కర్ణిమాత దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు. డెష్నోక్ లో పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో దుర్గా దేవత అవతారమైన కర్ణి మాత పూజించబడుతుంది.. ఇతిహాసాలమేరకు, రావు బికాజీ, అంటే బికనీర్ నగరం నిర్మాతకు కర్ణిమాత అనుగ్రహం దొరుకుతుంది. అప్పటినుండి ఆ మాతను బికనీర్ వంశ పాలకులు కొలుస్తారు. ఈ దేవాలయం 20వ శతాబ్దంలో రాజు గంగా సింగ్ చే నిర్మించబడింది. ఈ దేవాలయంలో మార్బుల్ చెక్కడాలు చాలా కలవు. ప్రవేశ ద్వారం గేటు చాలా పెద్దది. ఇది వెండితో చేయబడింది. కాబాస్ అని పిలువబడుతూ తిరిగే ఇక్కడి ఎలుకలను పూజిస్తారు. వీటిని అమ్మవారి పిల్లల ఆత్మలుగా భావిస్తారు. వీటికి అత్యధిక మతపర ప్రాధాన్యం ఇతస్తారు. ఎలుక కనపడిందంటే చాలు శుభ సూచకంగా భావిస్తారు. ఎలుక కనుక తమ కాళ్ళను స్పర్శిస్తే చాలు ఎంతో మంచిదని భావిస్తారు. ఈ కాబాలు భక్తులు అందించే ప్రసాదం తిని జీవిస్తాయి.



Click it and Unblock the Notifications