బోమ్డిలా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్న పట్టణం భాలుక్పొంగ్. ఈ పట్టణం సముద్ర మట్టానికి 213 మీటర్ల ఎత్తున వుండడం వల్ల పర్యాటకులు ప్రకృతి దృశ్యాలను చక్కగా చూడవచ్చు. ఈ పట్టణాన్ని 52 కిలోమీటర్ల దూరంలో వున్న తేజ్ పూర్ నుంచి కూడా తేలిగ్గానే చేరుకోవచ్చు.
చరిత్ర ప్రకారం, భాలుక్పొంగ్ ని ‘ఆకా’ గా పిలువబడే స్థానిక గిరిజన పాలకులు పరిపాలి౦చారు. ఈ పట్టణం అప్పుడప్పుడు అస్సాం, భూటాన్ నుండి రాజకీయ ఆధిపత్యానికి కూడా గురైంది. 1873 బ్రిటీష్ వారి పరిపాలనలో, అరుణాచల్ ప్రదేశ్ లోని ఈ ప్రాంతం పరిమితులు లేనట్లు ప్రకటించింది. ఎక్కువభాగం ఆకా తెగకు చెందిన భాలుక్పొంగ్ లోని స్థానికులు, జనవరిలో ‘న్వేతి డౌ’ అనే వార్షిక పండుగను జరుపుకుంటారు.
అద్భుతమైన అందాన్నే కాకుండా, భాలుక్పొంగ్ పట్టణం సందర్శకులకు వినోద కార్యకలాపాలను కూడా అందిస్తుంది, వీటిలో ప్రధానమైనవి చేపలు పట్టడం, రివర్ రాఫ్టింగ్, ఇది కామెంగ్ నది పొడవునా ఉంది. అదనంగా, భాలుక్పొంగ్ లో సందర్శకుల ద్రుష్టిపడే 80 రకాల జాతుల నుండి 2600 కుపైగా పూతోటలు పాండిచే చోట పాఖుయి గేమ్ అభయారణ్యం, టిపి ఆర్చిడారియుర్మ్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.