్ధ లామాలకు, సన్యాసులకు నిలయంగా ఉంది. ఇది మహాయాన బౌద్ధ లామా విశ్వాసానికి ప్రధాన కేంద్రాలలో ఒకటిగా కూడా గుర్తించబడింది. ఈ జి ఆర్ ఎల్ ఆశ్రమం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ కామెంగ్ జిల్లలో ఉంది, ఇది 1965-66 లో12 వ త్సోన గొంత్సే రింపోచే చే పునర్నిర్మించబడింది.

ఈ ప్రధాన గోమ్పా లో దిగువ గొంప, మధ్య గొంప, ఎగువ గొంప అని మూడు విభాగాలు ఉన్నాయి. ఎగువ గొంప ప్రధాన ఆశ్రమంగా భావించబడుతుంది. దిగువ గొంప ప్రధాన మార్కెట్ ప్రాంతం చివరలో ఉండడం వల్ల, టిబెటన్ ల నిర్మాణశైలి గొప్పదనాన్ని వర్ణిస్తుంది, మధ్య గొంప ప్రధాన మార్కెట్ నుండి షుమారు 2 కిలోమీటర్ల వద్ద కనుగొనవచ్చు. దిగువ గొంప లోపల ఒక పెద్ద ప్రార్ధన మందిరం ఉంది. గొంప గంట మోగిస్తే కోరికలు నెరవేరుతాయని ప్రజాదరణ పొందిన నమ్మకం.

మధ్య గొంప వద్ద, ఔషధాలకు దేవునిగా కూడా పిలువబడే నీలం ఔషధ బుద్ధుడు ఉన్నాడు, ఈ దేవుడు స్థానికుల రోగాలను నయం చేస్తాడని నమ్మకం. ప్రజలు ఆరోగ్యం కోసం ప్రార్ధనలు, ధ్యానాలు చేస్తారు. ఈ మూడు గోమ్పాలలో మధ్య గోమ్పా చాలా పురాతనమైనది.

దిగువ, మధ్య గోమ్పాలే కాకుండా, జి ఆర్ ఎల్ ఆశ్రమం లో ప్రధాన భాగమైన ఎగువ గోమ్పా కూడా ఉంది. ఇక్కడ సన్యాసుల పిల్లల పాఠశాలలతోపాటు, ప్రార్ధన మందిరం, బౌద్ధ ఆలయం ఉన్నాయి. ఎగువ గోమ్పా కొన్ని ఏళ్ళపాటు శాంతియుత బౌద్ధ బోధనలు జరగడం వల్ల ప్రధాన పర్యాటక ఆకర్షణగా గుర్తించబడింది.

ఈ గోమ్పా చుట్టూ నిర్మలమైన వాతావరణం కలిగిన ఒక శక్తివంతమైన భవనాన్ని కలిగిఉంది, ఇది మనశ్శాంతిలేని సందర్శకులకు శాంతిని ఇస్తుంది. ఈ గోమ్పా దక్షిణ టిబెట్ లోని త్సోన వద్ద త్సోన గొంత్సే ఆశ్రమానికి ప్రతిరూపంగా చెప్పబడుతుంది. ఈ జి ఆర్ ఎల్ ఆశ్రమంలో లామాలు, సన్యాసులు ప్రార్ధనలు చేసుకోవడానికి ఒక ప్రార్ధన మందిరం ఉంది. ప్రధాన గోమ్పాకి సమీపంలో ఉన్న నివాస భవనాల వద్ద లామాలు నివసిస్తారు. ఈ ఆశ్రమంలో అనుభవజ్ఞులైన లామాలు, కొత్త లామాలకు తంత్రాయణ పద్ధతులు, జీవితంలో సన్యాసి మార్గం గురించి బోధించడంలో నిమగ్నమై ఉంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri