బింబట్ యుద్ధ స్మృతి చిహ్నం అని కూడా పిలవబడే ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం ద్రాస్ పట్టణ ప్రధాన ఆకర్షణ. నగర కేంద్ర భాగానికి “టైగర్ హిల్” కి మీదుగా 5 కిమీ దూరంలో ఉన్న స్మృతి చిహ్నం, కార్గిల్ యుద్ధ అమరవీరులను జ్ఞప్తికి తెస్తుంది. స్మారక చిహ్నం యొక్క ముఖద్వారం మీద చెక్కబడిన, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తండ్రి, హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన పద్యం, సందర్శకులను పలకరిస్తుంది. స్మృతి చిహ్నం గోడపై చెక్కబడి ఉన్న, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లను సందర్శకులు చదవవచ్చు.
యుద్ధ స్మృతి చిహ్నానికి ఆనుకుని ఉన్న సంగ్రహాలయం 'ఆపరేషన్ విజయ్' ను గుర్తుకు తెచ్చుకునేందుకు స్థాపించబడినది. ఇక్కడ కార్గిల్ యుద్ధం నుంచి సేకరించబడిన భారతీయ సైనికుల చిత్రాలు, ముఖ్యమైన యుద్ధ పత్రాలు మరియు ధ్వని ముద్రణలు (రికార్డింగులు), పాకిస్తాన్ యుద్ధ పరికరాలు మరియు యుద్ధ దుస్తులు, మరియు భారత సైన్యం అధికారిక చిహ్నాలు చూడవచ్చు. 'ఆపరేషన్ విజయ్' అనే పేరు శత్రు సైన్యాన్ని కార్గిల్ నుంచి తరిమివేసే సైనికచర్యకు ఇవ్వబడినది. హిందీ లో “విజయ్” అంటే విజయం.



Click it and Unblock the Notifications