చెన్నై లో ని ఉన్న ఈ బీచ్ అత్యంత ప్రాచుర్యం పొందినది. బే ఆఫ్ బెంగాల్ లో భాగం అయిన ఈ బీచ్ నగరానికి ఉత్తరాన ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుండి దక్షిణాన ఉన్న బెసంట్ బీచ్ వరకు ఉంటుంది. మరీనా బీచ్ యొక్క మొత్తం పొడవు 13 కిలోమీటర్లు. భారత దేశం లో నే అతి పెద్దదైన బీచ్ గా ప్రసిద్ది చెందగా ప్రపంచం లో నే రెండవ అతి పెద్దదైన బీచ్ గా ప్రసిద్ది చెందింది.
అత్యద్భుతమైన అందం తో ఈ బీచ్ పర్యాటకుల మనసులను దోచుకుంటుంది. కానీ, ఈ బీచ్ నీళ్ళు ప్రస్తుతం కలుషితం కాబడ్డాయి. నిర్లక్ష్యం, పర్యాటకుల యొక్క అజాగ్రత్త వైఖరి ఈ జల కాలుష్యానికి కారణం. ప్రతి నెల ఈ బీచ్ యొక్క సహజ సిద్దమైన అందాన్ని మెరుగుపరిచేందుకు ఏంతో మంది స్వచ్చంద సేవకులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ బీచ్ యొక్క పరిసరాలని శుభ్రపరుస్తారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల యొక్క గూడ్ల ని సంరక్షించడం లో కూడా ఈ వాలంటీర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.