బెత్వ నది ఒడ్డున ఉన్న అందమైన గ్రామం దేయోఘర్ . సహజ సిద్దమైన ప్రకృతి అందాలను దుప్పటిలా కప్పుకున్న ఈ చిన్న గ్రామానికి ఘనమైన చారిత్రక నేపధ్యం ఉంది. చందేరి నుండి 71 కిలోమీటర్ల దూరం లో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక కేంద్రం.
పురాతత్వ ప్రాధాన్యత కలిగిన అనేక కట్టడాలకి అలాగే భవనాలకి ఈ గ్రామం నిలయం. ఈ గ్రామం లో ఉన్న వివిధ ఆకర్షణీయమైన కట్టడాలలో 5 వ శతాబ్దానికి చెందిన దశావతార్ విష్ణు యొక్క ఆలయం ప్రసిద్ది చెందినది. అద్భుతంగా నిర్మించబడిన ఈ ఆలయం గుప్తు ల కాలం నాటి నిర్మాణ శైలి ని ప్రతిబింబిస్తుంది. వైవిధ్యభరితమైన శిల్పాలకు వరాహ టెంపుల్ ప్రసిద్ది.
కీర్తి గిరి అనబడే కొండ పైన ఓ\కోట రాజా కీర్తి వర్మన్ చేత 12 వ శతాబ్దం లో నిర్మించబడింది. జైనుల రాతి శిల్పాల సేకరణ ఈ గ్రామం లో గమనించవచ్చు. ప్రకృతి ప్రేమికులకి మహావీర్ వైల్డ్ లైఫ్ సాంచురీ వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలం తో ఆకట్టుకుంటుంది.



Click it and Unblock the Notifications