చంద్ర ప్రభ స రక్షణా కేంద్రం చందౌలీ జిల్లాలో చారిత్రక నగరమైన వారణాసికి 70 కీ మీ దూరం లో ఉంది. దీనిలో అనేక పిక్నిక్ కి అనువుగా ఉన్న స్థలాలు, రాజ్ దరీ దేవ్ దరీ జలపాతాలు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ సంరక్షణా కేంద్రం 1957లో ఆసియా సింహాల సంరక్షణార్ధం నిర్మించారు. ఈ జాతి సిమ్హాల సంఖ్య గణనీయం గా పడిపోయినా ఇక్కడ సింహాలే కాకుండా ఇతర జంతువులైన ముళ్ళపంది,బ్లాక్ బక్ గా పిలవబడే ఒక రకమైన జింక,చీతా, అడవి పంది,సాంభార్,నీల్గాయ్,ఇండియన్ గేజెల్ గా పిలవబడే ఒక రకమైన మ్రుగము ఉన్నాయి.
ఇంకా పాకే ప్రాణులైన కొండ చిలువ మరియు అదే జాతికి చెందిన ఘరియల్ కూడా ఉన్నాయి. ఈ సంరక్షణా కేంద్రం పక్షి ప్రేమికులకి స్వర్గ ధామం. ప్రతీ సంవత్సరం దాదాపు 150 రకాల పక్షులని ఆకర్షిస్తూ ఉంటుంది. వీటిల్లో వలస పక్షులు కూడా ఉంటాయి. ఈ సంరక్షణా కేంద్రం ఎండు గడ్డి మరియు ఆకు రాలే చెట్లతో నిండి ఉంటుంది. ఈ సం రక్షణా కేంద్రం 78 చదరపు కిలో మీటర్ల వైశాల్యంతో నౌగర్, విజయ్ గర్ కొండల మధ్యలో విధ్య పర్వత శ్రేణుల్లో ఉంది.ఇక్కడకి రావటానికి అక్టొబరు నుండీ ఫిబ్రవరి వరకు అనువైన కాలం. ఇక్కడకి వచ్చేయాత్రికులకి నివాస సదుపాయాలు లేకపోయిన ఇక్కడ ఉన్న పలు ఫలహార శాలల నుండి తినుబండారాలు కొనుక్కోవచ్చు.



Click it and Unblock the Notifications