జార్జ్ టౌన్ లోని తంబు చెట్టి స్ట్రీట్ లో ఈ కాళికాంబాల్ ఆలయం ఉంది. ఈ నగరం యొక్క ప్రధాన ఆర్ధిక కేంద్రం ఇది. కొన్ని ప్రాంతాల్లో కామాక్షీ దేవిగా పుజలన్డుకునే హిందూ దేవత కాళికాంబాల్ కి ఈ ఆలయం అంకితమివ్వబడినది.
పూర్వపు ఆలయం ద్వంసం కాగానే ప్రస్తుతం కనబడుతున్న ఆలయాన్ని 1640లో నిర్మించారు. ఇంతకు పూర్వపు ఆలయం తీరానికి దగ్గరలో ఉండేది. ఇది పోర్టుగీస్ వారిచే ద్వంసం చేయబడినదని అంటారు. స్థానిక పురాణాల ప్రకారం, కామాక్షీ దేవి వారి ఉగ్ర రూపం అయిన కాళికాంబాల్ ని ఇక్కడ పూజిస్తారు. శక్తివంతం అలాగే ఉగ్రరూపంలో ఈ అమ్మవారు దర్శనమిస్తారు. కామాక్షీ దేవిని శాంత స్వరూపురాలిగా కీర్తిస్తారు.



Click it and Unblock the Notifications