పంచబోల్ పాయింట్, బీర్ లేక్ నుండి 4 కి.మీ.ల దూరంలో కల ఒక సుందర దృశ్యం. ఇక్కడినుండి చుట్టు పక్కల ప్రదేశాలను కూడా పరిశీలించవచ్చు. ఒకవైపు కాఫీ తోటలు కలవు. మరో వైపుగా అయిదు కొండలు కలసి ఏర్పరచిన ఒక లోయ కలదు. పంచబోల్ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, మీరు కనుక అక్కడ చప్పట్లు కొడితే, అయిదు సార్లు ప్రతిధ్వనిస్తుంది.