ఆకట్టుకునే చందేరీ చీరలకు ఈ ప్రాంతం లో ఉన్న చేనేత విభాగం (హ్యాండ్ లూం యూనిట్) ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. సిల్క్, కాటన్ ల తో తయారయిన చీరలకి అలాగే బ్రోకేడ్స్ మరియు మస్లిన్స్ తో నేసిన చీరలకి చందేరీ ప్రసిద్ది. చందేరీ నేత పద్దతి క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి చెందినది. అద్భుతమైన ఈ నేత దేశం లో ని రాజులని అలాగే రాణులని కూడా ఆకట్టుకుంది.
క్రీ.శ. 11 వ శతాబ్దం నుండి చన్దెరీ నేత రాజ వంశీకులలో ప్రాచుర్యం పొందింది. పారదర్శక నిర్మాణం, తో పాటు తేలిక పాటి భరువు ఇంకా పరిపూర్ణ నిర్మాణం చందేరీ వస్త్రం సొంతం. ఘనం గా అలకరించబడిన బంగారపు వర్ణం బార్డర్ ఇంకా సున్నితమైన రంగు చందేరీ చీరల యొక్క ప్రత్యేకత.
చందేరీ చీరాల యొక్క తయారీదారులు ఘనమైన వారసత్వానికి వాహకులు. సూట్ పీస్ ల కి, స్కార్ఫ్ ల కి ఇంకా దుపట్టాలకి కూడా చందేరీ సిల్క్ ని వాడతారు. చందేరీ చీరలు ఇంకా ఇతర ఐటమ్స్ ని విదేశాలకు ఎగుమతి కూడా చేస్తారు.



Click it and Unblock the Notifications