సమయం దొరికితే, బాబా భూదాన్ గిరి కొడల సమీపంలోని మాణిక్య ధార జలపాతాలను కూడా చూడవచ్చు. ఇది చిక్కమగలూరు పట్టణానికి 40 కి.మీ. దూరంలో కెమ్మనగుండి దిశగా ఉంది. ఈ జలపాతం షోలా అటవీ ప్రాంతంలో ఉంది. హిందువులకు ముస్లింలకు ఒక పవిత్ర స్ధలంగా చెప్పబడుతుంది. ప్రశాంతంగా సమయాన్ని గడపాలనుకునేవారికి ఇది ఒక మంచి ప్రదేశం. స్ధానికుల నమ్మకం మేరకు ప్రవక్త హజరత్ దాదా హయత్ మీర్ ఖలాండర్ తన నలుగురు శిష్యులతో ఇక్కడకు వచ్చి దప్పిక వేయగా పర్వతానికి ప్రార్ధనలు చేశాడని, అక్కడ జలపాతం ఏర్పడటంతో దప్పిక తీర్చుకున్నాడని చెపుతారు. ఈ నీరు అనేక వ్యాధులను కూడా నివారణచేస్తుందని చెపుతారు. ఈ ప్రాంతం చేరే పర్యాటకులు స్ధానిక దుకాణాలలోని వనమూలికల ఔషధాలను వివిధ వ్యాధుల నివారణకు కొనుగోలు చేస్తారు.



Click it and Unblock the Notifications